ఈ రాశి వారికి శుభవార్తలు, వస్తు లాభాలు

Today Horoscope 20-01-2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: బ.త్రయోదశి ఉ.7.55 వరకు, తదుపరి చతుర్దశి తె.5.40 వరకు, నక్షత్రం: మూల ఉ.11.14 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.9.44 నుండి 11.14 వరకు, తదుపరి రా.8.11 నుండి 9.43 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.53 నుండి 9.43 వరకు, తదుపరి ప.12.34 నుండి 1.18 వరకు, అమృతఘడియలు: తె.5.10 నుండి 6.13 వరకు

సూర్యోదయం: 5.39
సూర్యాస్తమయం: 5.44
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.

వృషభం: బాధ్యతలతో సతమతం కాగలరు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగక డీలా పడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిథునం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: గతం నుండి వెంటాడుతున్న సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆకస్మిక దనలబ్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

సింహం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరాదు.

కన్య: ఎంత కష్టించినా పలితం కనిపించదు. భూవివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: కొత్త పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి అవుతుంది.

వృశ్చికం: రుణాలు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ ఊహలకు తగ్గట్టుగా ఉంటాయి.

మకరం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కుంభం: కష్టం ఫలిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి

మరిన్ని వార్తలు :

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top