
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.షష్టి తె.5.47 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి సప్తమి, నక్షత్రం: చిత్త రా.10.25 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: తె.4.05 నుండి 5.42 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.6.33 నుండి 8.05 వరకు, అమృతఘడియలు: ప.3.46 నుండి 5.23 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.34, సూర్యాస్తమయం: 5.55.
మేషం: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: పనుల్లో ప్రతిష్ఠంభన. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మిథునం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తుంది.
కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యలు, వివాదాలు తీరతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
సింహం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా మారవచ్చు.
కన్య: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి.
వృశ్చికం: నూతన ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థిక ప్రగతి ఉంటుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు.
ధనుస్సు: వ్యవహారాలలో పురోగతి. ఆకస్మిక ధనలాభం. భూవివాదాలు పరిష్కారం. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.
మకరం: ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. సోదరులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
కుంభం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనులలో జాప్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి.