ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి

Today Horoscope 08 11 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: పౌర్ణమి ప.3.42 వరకు, తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం: భరణి రా.1.41 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ఉ.10.49 నుండి 12.29 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.07 వరకు తదుపరి రా.10.27 నుండి 11.18 వరకు,

అమృతఘడియలు: రా.8.44 నుండి 10.22 వరకు, పాక్షిక చంద్రగ్రహణం;
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు;
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు;
సూర్యోదయం 6.04;
సూర్యాస్తమయం 5.24. 

మేషం: పనులు విజయవంతంగా ముగిస్తారు. సమావేశాలలో పాల్గొంటారు. రాబడి మరింత పెరుగుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

వృషభం: పరిస్థితులతో రాజీపడలేక పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థికంగా పటిష్టమవుతారు. చిన్ననాటి మిత్రుల చేయూత. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

కర్కాటకం: అనుకున్న పనులు సకాలంలో చక్కదిద్దుతారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.

సింహం: కార్యక్రమాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలలో వివాదాలు. ఉద్యోగాలలో చిక్కులు.

కన్య: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు అధిగమిస్తారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం: కొత్త పరిచయాలు. శుభవార్తలు అందుతాయి. ఏ పని చేపట్టినా విజయమే. సన్నిహితులు దగ్గరవుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ప్రయాణాలు రద్దు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: ముఖ్య కార్యక్రమాలు మందగిస్తాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం: పనుల్లో విజయం. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు.

మీనం: ఆత్మీయులతో విభేదిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి ఒత్తిడులు లేదా విమర్శలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top