Today Horoscope Telugu: ఈ రాశి వారికి అన్నింటా విజయమే, ఆకస్మిక ధనలాభం

Horoscope Today 29 01 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.అష్టమి ప.2.02 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: భరణి రా. 12.52 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ఉ.10.15 నుండి, 11.50 వరకు, దుర్ముహూర్తం: సా.4.20నుండి 5.04 వరకు, అమృతఘడియలు: రా.7.54 నుండి 8.34 వరకు.

సూర్యోదయం        :  6.38
సూర్యాస్తమయం    :  5.49
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. చర్చల్లో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం: శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

మిథునం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

కర్కాటకం: శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు.

తుల: పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. విందు వినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

ధనుస్సు: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందికరంగా సాగుతాయి.

మకరం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

కుంభం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు విజయం. శుభవార్తలు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.

మీనం: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top