
రావలసిన మొత్తాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు నూతనోత్సాహాన్నిస్తాయి.
శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శు.విదియ ఉ.9.24 వరకు తదుపరి తదియ నక్షత్రం పూర్వాభాద్ర ఉ.10.04 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం రా.7.14 నుండి 8.46 వరకు దుర్ముహూర్తం ప.11.50 నుండి 12.36 వరకు అమృతఘడియలు... తె.4.26 నుండి 5.58 వరకు(తెల్లవారితే గురువారం)
రాహుకాలం ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం ఉ.7.30 నుండి 9.00 వరకు
సూర్యోదయం 6.28
సూర్యాస్తమయం 6.00
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృషభం: రావలసిన మొత్తాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు నూతనోత్సాహాన్నిస్తాయి.
మిథునం: సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ మేథస్సును ప్రముఖులు గుర్తిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలు బలపడతాయి.
కర్కాటకం: శ్రమ మరింత పెరుగుతుంది. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆరోగ్యం సహకరించ పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం: వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కన్య: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారి పరిచయం. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
తుల: రుణబాధలు తీరతాయి. ఆప్తులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఏ పని చేపట్టినా విజయమే. వ్యాపార, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగలవు.
వృశ్చికం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబబాధ్యతలు అధిగమవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
ధనుస్సు: దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధుమిత్రుల నుండి ఇబ్బందులు. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మకరం: మీ శ్రమ కొంత ఫలిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాలు చివరిలో వాయిదా. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.
మీనం: ఊహించని విధంగా పనులు పూర్తి. ధనలబ్ధి. చర్చలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.