
చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.సప్తమి సా.5.55 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: శతభిషం రా.7.41 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.1.42 నుండి 3.12 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.29 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: ప.12.48 నుండి 1.55 వరకు
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.29
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలకు హాజరవుతారు. దైవదర్శనాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: రుణాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
మిథునం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.
కర్కాటకం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
సింహం: శుభవార్తలు వింటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
తుల: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయదర్శనాలు.
వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
మకరం: వ్యవహారాలు మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. విద్యార్థులకు నిరుత్సాహం.
కుంభం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మీనం: ఆదాయం పెరుగుతుంది. కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.