
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: పౌర్ణమి ఉ.9.08 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: జ్యేష్ఠ తె.4.39 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి మూల, వర్జ్యం: ఉ.10.46 నుండి 12.21 వరకు, దుర్ముహూర్తం: సా.4.47 నుండి 5.40 వరకు, అమృతఘడియలు: రా.7.55 నుండి 9.23 వరకు, ఏరువాక పౌర్ణమి.
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.27
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృషభం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రయత్నాలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.
మిథునం: మిత్రుల నుంచి కీలక సమాచారం. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు.
కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి..
తుల: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన.
వృశ్చికం: శుభకార్యాలకు హాజరవుతారు. శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. గృహ, వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
ధనుస్సు: పనులు వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. ఆరోగ్యభంగం.
మకరం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం.
మీనం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.