రాశిఫలాలు: ఈ రాశివారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు

daily horoscope today telugu 20 11 2023  - Sakshi

శ్రీశోభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.అష్టమి రా.3.18 వరకు తదుపరి నవమి, నక్షత్రం: ధనిష్ఠ రా.10.16  వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: తె.4.56 నుండి 6.25 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.57 వరకు, తదుపరి ప.2.24 నుండి 3.12 వరకు, అమృతఘడియలు: ప.12.31 నుండి 2.01 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.09, సూర్యాస్తమయం: 5.21.

మేషం.. సంఘంలో ఎనలేని గౌరవం. కీలక సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో గందరగోళం. దైవదర్శనాలు.

మిథునం... ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం..... చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహం.... ఉద్యోగయత్నాలు సాఫల్యం. సంఘంలో ఆదరణ. అప్రయత్న కార్యసిద్ధి. ఆలయ దర్శనాలు.  వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

కన్య... ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

తుల.... కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం.

వృశ్చికం... ప్రముఖుల నుంచి ముఖ్యసమాచారం. ధనలాభం. కార్యసిద్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి.  వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.. ఆలయాలు సందర్శిస్తారు.

ధనుస్సు.... ఆప్తులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు సంభవం. విలువైన వస్తువులు భద్రం. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

మకరం... చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అందరిలోనూ గుర్తింపు. సేవాధృక్ఫథం పెరుగుతుంది. ధనలాభ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

కుంభం.... కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు.

మీనం... ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top