రాశిఫలాలు: ఈ రాశివారికి ధన,వస్తులాభాలు, వాహన యోగం | Horoscope Today 03 October 2023 In Telugu - Sakshi
Sakshi News home page

రాశిఫలాలు: ఈ రాశివారికి ధన,వస్తులాభాలు, వాహన యోగం

Oct 3 2023 6:46 AM | Updated on Oct 3 2023 10:00 AM

Daily Horoscope Today Telugu 03 October 2023 - Sakshi

గ్రహఫలం..మంగళవారం, 03.10.23

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం,
సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.47
తిథి: బ.చవితి ఉ.9.35 వరకు, తదుపరి పంచమి,
నక్షత్రం: కృత్తిక రా.10.24 వరకు, తదుపరి రోహిణి,


వర్జ్యం: ఉ.10.28 నుండి 12.03 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.36 నుండి 11.27 వరకు,
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు


అమృతఘడియలు: రా.8.02 నుండి 9.34 వరకు.

మేషం: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

వృషభం: ప్రయత్నాలు సఫలం. సంఘంలో గౌరవం. ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. కొత్త పరిచయాలు.  పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. 

సింహం: ఆధ్యాత్మిక చింతన. విలువైన సమాచారం. బంధువుల కలయిక.  నూతన పదవీయోగం. ముఖ్య నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

తుల: పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమార్పులు. ఆరోగ్యభంగం.

వృశ్చికం: పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

ధనుస్సు: ఆలోచనలు కలసివస్తాయి. నూతన విద్య, ఉద్యోగయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మకరం: చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. అనుకోని సంఘటనలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: ఉద్యోగాలలో ఉన్నతహోదాలు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement