ఈ రాశి వారికి అన్నింటా గెలుపు, ఆకస్మిక ధనలాభం | Horoscope Today: 14 September 2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి అన్నింటా గెలుపు, ఆకస్మిక ధనలాభం

Sep 14 2023 6:54 AM | Updated on Sep 14 2023 8:17 AM

Daily Horoscope Today 14 09 2023 Rashi Phalalu Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, నిజ శ్రావణ  మాసం, తిథి: అమావాస్య పూర్తి (24గంటలు), నక్షత్రం: పుబ్బ తె.5.09 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి ఉత్తర, వర్జ్యం: ఉ.11.26 నుండి 1.12 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.44 వరకు, తదుపరి ప.2.46 నుండి 3.35 వరకు, అమృతఘడియలు: రా.10.03 నుండి 11.34 వరకు, పోలాల అమావాస్య;

రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు,
సూర్యోదయం: 5.50, సూర్యాస్తమయం: 6.03. 

మేషం: చేపట్టిన కార్యాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

వృషభం: కుటుంబసభ్యులతో కలహాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

మిథునం: రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

కన్య: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

తుల: ఆకస్మిక  ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు ఉన్నతి.

వృశ్చికం: ఇంటాబయటా అనుకూలం. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగలాభం. కార్యసిద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

మకరం: కొత్తగా రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

కుంభం: కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం: శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement