డీఎస్పీ ఆఫీస్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన | Venkata Reddy Karmuru Arrest Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

డీఎస్పీ ఆఫీస్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన

బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి కోర్టు

  • వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ని తాడిపత్రి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

  • వైద్య చికిత్సల అనంతరం కోర్టు లో హాజరుపరిచిన పోలీసులు

  • వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి కి ఊరట

  • బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి కోర్టు

  • వైఎస్సార్ సీపీ నేత కారుమూరు వెంకటరెడ్డిని నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు

  • టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సీఐ సతీష్ కుమార్ మృతి పై సోషల్ మీడియా లో పోస్టింగ్ పెట్టారని అభియోగాలు

  • వాదనలు విన్న తర్వాత బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి కోర్టు

  • కారుమూరు వెంకటరెడ్డి ని పరామర్శించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
    అనంతపురం:

  • వైఎస్సార్ సీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి కి బెయిల్ మంజూరు ను స్వాగతిస్తున్నాం

  • తాడిపత్రి కోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు సర్కార్ కు చెంపపెట్టు

  • అక్రమ కేసులతో వైఎస్సార్ సీపీ నేతలను వేధించటం బాధాకరం

  • చంద్రబాబు సర్కార్ భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తోంది - వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

2025-11-19 01:02:00

తాడిపత్రి పీఎస్‌కు వెంకటరెడ్డి..!

  • తాడిపత్రి పీఎస్‌కు వెంకటరెడ్డి తరలింపు
  • గుంతకల్లు డీఎస్సీ ఆఫీస్‌ నుంచి తాడిపత్రి తరలింపు
2025-11-18 22:08:57

గుంతకల్లు డీఎస్పీ ఆఫీస్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన

అనంతపురం

  • గుంతకల్లు డీఎస్పీ ఆఫీస్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన
  • కారుమురు వెంకటరెడ్డిని గుంతకల్లు తీసుకొచ్చిన పోలీసులు
  • ఉదయం నుండి పోలీసులు అడుపులోనే ఉన్న వెంకటరెడ్డి
  • వెంకటరెడ్డిని తక్షణమే విడుదల చెయ్యాలని ఆందోళన
  •  జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో  వైఎస్సార్‌సీపీ నిరస
  • పీఎస్‌కు  వైఎస్సార్‌సీపీ నాయకులు..  ఎమ్మెల్యే విరూపాక్షి
  • వెంకటరెడ్డికి మద్దతుగా స్టేషన్‌కి  వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి, MLC వై. శివరామిరెడ్డి, YCP జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి
2025-11-18 20:54:00

గుంతకల్లు డీఎస్పీ ఆఫీసుకు కారుమూరు వెంకట్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి అరెస్ట్

గుంతకల్లు పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు

గుంతకల్లు డీఎస్పీ ఆఫీసులో తాడిపత్రి పోలీసులు విచారణ

వెంకటరెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి,ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి, వైఎస్సార్‌జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తరలివచ్చారు. 
 

2025-11-18 20:15:58

కారుమూరి కుటుంబ సభ్యుల్ని భయ బ్రాంతులకు గురి చేసిన పోలీసులు

  • కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై పెరిగిపోతున్న ఆగడాలు
  • హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్‌ చేసిన ఏపీ పోలీసులు 
  • కనీసం నోటీసులు లేకుండా వెంకట్ రెడ్డిని అరెస్టు చేసిన తాడిపత్రి పోలీసులు
  • వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు
  • కుటుంబ సభ్యుల ఫోన్‌లు లాక్కుని బెదిరింపులు 
  • పోలీసుల తీరుపై వెంకట రెడ్డి భార్య ఆగ్రహం
2025-11-18 15:40:18

ప్రశ్నిస్తున్న గొంతుల‌పై అణ‌చివేత‌: బీవీ రావు

త‌మ‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అక్రమ అరెస్టును వైఎస్సార్‌సీపీ  రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శి బీవీ రావు ఖండించారు. 

ఏలూరు జిల్లాలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నిస్తున్న గొంతులను కూటమి ప్రభుత్వం అణచివేస్తోంద‌ని, పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టులు చేయిస్తోంద‌ని మండిప‌డ్డారు. వెంకటరెడ్డిని గుండాల మాదిరిగా అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిలోని ఆడవాళ్ల ఫోన్లు లాక్కొని భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. 

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ఇటువంటి అక్రమ అరెస్టులతో ఎక్కువ కాలం మనుగడ సాగించలేరని, అన్యాయాలను ప్రశ్నించే ప్రజల గొంతును అణిచివేయలేరని అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వ అన్యాయాలను, అక్రమాలను ధైర్యంగా ప్రజల్లోకి తీసుకెళ్తామ‌ని బీవీ రావు చెప్పారు. 

2025-11-18 14:46:25

వెంకటరెడ్డిని విడుదల చేయాలి: ఎమ్మెల్యే తాటిపర్తి

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటమే నేరంగా వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయటం దుర్మార్గమ‌ని వ్యాఖ్యానించారు. 

తాడేపల్లిలో మంగ‌ళ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆయన పని ఆయన చేయడు. ప్రతిపక్షంగా మా పాత్ర మేం పోషిస్తుంటే అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. టీటీడీ పరకామణి ఉద్యోగి సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందారు. దీనిమీద టీడీపీకి చెందిన పలువురు నేతలు ఇష్టానుసారం మాట్లాడారు. ఆయనకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? చేతకాని దద్దమ్మ ప్రభుత్వం తమ మీద వచ్చిన నిందను కప్పిపుచ్చుకోవడానికి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసింది. పోస్ట్ మార్టం నివేదిక కూడా రాకముందే ఏ విధంగా హత్య అని చెప్తారు. మీరు ఎలా నిర్ధారించారు? ఏ వివరాలు లేకపోయినా తమకు అనుకూలంగా కథలు అల్లుతారు. 

రాష్ట్రంలో ఎన్ని తప్పులు జరుగుతున్నా ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదు. పవన్ కళ్యాణ్ 30 వేల మంది అమ్మాయిలను వాలంటీర్లు తరలించాలని అసత్యాలు మాట్లాడారు.. ఆయనపై కేసు పెట్టొద్దా? రాష్ట్రంలో జరుగుతున్న హత్యకేసుల్లో ఎంతమందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు.విచ్చలవిడిగా అధికారుల మీద దాడులు జరుగుతూనే ఉన్నా కేసులు పెట్టలేదు. గోమాంసం టన్నులు, టన్నులు పట్టుకుంటే దాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

2025-11-18 14:31:35

వెంకటరెడ్డి అరెస్ట్ హేయమైన చర్య: మనోహర్ రెడ్డి

రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు అధికార ప్రతినిధులుగా ఉన్న వారిని కూడా అరెస్టులు చేసే దుష్ట సంప్రదాయానికి  కూటమి ప్రభుత్వం తెరదీసిందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయటం హేయమైన చర్యన్నారు. 

అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఉద్దేశ్యంతోనే సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీఐ సతీష్ మృతిపై ఆయన కేవలం కొన్ని అనుమానాలను వెలిబుచ్చారని  నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారని దానికే అరెస్టు చేశారన్నారు. రాత్రి తాడిపత్రిలో ఇచ్చిన ఫిర్యాదుకు ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేశారని పోలీసు వ్యవస్థ ఇంతలా దిగజారిపోవటం చాలా బాధాకరంగా ఉందన్నారు. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.

2025-11-18 13:50:22

రాజకీయ నాయకులకు మాట్లాడే హక్కులేదా?: అంబటి రాంబాబు

వైఎస్సాఆర్‌సీపీ అధికార ప్రతినిధికి కనీసం నోటీసులివ్వకుండా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఇది చాలా దారుణమన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులని అడిగితే స్పందించడం లేదన్నారు. పరకామణి చోరీ కేసులో విచారణ కెళ్తూ సీఐ చనిపోయారని అతనిది హత్యా, ఆత్మహత్యా అనే విషయం ఇప్పటివరకూ తేలలేదన్నారు. రాజకీయ నేతలు మాట్లాడకూడదా చంద్రబాబు, లోకేశ్ చెబితే అరెస్టు చేయడమేనా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. 
 Ambati: కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

2025-11-18 13:26:24

వెంకటరెడ్డి అరెస్ట్ చాలా దుర్మార్గం: సుధాకర్ బాబు

కారుమూరు వెంకటరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయటం చాలా దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. వైఎస్సార్‌సీపీ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారనే ఉద్దేశ్యంతోనే ఆయనను అరెస్టు చేశారని తెలిపారు.కూటమి ప్రభుత్వం ఆగడాలకు హద్దు అదుపులేకుండా పోయిందని ఆరోపించారు.

2025-11-18 12:56:19

వెంకట్ రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం: ఎమ్మెల్సీ మాధవరావు

ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరించాలని చూస్తుందని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు. ఇతర వ్యక్తులు మాట్లాడితే ఏమి పట్టని ప్రభుత్వానికి కేవలం వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారిపై అ‍క్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలను గాలికి వదిలేసి టీడీపీ పార్టీ కోసం పోలీసులు పనిచేస్తున్నారని అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ నేతలను భయపెట్టాలని చూస్తే అది సాధ్యమయ్యే పని కాదని మాధవరాపు హెచ్చరించారు.
 

 

 

2025-11-18 12:30:41
Advertisement
 
Advertisement
Advertisement