ఏనుగుల దినోత్సవం నాడే గజరాజు మృతి | Elephant Deceased On Elephant Day | Sakshi
Sakshi News home page

ఏనుగుల దినోత్సవం నాడే గజరాజు మృతి

Aug 13 2020 8:27 AM | Updated on Aug 13 2020 8:27 AM

Elephant Deceased On Elephant Day - Sakshi

మృతి చెందిన ఏనుగు

జియ్యమ్మవలస (కురుపాం): ప్రపంచ ఏనుగుల దినోత్సవం నాడే ఓ ఏనుగు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని వెంకటరాజపురంలో జరిగింది. వారం రోజుల నుంచి ఏనుగులు వెంకటరాజపురం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. అందులో ఒక ఏనుగు ఆదివారం తప్పిపోయింది. మిగిలిన ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోగా తప్పిపోయిన ఏనుగును కూడా గుర్తించలేక పోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఏనుగు మృతి చెందిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, అనారోగ్య కారణాలతోనే ఏనుగు మృతి చెందినట్లు కురుపాం అటవీ రేంజర్‌ ఎం.మురళీకృష్ణ తెలిపారు. తప్పిపోయిన ఏనుగు కోసం గాలిస్తుండగా వెంకటరాజపురం పంట పొలాల్లో బుధవారం ఏనుగు మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement