పాయకరావుపేట: రైలు ఢీకొని గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తుని రైల్వే పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని రాజీవ్ కాలనీ ఎదురుగా ఉన్న రైల్వే గేట్ సమీపాన ఓ వ్యక్తి పట్టాలు దాటుతుండగా ఈనెల 17న రైలు బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. 108లో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు పసగడుగుల సత్యనారాయణ(55) పి.కొత్తపల్లి గ్రామంగా తెలిసిందన్నారు. డి.పోలవరం గ్రామం వెళ్లేందుకు పట్టాలు దాటుతున్నట్లు తెలిపారు. మృతుడు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.