
దేవరాపల్లి: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై దృష్టిసారించాలని, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆకాంక్షించారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సెపక్ తక్రా రాష్ట్ర స్థాయి చాంపియన్ షిప్ పోటీలు అనంతపురం జిల్లాలో జరిగాయి. ఇందులో పాల్గొన్న మండలంలోని పెదనందిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు అండర్–14, 17 విభాగాల్లో సత్తా చాటారు. వీరిని శుక్రవారం డిప్యూటీ సీఎం అభినందించారు. హెచ్‌ఎం శ్రీనివాసరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ అప్పలనాయుడు పాల్గొన్నారు.