
చోడవరం: తప్పుడు వార్తలతో ప్రజలను మభ్య పెడుతున్న ఈనాడు దినపత్రిక యాజమాన్యంపై జనాగ్రహం వ్యక్తమవుతోంది. ఆ దినపత్రిక ప్రతులను చోడవరంలో పలువురు దహనం చేసి శుక్రవారం తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కొత్తూరు జంక్షన్ వద్ద భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టి మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రబాబుకు మేలు చేసే విధంగా ఆ పత్రికలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దిగజారుడు రాతలు రాసిందని ధ్వజమెత్తారు.
ఈనాడు అధినేత రామోజీరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్యారావు, ఎంపీపీ గాడి కాసు, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, మండల సచివాలయ కన్వీనర్ల సంఘం అధ్యక్షుడు పతివాడ అప్పారావు, చోడవరం పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు బొడ్డేడ సూర్యనారాయణ, ఎంపీటీసీల మాజీ ఫ్లోర్ లీడర్ సూరిశెట్టి నాగదుర్గగోవింద, బుచ్చెయ్యపేట ఎంపీటీసీల ఫ్లోర్ లీడర్ దేవర అప్పారావు పాల్గొన్నారు.