
తుమ్మపాల: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండాలని సహాయ ఎన్నికల అఽధికారి, డీఆర్వో పి.వెంకటరమణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సెక్టోరియల్, రూట్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని ప్రశాంతంగా ఎన్నికలు జరిపే బాధ్యత అధికారులందరిపైనా ఉందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా పనిచేయాలని సూచించారు. జీఎస్‌వీఎస్ ప్రతేకాధికారి మంజులా వాణి, డ్వామా పీడీ సందీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.