
ధర్నా నిర్వహిస్తున్న నేవీ నిర్వాసితులు
రాంబిల్లి: నేవీ నిర్వాసితుల ధర్నా ముగింపు దిశగా పయనిస్తోంది. శుక్రవారం కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి పంపిన మినిట్స్‌ను నేవీ డీటీ శాంతిభూషణ్ ధర్నా శిబిరం వద్ద చదివి వినిపించారు. దీనిపై నిర్వాసితులు, నేవీ ప్రభావిత గ్రామాల ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు. దీనిపై మరింత లోతుగా చర్చించుకుని శనివారం ధర్నా ముగించే అవకాశాలున్నాయని ఉద్యమ ఐక్యవేదిక నాయకులు చింతకాయల ఎర్రయ్య స్పష్టం చేశారు. శుక్రవారం నాటికి ధర్నా 117వ రోజుకు చేరుకుంది.
సైకిల్‌పై షిర్డీ యాత్ర సైకిల్‌పై షిర్డీకి బయలుదేరుతున్న భక్తులు
అచ్యుతాపురం(అనకాపల్లి) : అచ్యుతాపురం మండలం నుంచి ఆరుగురు భక్తులు షిర్డీకి సైకిల్‌పై పయనమయ్యారు. లోక కల్యాణార్థం, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు భక్తుడు పూడి నాగు తెలిపారు. గతంలో ఆరు సార్లు షిర్డీకి వెళ్లినట్లు చెప్పారు. సైకిల్ యాత్రను ప్రారంభించిన వారిలో మండల వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు శరగడం జగ్గారావు, తనకాల లక్ష్మి, పోలారపు జగ్గారావు, పూడి నానాజీ, పూడి గోవింద, ఎ.బుజ్జి, బత్తిన నాగార్జున తదితరులున్నారు.
