జైనథ్: 44వ నంబరు జాతీయ రహదారిపై గల మాండగాడ బస్‌స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో పన్నాల భారతి అనే మహిళ మెడలోంచి 3 తులాల గొలుసు చోరీకి యత్నించిన మండలంలోని పిప్పర్‌వాడకు చెందిన డిడాకర్ శ్యాంసుందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పన్నాల భారతి మహారాష్ట్రలోని చిన అర్లి గ్రామానికి వెళ్లి సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణం అయ్యింది. మండలంలోని మాండగాడ బస్ స్టాప్ వద్ద బస్సు ఆగడంతో ఆమె వెనక ఉన్న శ్యాంసుందర్ మెడలోంచి మంగళ సూత్రం లాక్కొని పరిగెత్తాడు. గమనించిన తోటి ప్రయాణికులు, స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. చైన్‌ను స్వాధీనం చేసుకొని మంగళవారం కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.