breaking news
yagi
-
మయన్మార్ వరదల్లో... 236 మంది మృతి
నైపిడావ్: మయన్మార్‌లోని యాగీ తుఫాను విలయం కొనసాగుతూనే ఉంది. దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వాటి ధాటికి ఇప్పటిదాకా ఏకంగా 236 మంది మృతి చెందారని ప్రభుత్వ సంస్థ గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ మంగళవారం వెల్లడించింది. ఈ సంఖ్య పెరగవచ్చని ఐరాస మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసీహెచ్ ఏ) పేర్కొంది. ‘‘77 మంది గల్లంతయ్యారు. కనీసం 6 లక్షల మందికి పైగా వరదల బారిన పడ్డారు’’ అని ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ చైనా, వియత్నాం, లావోస్, మయన్మార్‌లో గత వారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర వియత్నాంలో ఇప్పటికే వందలాది మంది మరణించినట్లు నిర్ధారించారు. మయన్మార్‌లో రాజధాని నైపిడావ్, సెంట్రల్ మాండలే, కయా, కయిన్, షాన్ స్టేట్స్ సహా కనీసం తొమ్మిది ప్రాంతాలు, రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేశాయి. 2023లో మోచా తుఫాను వేళ అంతర్జాతీయ సాయాన్ని తిరస్కరించిన సైనిక పాలకులు ఇప్పుడు మాత్రం సాయానికి విజ్ఞప్తి చేస్తున్నారు.సైనిక ప్రభుత్వంతో సమస్య ఆహారం, తాగునీరు, మందులు, బట్టలు, ఆశ్రయం మయన్మార్‌కు అత్యవసరమని ఓసీహెచ్ఏ పేర్కొంది. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, అస్థిరమైన టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని తెలిపింది. పొరుగు దేశాల సాయం బాధితులకు అందాలంటే సైన్యం పౌర సమాజంతో కలిసి పని చేయడం ముఖ్యమని అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణుల స్వతంత్ర సమూహం ఏఎస్ఏసీ–ఎం తెలిపింది. కానీ మెజారిటీ ప్రజలకు సాయమందేలా చూడాలనే ఉద్దేశం సైనిక ప్రభుత్వానికి లేదని ఒక ప్రకటనలో ఆక్షేపించింది. సైన్యం దేశంలో మానవతా సంక్షోభాన్ని సృష్టించిందని, ప్రజలను గాలికొదిలి సొంత సైనిక, రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్తోందని ఆరోపించింది. నిధుల సమస్యతో కూడా సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయని ఓసీహెచ్ఏ పేర్కొంది. -
ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న యాగి
మనీలా: ఫిలిప్పీన్స్‌ను ‘యాగి’తుపాను వణికిస్తోంది. పలుప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మనీలాలో మరికినా నది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మనీలాతోపాటు అత్యధిక జనసాంద్రత కలిగిన లుజాన్ ప్రాంతంలో అధికారులు ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. క్వెజాన్ ప్రావిన్స్‌లోని ఇన్ఫాంటా పట్టణంలో ఈదురుగాలుల తీవ్రతకు నివాసాలు దెబ్బతిన్నాయి. రిజాల్ ప్రావిన్స్‌లోని అంటిపొలో సిటీలో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు నీట మునిగారు. సమర్ ప్రావిన్స్‌లోని సెబులో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నలుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. కామరిన్స్ సుర్ ప్రావిన్స్‌లోని నాగా నగరంలో వరద నీటిలో మరో ముగ్గురు చనిపోయారు. మనీలాకు దక్షిణాన ఉన్న కావిట్ ప్రావిన్స్‌లో నివాస ప్రాంతాల్లోకి నడుములోతుకు పైగా వరద చేరడంతో యంత్రాంగం బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను కారణంగా పలు నౌకాశ్రయాల్లో 3,300 మంది ఫెర్రీ ప్రయాణికులు, సిబ్బంది చిక్కుబడి పోయారు. పలు దేశీయ విమాన సరీ్వసులను రద్దు చేశారు. మనీలాలోని నవోటాస్ పోర్టులో రెండు ఓడలు ఢీకొన్నాయి. అనంతరం ఒక ఓడ బలమైన గాలుల తీవ్రతకు వంతెనను ఢీకొనడంతో తీవ్రంగా దెబ్బతింది. ఓడలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బందిని కాపాడారు. పసిఫిక్ రింగ్ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీన్స్‌పై ఏటా 20కి పైగా తుపాన్లు ప్రభావం చూపిస్తుంటాయి. 2013లో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భీకర తుపాను హయియాన్తో కనీసం 7,300 మంది చనిపోవడమో లేక గల్లంతవ్వడమో జరిగింది. మరో 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
మాగీ యాగీ
వ్యాపారానికి విశ్వాసం పెట్టుబడి. మనకు తెలియని సమాచారాన్ని, మనకు తెలిసిన, మనం అభిమానించిన వ్యక్తి తెలియచేయడమే ప్రక టన. బజారులో అమ్మే మిఠాయి తినవద్దంది అమ్మ. అటు వేపు కూడా చూడం. బజారులో ఉన్న ఫలానా పకోడీ బాగుంటుందన్నాడు పక్కింటాయన. ‘ఆయనెవరయ్యా చెప్పడానికి?’ అంటాం. ఇంకా, పక్కింటాయన మీద కోపం ఉంటే పకోడీ తిని మరీ ఆయన మాట తప్పని నిరూపిస్తాం. ప్రకటనకు పెట్టుబడి ఆ పెద్దమనిషి పరపతి. ‘పెద్దమనిషి’ అంటున్నాను కాని, ‘సినీ నటుడు’ అనడం లేదు. కారణం ఈ మధ్య ఎస్.పి. బాలసుబ్రహ్మ ణ్యం, సిరివెన్నెల, మనూ కూడా ప్రకటనల్లో పాల్గొంటున్నారు. ఆయా వ్యక్తుల పట్ల ప్రజల అభిమానం, విశ్వాసం ఆ ప్రకటనకు దన్ను. పిండికొద్దీ రొట్టె. మరీ బొత్తిగా ముఖం తెలియని వ్యక్తులతో ప్రకటనలు- చాలా సందర్భాలలో వారి అందమో, మాటలో ఆటలో చమత్కారమో కారణం కావచ్చు. కత్రినా కైఫ్, జెనీలియా, ప్రీతీ జింటా మొదలైనవారు ప్రకటనల ద్వారా వెండితెరకు వచ్చినవారు. ఇర్ఫాన్ ఖాన్, ఓం పురీ లాంటి వాళ్లు వెండితెర ద్వారా ప్రకటనలలో జొర బడినవారు. దేనికైనా పరపతి, ప్రచారమే ముఖ్యం. బొత్తిగా ప్రకటనల వ్యవహారం తెలియనివారు కొందరు ఈ మధ్య నన్ను అడిగారు: ‘‘అయ్యా! ఒక నిముషం ప్రకటన సినీమాలో నటించడానికి అంత డబ్బు ఎందుకండీ?’’ అని. చూడడానికి ఇది విపర్యంలాగే కని పిస్తుంది. కాని ఇందులో తిరకాసు ఉంది. బండగా చెప్పాలంటే ‘సినీమా’ నూనె తయారు చేసే గానుగ. ప్రకటన- సీలు వేసి నూనెను సూపర్ మార్కెట్లో అమ్మే దుకాణం. సినీమా పెట్టుబడి. ప్రకటన కరెన్సీ. ప్రకట నకు ఎక్కువ డబ్బు ఇచ్చేది - వ్యవధిని బట్టి కాదు. ఆ వ్యక్తి పరపతిని బట్టి. ‘‘మీరు ఖరీదు చేసేది ఆ నిమిషాన్ని కాదు. డబ్బు చేసుకొనేది - మున్ఫై సంవత్సరాలు ఆ నటుడు కూడబెట్టుకున్న పరపతిని. అమితాబ్ బచ్చన్ చేతిలో కొంగమార్కు పళ్లపొడి పొట్లం ఉంటే కోటి మంది దాన్ని గుర్తిస్తారు. అప్పలకొండ అనే వ్యక్తి చేతిలో ప్రపంచ ప్రఖ్యాత టూత్‌పేస్ట్ ట్యూబు ఉంటే పక్కవాడు కూడా గుర్తించడు. ఎన్.టి. రామారావుకి వేసే ఓటు ఆయన నిరూపించిన ఒక జీవితకాలపు సంప్రదాయం పట్ల చూపే విశ్వాసం. స్క్రీన్‌ప్లే రచనలో బండసూత్రం- తెలియని విషయాన్ని తెలిసిన మార్గంలో పరిచయం చెయ్యాలి. మరొక్కసారి - గుర్తింపుకి ‘విశ్వాసం’ పెట్టుబడి. కావాలనే ఈసారి ‘వ్యాపారం’ అనడం లేదు. అమితాబ్ బచ్చన్ తెరమీద తొడుక్కోమన్న చెప్పుల్ని మనం తొడుక్కుంటున్నామంటే అర్థం-మనకి తెలిసిన, మనం అభిమానించే, మనం నమ్మిన ఓ వ్యక్తి మన లాగే ఆ పని చేసి తృప్తి చెందాడు కనుక. అమితాబ్ బచ్చన్ చెప్పుల తయారీలో డిగ్రీ సంపాదించినవాడని కాదు. ‘‘ఈ కారు అద్భుతం’’ అని మనకు తాళాలు చూపించే హిందీ నటుడు షారుక్‌ఖాన్‌ని ‘‘ఏమయ్యా! నువ్వెప్పుడైనా ఆటోమొబైల్ కోర్సు చేశావా?’’ అని ఎవరైనా అడిగారా? ఇప్పుడు అసలు కథ. అలా అడగాలా? వద్దా? దేశ మంతా ఆవురావురుమని తింటున్న మాగీ నూడుల్స్ గొప్పవని, మంచివని ముగ్గురు తారలు మనకు చెప్పా రు. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా. గత 30 సంవత్సరాలుగా దేశమంతా తింటోంది. ఇప్పు డు మాగీ నూడుల్స్‌ను చాలా రాష్ట్రాలు బహిష్కరించా యి. నెస్లే సంస్థే ఆ సరుకుని ఈ దేశం నుంచి ఉపసంహరించింది. ఇందులో సినీతారల బాధ్యత ఎంతవరకు ఉంది? ప్రపంచమంతటా వ్యాపారం చేస్తున్న ఓ కార్పొరేట్ సంస్థ సరుకుని ఆ సంస్థ పరపతి దృష్ట్యా అంగీకరించి- బోలెడంత డబ్బు పుచ్చుకుని ప్రకటనలు ఇవ్వడం ఎంత వరకు సమంజసం? ఇందులో మోనోసోడియం గ్లుటా మేట్ పాలు ఎక్కువ కావడం వల్ల రక్తహీనత, మోతాదు మరీ మించితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని అమి తాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా తెలుసు కోవలసిన అవసరం ఎంతవరకు ఉంది? వారి మీద కేసులు నమోదయ్యాయి. తీరా వాద ప్రతివాదాలు జరుగుతాయి. తమ విశ్వాసాన్ని పెట్టుబ డిగా వ్యాపారం చేస్తున్న ఒక వ్యాపారి సరుకుని ఏమాత్రం మంచిచెడ్డలు తెలుసుకోకుండా సమర్థించడం నేర మే కదా! అయితే 30 సంవత్సరాలు తెలుసుకోవలసిన, తెలియజెప్పవలసిన జాతీయ సంస్థకే ఈ నిజం తెలియలేదు కదా! అయితే అది సమర్థించుకునే ‘కారణం’ అవుతుందా? విశ్వాసాన్ని పెట్టుబడిగా వినియోగించుకుంటున్న వ్యాపారికీ, దాన్ని డబ్బు చేసుకుంటున్న ‘సినీతార’కీ సామాజిక బాధ్యతల పాళ్లు ఎంతవరకూ ఉన్నాయి? ఇది నీతికీ, న్యాయానికీ, చట్టానికీ కొరుకుడు పడని విచికిత్సే. విచారణ, న్యాయవాదుల వాదనలూ ఆసక్తిక రంగా ఉండక తప్పవు. (రచయిత: గొల్లపూడి మారుతీరావు)