breaking news
WTA ranking
-
‘నంబర్ వన్’గా సహజ.. సుమిత్, బోపన్నలకు షాక్!
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల విరామం తర్వాత తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి సహజ యామలపల్లి(Sahaja Yamalapalli) మళ్లీ టాప్–300లోకి దూసుకు వచ్చింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ-WTA) తాజా సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సహజ ఏకంగా 21 స్థానాలు పురోగతి సాధించి 294వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్ సహజదే కావడం విశేషం. ఫలితంగా ఆమె మళ్లీ భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా నిలిచింది. తొమ్మిది స్థానాలు పడిపోయిన అంకిత రైనా 295వ ర్యాంక్‌కు చేరుకోగా... తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 332వ ర్యాంక్‌లో ఉంది. ఇక 2024 నవంబర్ 286వ స్థానంలో నిలిచిన సహజ ఆ తర్వాత ర్యాంకింగ్స్‌లో పడిపోయి 300 నుంచి బయటకు వచ్చింది. అయితే గతవారం బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడంతో ఆమె ర్యాంక్ మెరుగైంది. నగాల్ ర్యాంక్ 106 న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్(Sumit Nagal) ర్యాంక్ దిగజారింది. పది నెలల తర్వాత అతను టాప్–100లో చోటు కోల్పోయాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నగాల్ 15 స్థానాలు పడిపోయి 106వ ర్యాంక్‌లో నిలిచాడు. గత ఏడాది ఫిబ్రవరిలో టాప్–100లోకి వచ్చిన నగాల్ గత వారం వరకు వందలోపు కొనసాగాడు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోవడంతో నగాల్ ర్యాంక్ పడిపోయింది. భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్ 365వ ర్యాంక్‌లో, రామ్‌కుమార్ రామనాథన్ 406వ ర్యాంక్‌లో, కరణ్ సింగ్ 496వ ర్యాంక్‌లో ఉన్నారు.టాప్–20లో చోటు కోల్పోయిన బోపన్న మరోవైపు పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న(Rohan Bopanna) ఐదు స్థానాలు పడిపోయి 21వ ర్యాంక్‌లో నిలిచాడు. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్‌లో విజేతగా నిలిచిన బోపన్న ఈసారి తొలి రౌండ్లోనే వెనుదిరగడం అతని ర్యాంక్‌పై ప్రభావం చూపింది. టాప్–100లో భారత్ నుంచి ఆరుగురు ఉండటం విశేషం. యూకీ బాంబ్రీ 47వ ర్యాంక్‌లో ఎలాంటి మార్పులేదు. శ్రీరామ్ బాలాజీ 64వ ర్యాంక్‌లో ఉండగా... హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రితి్వక్ చౌదరీ ఏడు స్థానాలు పడిపోయి 79వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అర్జున్ ఖడే 83వ ర్యాంక్‌లో, జీవన్ నెడుంజెళియన్ సరిగ్గా 100వ ర్యాంక్‌లో ఉన్నారు. -
సానియాకు కెరీర్ బెస్ట్ ర్యాంకు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్ లో బెస్ట్ ర్యాంకు సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో మూడో ర్యాంకుకు చేరుకుంది. 6885 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. తాజాగా మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో సానియా డబుల్స్ టైటిల్‌ను గెల్చుకుంది. ఈ విజయంతో 1000 పాయింట్లు సంపాదించి డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. కెరీస్ బెస్ట్ ర్యాంకు సాధించడం థ్రిల్లింగ్ గా ఉందని సానియా మీర్జా సంతోషం వ్యక్తం చేసింది. నంబర్ వన్ గా నిలవాలన్నది తన స్వప్నమని, ఏదో ఒకరోజు టాప్ చేరుకుంటానని పీటీఐతో చెప్పింది. ప్రస్తుతం సానియా అమెరికాలో ఉంది.