breaking news
wrong g.o.
-
తప్పు గ్రేడేషన్ ..జీఓ
పీఈటీలు, పండిట్ పోస్టుల అప్‌గ్రేడేషన్ కోసం 16 ఏళ్లుగా పోరాడిన ఉపాధ్యాయులను మభ్య పెట్టేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఆ జీఓలో షెడ్యూలు, విధి విధానాలు లేవు. ఇదేమిటని ఉపాధ్యాయులు అడిగితే.. ఆర్థిక శాఖ క్లియరె¯Œ్స ఇచ్చి, మెమో విడుదల చేసింది. బాగానే ఉందనుకుంటే.. విద్యా శాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు జారీ చేయడంలేదు. ఈ మెలిక ఏమిటన్న ప్రశ్నలకు సాకులు చెబుతున్నారే తప్ప, ఆ జీఓను అమలు చేయడం లేదు. ఇంతవరకూ చేసినట్టుగా తిరిగి పోరాట బాటలోకి వెళతామని ఉపాధ్యాయులు అంటున్నారు. భానుగుడి (కాకినాడ) : చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. కుప్పలతెప్పలా పేరుకుపోయిన సమస్యలతో ఉపాధ్యాయులను గందరగోళంలో పడ్డారు. ఇందులో అతీగతీ లేని నెలవారీ పదోన్నతులు, సంవత్సరానికో డీఎస్సీ తెస్తామన్న ప్రభుత్వ హామీ, ఉపాధ్యాయులను పాత పెన్ష¯ŒS స్కీము వర్తింపు, విద్యాసంవత్సరం మధ్యలో మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన తదితర సమస్యలు ఉపాధ్యాయులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఈ సమస్యల కోవలోకి పీఈటీల, పండిట్ల అప్‌గ్రేడేష¯ŒS కూడా చేరింది. ఇందుకు సంబం«ధించిన జీఓ జారీ చేసి ఐదు నెలలైనా అమలు కాలేదు. 16 ఏళ్ల పోరాటం... పీఈటీ, పండిట్లు 16 ఏళ్లుగా అప్ గ్రేడేష¯ŒS కోసం పోరాటం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఈ సమస్యను దాటవేశాయే తప్ప పరిష్కరించడం లేదు. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం గతేడాది ఆగస్టులో పీఈటీ, పండిట్ల అప్ గ్రేడేష¯ŒS కోసం జీఓ 144ను విడుదల చేసింది. అయితే ఇంతవరకూ ఆ జోఓ అమలుకాలేదు. అప్‌గ్రేడేష¯ŒS షెడ్యులు లేకపోవడం, విధి వి«ధానాలు లేకుండా మొక్కుబడిగా జీఓ ఉంది. గతేడాది ఆక్టోబర్‌లో అప్‌గ్రేడేష¯ŒSకు ఆర్థిక శాఖ క్లియరె¯Œ్స ఇచ్చి, మెమో విడుదల చేసింది. విద్యా శాఖ డైరెక్టరేట్ నుంచి మాత్రం ఆదేశాలు రాలేదు. నిరీక్షణలో 341 మంది ఉపాధ్యాయులు. జిల్లాలో 166 పీఈటీ పోస్టులు, 105 తెలుగు పండిట్ పోస్టులు, 65 హిందీ, 5 సంస్కృత ఉపాధ్యాయుల పోస్టులు అప్‌గ్రేడ్ చేసినట్టు డీఈఓ వెబ్సైట్లో ఉంచారు. అయితే సీనియారిటీ జాబితా వివరాలు, కౌన్సిలింగ్ తేదీలు, విధి విధానాలు మాత్రం ఇందులో లేవు. ఈ విషయమై ఉపాధ్యాయులు అధికారులను ఎన్నిసార్లు కలిసినా విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి అదేశాలు రాలేదనే చెబుతున్నారు. అక్కడికు వెళితే నెలవారీ పదోన్నతుల కేసు కోర్టులో ఉందంటూ సాకు చెబుతున్నారు. విద్యాశాఖ ఆదేశాలతో 164 జెడ్పీ పాఠశాలలు, రెండు ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీలను స్కూల్ అసిస్టెంట్ పీఈలుగా మార్పు చేస్తున్నట్టు, ఎల్పీలను ఎస్ఏలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు వెబ్సైట్లో ఉంచారు. అయితే ఉపాధ్యాయుల సినీయారిటీ లిస్టు, షెడ్యుల్స్ అందులో లేకపోవడంతో ఉపాధ్యాయులను గందరగోళంలో పడ్డారు. తక్షణమే షెడ్యులు విడుదల చేసి పీఈటీ, పండిట్ల అప్‌గ్రేడేష¯ŒSను నిర్వహించకుంటే రోడ్డెక్కుతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యమానికి దిగుతాం పీఈటీ, పండిట్ల అప్‌గ్రేడేష¯ŒS కోసం 16 ఏళ్లుగా ఉపాధ్యాయ సంఘాలు పోరాడుతున్నాయి. ప్రభుత్వాలు మారినా మా దుస్థితి మారడం లేదు. గతేడాది ఆగస్టులో జారీ చేసిన జీఓలో విధివిధానాలు లేవు. ఇప్పటికైనా అప్‌గ్రేడేష¯ŒS పూర్తి చేయకుంటే ఉద్యమం చేపడతాం. – ఎల్.జార్జి, పీఈటీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాతో ఆటలా? రాత్రికి రాత్రే జీఓలు జారీ చేసి, పనులు చకచకా చేసుకుంటున్న రోజులివి. ఉపాధ్యాయుల కొచ్చేసరికి కొర్రీలు వేస్తున్నారు. చాలామంది రిటైర్మెంట్కి దగ్గరకొచ్చినా పీఈటీగానే ఉన్నారు. 25 ఏళ్లు సర్వీసు చేసినా ఎస్ఏ క్యాడర్ లేదు. మాతో ఆటలాడటం సరికాదు. – పప్పు శ్రీనివాసరావు, పీఈటీ, జెడ్పీహెచ్ఎస్, పవర ఇక ఉద్యమమే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నాం. ఏ త్యాగానికైనా మేనుకాడం. ఏళ్ల తరబడి పోరాడుతున్నా.. ప్రభుత్వానికి మాపై కనికరం లేదు. జిల్లాలో ఉపాధ్యాయు లందరూ నిరీక్షిస్తున్నారు. వారు ఆగ్రహం చెందక ముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. – వి.మాచర్రావు, నేమాం జెడ్పీహెచ్ఎస్ పీఈటీ -
యనమల అధికార దుర్విని‘యోగం’
తమ్ముడి కోసం అడ్డగోలు జీవో ఏకంగా నాలుగు రెట్లు పెంచేసిన అద్దె మరీ అంత ‘పచ్చ’ పాతమా సాక్షిప్రతినిధి, తుని : ‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటీ’అనే సామెతను అక్షరాలా నిజం చేస్తున్నారు ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు. వరుసకు సోదరుడైన కృష్ణుడు కోసం ఏకంగా జీవోనే జారీ చేసి లాభాన్ని సమకూర్చారు మంత్రి వర్యులు. తమ్ముడి కోసం తుని నియోజకవర్గంతో ఉన్న 30 ఏళ్ల రాజకీయ అనుబంధాన్నే వదులుకున్నారాయన. చివరకు కుటుంబ సభ్యులను కూడా కాదని రాజకీయ వారసత్వాన్ని తమ్ముడు చేతుల్లో పెట్టారు. అదంతా వ్యక్తిగతం అనుకున్న నియోజకవర్గ ప్రజలకు తాజాగా తీసుకున్న నిర్ణయం ఆగ్రహం రప్పిస్తోంది. ఇంకా పూర్తికాకుండా నిర్మాణంలో ఉన్న తమ్ముడి భవనంలో తన శాఖకు చెందిన కార్యాలయాన్ని అద్దెకు కేటాయించడం విస్మయం కలిగిస్తోంది. వాణిజ్య పన్నులశాఖ ఆర్థిక మంత్రి యనమల చేతిలో ఉండటంతో ఈ ఆయాచిత లబ్థి చేకూర్చేందుకు తలపడడం అధికార దుర్వినియోగానికి పరాకాకష్టగా నిలుస్తోందరని పలువురు మండిపడుతున్నారు. తెరదీసింది ఇలా... వాణిజ్య పన్నులశాఖకు తునిలో సర్కిల్ కార్యాలయం రాణి సుభద్రయ్యమ్మపేటలో ఉంది. గత 30 ఏళ్లుగా కంకిపాటి రాములకు చెందిన భవనంలో ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం నడుస్తోంది. వాణిజ్య పన్నులుశాఖ నెలకు రూ.12,000లు అద్దె చెల్లిస్తోంది. ఆరేళ్ల క్రితమే ఆ భవనాన్ని ఖాళీ చేయాలని భవన యజమాని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు లేఖలు రాశారు. అధికారులు ఖాళీ చేయకపోవడంతో భవన యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని ఖాళీచేసి మరో భవనంలోకి మార్పు చేయాలని అధికారులు భావించారు. ఈ విషయం ఆనోటా, ఈనోటా మంత్రి సోదరుడు కృష్ణుడు దృష్టికి వెళ్లడంతో అన్నగారితో మంతనాలు జరిపి తనకు అనుకూలంగా మలుచుకున్నారు. అద్దెలోనూ హస్తలాఘవాలే... నిర్మాణం కూడా పూర్తికాని భవనంలో రెండు ఫ్లోర్లకు సంబంధించి 7వేల చదరపు గజాలను కార్యాలయం కోసం అద్దెకు తీసుకోవడానికి జీఓ విడుదల చేయించడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అందుకు నిర్థారించిన అద్దె కూడా ఆషామీషీగా లేదు. తన తమ్ముడే కదా అని యనమల ఉదారంగా ఇప్పుడున్న అద్దెకు నాలుగు రెట్లు ఎక్కువగా నిర్థారించడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. రూ.12000లు ఉన్న అద్దెను రూ.50 వేలు పైచిలుకు చెల్లించేలా జీఓ విడుదలవడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పుడు కార్యాలయం నడుస్తోన్న భవనంలో 8 వేల చదరపు అడుగులకు నెలకు రూ.12 వేలు అద్దె చెల్లిస్తున్నారు. తాజా భవనంలో 7వేల చదరపు అడుగులకు నెలకు అద్దె రూ.50వేలు పైచిలుకుకు ఖాయం చేశారు. ఇప్పుడున్న స్థలం కంటే ఎక్కువగా విస్తీర్ణం ఉందా అంటే అదీ లేదు. ఈ బహుళ అంతస్తుల భవనం తుని పట్టణం శివారున ఉంది. భవనం నిర్మిస్తున్న ప్రాంతం సగం మున్సిపాలిటీ, సగం ఎస్. అన్నవరం పంచాయితీలో ఉంది. ప్రస్తుత కార్యాలయం నిర్వహిస్తున్న భవనం తుని పట్టణం మ«ధ్యలో అందరికీ అందుబాటులో ఉంది. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రధాన కూడలిలో ఉన్న భవనాలకు ఎస్ఎఫ్టీ రూ.6 నుంచి రూ.7లు అద్దె ఉంది. పట్టణానికి శివారులో 1000 ఎస్ఎఫ్టి ఉన్న ప్లాటుకు రూ.5000 అద్దె పలుకుతోంది. ఈ లెక్కల ప్రకారం చూసినా ఏడు వేల చదరపు అడుగులకు రూ.35 వేలు సరిపోతుంది. అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట వాణిజ్యపన్నులశాఖ చేతిలో ఉందికదా అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన సోదరుడికి ప్రయోజనం చేకూర్చేలా ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయం. రూ.12వేలు అద్దె ఉన్న కార్యాలయానికి పెద్దమొత్తంలో పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? పట్టణ నడిబొడ్డున ఇప్పుడున్న అద్దెకు అనేక బిల్డింగ్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ పట్టణానికి శివారున నిర్మాణం కూడా పూర్తికాకుండానే తమ్ముడు భవనాన్ని అద్దెకు తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం. దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని