breaking news
Wipers
-
Tesla: వారెవ్వా టెస్లా.. ‘లేజర్’తో అద్దాలు శుభ్రం!
ఆటోమొబైల్స్ రంగంలో సంచలనాలకు నెలవుగా మారిన టెస్లా.. మరో అరుదైన ప్రయత్నంతో వార్తల్లోకి ఎక్కింది. కార్ల అద్దాలను క్లీన్ చేయడానికి లేజర్ కిరణాలను ఉపయోగించబోతోంది. అంతేకాదు ఈ విధానంపై పేటెంట్ హక్కుల కోసం రెండేళ్ల క్రితం పెట్టుకున్న దరఖాస్తుకు ఇప్పుడు అనుమతి లభించింది. ఎలక్ట్రిట్రెక్ వెబ్‌పోర్టల్ కథనం ప్రకారం.. టెస్లా తన కార్ల విండ్‌షీల్డ్ కోసం లేజర్ లైట్ల సెటప్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా విండ్‌షీల్డ్ వైపర్స్ అవసరమైనప్పుడు నీళ్లు చిమ్మిచ్చి అద్దాల్ని శుభ్రం చేస్తాయి. అయితే ఆ స్థానంలో టెస్లా కార్లకు ‘లేజర్ విండ్‌షీల్డ్ వైపర్స్’ ప్రత్యక్షం కానున్నాయి. అయితే ఈ వైపర్ సెటప్ కంటికి కనిపించదు. అవసరం అయినప్పుడు మాత్రం లేజర్ కిరణాల్ని వెదజల్లుతుంది. అయితే ఈ లేజర్ బీమ్స్ ప్రభావం డ్రైవర్ ప్లేస్‌లో ఉన్న వ్యక్తికి ఏమాత్రం హానికలిగించవని, కేవలం కారు అద్దాలపై మరకలను తొలగించేదిగా మాత్రమే ఉంటుందని టెస్లా ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్క విండ్‌షీల్డ్ కోసమే కాదు.. గ్లాస్ ఆర్టికల్ ఉన్న చోటల్లా లేజర్ కిరణాల సాయంతో క్లీన్ చేసే సెటప్‌ను టెస్లా తీసుకురాబోతోంది. నిజానికి పేటెంట్ అప్లికేషన్‌ను 2019 మే నెలలోనే సమర్పించింది. కానీ, యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ మాత్రం ఏడాది ఇప్పుడు.. కేవలం కార్ల వరకే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం ఈ అనుమతులు లభించగా.. త్వరలో రిలీజ్ కాబోయే కార్ల విషయంలో ఈ సెటప్‌ను తీసుకురాబోతోంది టెస్లా. చదవండి: టెస్లా.. ముందు మేక్ ఇన్ ఇండియా! -
ఊడ్చి.. ఊడ్చి మూలకు
* గతంలో ఇంటింటికీ ఉండేవి * ఇంటి దేవతగానూ చూసేవారు * ఊడ్చిన అతివలకు వ్యాయామం దొరికేది * ఇపుడు వాకిళ్లు లేవు.. చీపురు కట్టలూ లేవు * మార్కెట్లో రకరకాల ప్లాస్టిక్ చీపుర్లు, వైపర్లు కామారెడ్డి: గ్రామీణ ప్రాంతాలలో చీపురుకు తగిన గుర్తింపే ఉంది. ఇప్పటికీ గొప్పగానే చూస్తారు. ఆడపిల్ల రజస్వల అయినపుడు ఇంటి గడప వద్ద ఓ చీపురును ఉంచే సంప్రదా యం ఉంది. ప్రసూతి అయినపుడు కూడా చీపురుకట్టను గడప దగ్గర ఉంచుతారు. అంటే చీపురును ఇల్లు, వాకిలి ఊడ్చే సాధనంగానే కాకుండా, ఓ దేవతగా భావించే వారు. చీపురు కుటుంబంలో ఒక భాగంగా ఉండేది. ఏ ఇంటికి వెళ్లినా చీపురు కట్టలు ఎక్కడో ఒక చోట దర్శనమిచ్చేవి. ఆధునిక చీపుర్లు వచ్చిన తరువాత చీపురు కట్టలు మూలకు పడ్డాయనే చెప్పాలి. అక్కడక్కడా చీపురుకట్టలు దొరుకుతున్నా, వాటిని వాడడానికి మహిళలు ఆసక్తి చూపడం లేదు. దీంతో పాత కాలపు చీపురుకట్ట కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. అడవుల నుంచే చీపురు పుల్లల సేకరణ చీపురు కొయ్యలు (పుల్లలు) అటవీ ప్రాంతాలు, కంచె లలోనే ఎక్కువగా లభిస్తాయి. వీటిని కోసుకువచ్చేవారు ప్రతీ గ్రామంలో ఉంటారు. కూలీలు వ్యవసాయ పనులు లేని సమయంలో అడవులు, కంచెలకు వెళ్లి చీపురు పుల్లలను కోసుకొచ్చి ఇంటి ముందరనో, ఇళ్లపైనో ఎండబెడుతారు. వాటి కొసలకు ముళ్లలాంటివి ఉంటాయి. రోజం తా తిరిగి పదిహేను ఇరవై చీపుర్లకు సరిపడా కొయ్యలు కోసుకొచ్చేవారు. నాలుగు రోజులు ఎండిన తరువాత పుల్లలను మడతలుగా పట్టుకుని కర్రతో కొడుతూ ముళ్లను తొలగిస్తారు. తరువాత పుల్లలను కట్టలుగా కడతారు. అడవుల నుంచి కోసుకొచ్చి కట్టిన చీపురు కట్టలు ఇప్పుడు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఒక్కో చీపురును రూ. 15 విక్రయిస్తున్నారు. అయితే, మహిళలు వాటిని ఇష్టపడడం లేదు. ఆధునిక చీపుర్ల ధరలు అడ్డగోలుగా ఉన్నా వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. చీపురుతో వ్యాయామం కూడా తెలవారకముందే మహిళలు చీపురుకట్టతో అటూ, ఇటూ వాకిళ్లు ఊడుస్తూ ఉంటే వ్యాయామం కన్నా ఎక్కువ మేలు జరిగేది. మార్కెట్లో పొడవైన చీపురుకట్టలు, వై పర్లు వచ్చిన తరువాత మహిళలు ఎలాంటి శ్రమ లేకుండా ఊడ్చగలుగుతున్నారు. తద్వారా వారు శారీరక వ్యాయామం పొందలేకపోతున్నారు. అంగట్లో ఆధునిక చీపుర్లు మార్కెట్లో అన్ని వస్తువులలాగే చీపుర్లు కూడా రకరకాలవి తరలివచ్చాయి. ఇతర దేశాల నుంచి కూడా రకరకాల చీపుర్లు మార్కెట్ ను చుట్టేశాయి. కొబ్బరి తదితర చీపుర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి ఎక్కువ ఎత్తు ఉంటాయి. వంగకుండానే వాకిలి, ఇల్లు ఊడ్చుకోవచ్చు. దీంతో మహిళలు వాటిని వాడడానికే ఆసక్తి చూపుతు న్నారు. చీపురు కట్టలు నేటి తరం మహిళలకు నచ్చడం లేదు. పట్టణాలలోనే కాదు పల్లెలలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలతెలవారకముందే తెల్లవారకముందే మహిళలు నిద్రనుంచి లేచి వాకిళ్ల వెంటపడేవారు. అప్పట్లో ప్రతీ ఇంటి ముందర ఇల్లంత వాకిలి ఉండేది. మహిళలు అందరూ ఒకే స మయంలో వరుసగా ఉంటే ఇళ్ల ముందర చీపురుతో ఊడుస్తుంటేతో ఓ రకమైన సంగీతం వెలువడేది. వాకిలి ఊడవడానికో చీపురు, ఇంటిలోపల ఊడవడానికో చీపురు ఉండేది.స్నా నపు గదులకు, వంటింటికి వేర్వేరుగా చీపురు కట్టలు ఉంచుకునేవారు. అంటే ఒక్కో ఇంటికి నాలుగైదు చీపుర్లు ఉండేవి. చీపురు కట్టల సీజన్ వచ్చిందంటే చాలు ఒక్కో ఇంటిలో పదుల సంఖ్యలో చీపురు కట్టలను జమచేసుకుని పెట్టేవారు. చీపురుకొయ్యలు కోసుకువచ్చిన వారు తమకు సరిపడా ఉంచుకుని మిగతావి అమ్ముకునేవారు.