8 ఐస్‌క్రీంలు, బిర్యానీ తెగ లాగించేశా!!
వారాంతం అయిపోయింది. శని, ఆది వారాలంటే అందరికీ ఆటవిడుపే. మరి సెలబ్రిటీలు ఈ రెండు రోజుల్లో ఏం చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఆ వివరాలు మీ కోసం సేకరించి మరీ ఇస్తున్నాం. సోషల్ నెట్వర్కింగ్ మైక్రో సైట్ ట్విట్టర్లో బాగా యాక్టివ్‌గా ఉండే కొంతమంది సెలబ్రిటీలు ఈ రెండు రోజుల్లో ఏవేం చేశారో చూస్తే ఒక్కొక్కళ్లూ ఒక్కోలా గడిపారు.
హీరోయిన్ సమంత అయితే ఈ రెండు రోజుల్లో తిండిమీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. 8 ఐస్‌క్రీంలు, బిర్యానీ, చాట్, రసమలై.. ఇలా తనకు ఇష్టమైనవన్నీ లాగించేసింది. దాంతో బ్రహ్మాండంగా నిద్ర కూడా పట్టేసిందట. ఏకంగా ఫుడ్ కోమా వచ్చేసిందని తన ట్విట్టర్ అకౌంట్లో సమంత చెప్పింది.
8 ice creams,biryani,chaat,rasmalai... Food food and more food has been consumed in the last 2 days.. Food coma has happened.happy days over
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) February 9, 2014
ఇక హీరో నితిన్ , తన హార్ట్ ఎటాక్ సినిమా గురించే చూసుకున్నాడు తప్ప పెద్దగా విశ్రాంతి తీసుకున్నట్లు కనపడలేదు. తొమ్మిదో రోజు తన హార్ట్ ఎటాక్ సినిమా బాగా ఊపందుకుందని, ప్రధానంగా నగరాల్లో ఈ సినిమాను జనం బాగా చూశారని ట్వీట్ చేశాడు తప్ప, ఈ రెండు రోజుల్లో తానేం చేశాడో మాత్రం చెప్పలేదు. అంటే, సినిమా గురించిన టాక్ మీదే నితిన్ దృష్టి పెట్టాడన్నమాట.
#HeartAttack Day9 Picked Up Very Well Especially In Cities!!!
— TFIBoxOffice.Com (@TFIBoxOffice) February 9, 2014
హీరో సిద్ధార్థ మాత్రం కార్తీక్ సుబ్బరాజ్ తీసిన జిగర్తండా చిత్రం టీజర్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశాడు. దీనికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడని చెప్పాడు. దానికి ఎవరెవరు ఎలా స్పందించారో చూశాడు.
Here is the teaser of my new film... Karthik Subbaraj's JIGARTHANDA. http://t.co/SSYhzSMntN DOP- Gavmic Ary. Music - Santosh Narayan.
— Siddharth (@Actor_Siddharth) February 8, 2014
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఇప్పటికీ అభిమానుల సందడి ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోలతో సమానంగా ఆయన కోసం అభిమానులు వెల్లువెత్తుతున్నారు. ఆదివారం అయితే అమితాబ్ బచ్చన్‌ను చూసేందుకు వేలాదిమంది జనం తరలి వెళ్లారు. వాళ్లందరినీ చూసి ఆయనకు కడుపు నిండిపోయింది. అందరికీ అభివాదం చేసి, వారితో తన సంతోషాన్ని పంచుకున్నారు. వాళ్లంతా వచ్చిన ఫొటో కూడా అమితాబ్ ట్వీట్ చేశారు.
T 1383 -Overwhelming moment of Sundays .. today a little too boisterous - almost broke the cordon and moved in ! pic.twitter.com/HjL4SST2UJ
— Amitabh Bachchan (@SrBachchan) February 9, 2014
ప్రతి అరగంటకు కూడా తన ట్విట్టర్ అకౌంట్‌ను అప్డేట్ చేసే రాజకీయ నాయకుల్లో నరేంద్ర మోడీ ఒకరు. ఆయన ఎప్పుడు ఏం చెప్పినా, ఏం చేసినా వెంటనే ట్విట్టర్లో ప్రత్యక్షం అవుతుంది. ఆదివారం నాడు కేరళలో పర్యటించిన నరేంద్ర మోడీ, అక్కడి కమ్యూనిస్టులపై మండిపడ్డారు. కేరళను 'దేవుడి సొంత దేశం' అని పిలుస్తారని, కానీ.. అక్కడి యువత ఉద్యోగాల కోసం దేశ విదేశాలకు ఎందుకు వెళ్లిపోతారని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆయన మండిపడ్డారు.
Kerala is called 'God's Own Country' but why are youngsters leaving in search of jobs? Centre & State Govts have failed to create jobs.
— Narendra Modi (@narendramodi) February 9, 2014