breaking news
wallmart retail
-
అగ్రికల్చర్ సెక్టార్లో ఫ్లిప్‌కార్ట్ అడుగులు.. భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తుల తాజా సరఫరాలు నిర్వహించే నింజాకార్ట్‌లో తాజాగా వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ 14.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 1,090 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. గతేడాది అక్టోబర్‌లోనూ ఈ బెంగళూరు కంపెనీలో వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ పైకి వెల్లడించని పెట్టుబడులు సమకూర్చడం గమనార్హం. మౌలిక సదుపాయాలు ఈ నిధులతో తాజా ఉత్పత్తుల సప్లై చైన్ కంపెనీ నింజాకార్ట్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచుకోనుంది. తద్వారా రైతులు, రీసెల్లర్లు, రిటైలర్లు, వినియోగదారులు, సరఫరాదారులకు మరిన్ని సౌకర్యాలు సమకూరే వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా మరింత మంది రిటైలర్లు, వినియోగదారులకు అత్యంత నాణ్యతతోకూడిన తాజా ఉత్పత్తులను అందించేందుకు కొత్తగా లభించిన పెట్టుబడులు దోహదం చేయనున్నట్లు వివరించింది. ఇది రైతులకు సైతం ఉత్తమ ఆదాయ సాధనకు సహకరించనున్నట్లు తెలియజేసింది. 2015లో ప్రారంభమైన నింజాకార్ట్ ఇప్పటికే టైగర్ గ్లోబల్, యాక్సెల్, స్టెడ్‌వ్యూ, సింజెంటా, నందన్ నీలెకని, క్వాల్కామ్ నుంచి పెట్టుబడులు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. చదవండి:రైతు సంఘాలతో ఫ్లిప్‌కార్ట్ జట్టు -
ఉద్యోగులకు వాల్‌మార్ట్ ఇండియా షాక్
సాక్షి, ముంబై : ప్రపంచంలోని అతిపెద్ద రీటైలర్ సంస్థ వాల్‌మార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా యూనిట్‌కు చెందిన 56 మంది ఎగ్జిక్యూటీవ్‌లను ఆ సంస్థ తొలగించింది. అందులో 8 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉన్నారు. ఉద్యోగుల తొలగింపు వాస్తవమేనని వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ అయ్యార్ ఓ ప్రకటనలో తెలిపారు. 2019లో తమ సంస్థ అమ్మకాల్లో 22శాతం వృద్ధి కనబరిచిందని తెలిపారు. ఆరు మోడ్రన్ హోల్‌సేల్ స్టోర్లను, ఒక ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తమ సభ్యులకు మెరుగైన సేవలు అందించడానికి భారీగా పెట్టుబడలు పెట్టామని.. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగిస్తామని వెల్లడించారు. బ్రిక్ అండ్ మోర్టర్ స్టోర్లతో పాటు ఈ కామర్స్‌లో పెట్టబడులు పెట్టామని తెలిపారు. అలాగే మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి మార్గాలను అన్వేషిస్తున్నట్టు క్రిష్ చెప్పారు. అందుకోసం సరైన మార్గాల్లో వెళ్లేందుకు తమ సంస్థ కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షించాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే 56 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు స్పష్టం చేశారు. రెండో దశలో భాగంగా ఏప్రిల్‌లో మరిన్ని తొలగింపులు ఉంటాయనే ప్రచారం జరగగా.. ఈ సందర్భంగా క్రిష్ వాటిని ఖండించారు. మరోవైపు దేశంలో హోల్‌సేల్ విభాగంలో నుంచి నిష్క్రమించే ఆలోచన లేదని, క్యాష్ అండ్ క్యారీ వ్యాపార అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్ సంస్థ తెలిపింది. కాగా, భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఒక దశాబ్దం తరువాత కూడా అమ్మకాలు పెద్దగా పుంజుకోకపోవడంతో వాల్‌మార్ట్ ఇండియా ముంబై కేంద్రాన్ని మూసివేయాలని యోచిస్తోందనే ప్రచారం జరిగింది. -
మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి!
-
మామీద పడి తినొద్దు.. మీ దేశానికి పొండి!
జాతి విద్వేష వ్యాఖ్యలతో కొందరు అమెరికన్ పౌరులు విదేశీయులను తీవ్రంగా అవమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా డల్లస్ కౌంటీ పరిధిలోని ఇర్వింగ్ నగరంలో గల వాల్‌మార్ట్ దుకాణంలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. తాము కష్టపడి పనిచేసి పన్నులు కడుతుంటే విదేశీయులు తమ మీద పడి బతికేస్తున్నారని, ''మీ సొంత దేశానికి వెళ్లిపోండి'' అని అతగాడు అన్నాడు. వాల్‌మార్ట్ దుకాణంలో పనిచేసే ఆదెలా అనే మహిళ ఎల్ సాల్వెడార్ నుంచి 20 ఏళ్ల క్రితమే వచ్చారు, ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. వాల్‌మార్ట్ దుకాణానికి వచ్చిన శ్వేత జాతీయుడు ఆమెతో దురుసుగా మాట్లాడటమే కాక, తనకు సాయం చేయడానికి తెల్లజాతివారే కావాలని అడిగాడు. విషయం ఏమిటంటే.. వాల్ మార్ట్ స్టోర్‌కు వచ్చిన ఆ శ్వేతజాతి కస్టమర్, తన కళ్లద్దాలతో ప్యాకెట్ల మీద ఉన్నవి సరిగా కనిపించడం లేదని చెప్పాడు. దాంతో ఆదెలా ఆయనకు ఒక వైద్యుడిని కలవాల్సిందిగా సూచించారు. అయితే ఆమె సాయం తీసుకోవడానికి నిరాకరించిన అతడు.. తనకు తెల్లవాళ్లే కావాలని చెప్పాడు. దాంతో ఆదెలా మీరు జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని అతడికి చెప్పడమే కాక, సూపర్వైజర్కు కూడా తెలియజేసినా, ఆయన కాన్ఫరెన్స్ కాల్లో బిజీగా ఉండటంతో పట్టించుకోలేదు. అంతలో అక్కడే ఎలక్ట్రిక్ వీల్‌చెయిర్‌లో ఉన్న ఓ నల్లజాతి మహిళ గురించి కూడా ఆ శ్వేతజాతీయుడు దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ''ఆమెను చూడండి, ఆమె ఆస్పత్రి బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారు, నేనే.. అవును, నేను ఆమె బిల్లులు చెల్లిస్తున్నాను. ఆమె విదేశీయురాలు. ఇక్కడికి వచ్చింది. అనారోగ్యం పాలై బాగా లావెక్కింది. అందువల్ల ఆమె ఏమీ చేయలేదు, పని కూడా చేయలేదు. కానీ నేను ఆమె బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. నేనేమైనా లావుగా ఉన్నానా? నేను రోజూ పనికి వెళ్లి, పన్నులు చెల్లిస్తున్నాను. ఆ పన్నులతోనే ఆమెకు చికిత్స జరుగుతోంది'' అన్నాడు. అయితే, తాను కూడా ఉద్యోగం చేసి, పన్నులు చెల్లిస్తున్నానని ఆదెలా అతడికి సమాధానం ఇచ్చారు. కానీ అతడు అక్కడితో ఆగలేదు. ''తెల్లవాళ్లు కష్టపడి పనిచేస్తుంటే విదేశీయులంతా మామీద పడి బతికేస్తున్నారు. అవును. నేను నీకు నిజం చెబుతున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లడానికి రాలేదు, ఇక్కడే ఉండిపోతారని నాకు తెలుసు. కానీ మీరు మీ సొంత దేశాలకు వెళ్లిపోయి అక్కడ మీ దేశాలను బాగు చేసుకోండి'' అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత సూపర్వైజర్ రావడంతో అతడు అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సూపర్వైజర్కు ఆదెలా అతడి సంభాషణ మొత్తాన్ని రికార్డు చేసిన వీడియో చూపించారు. తనకు ఏం చేయాలో తెలియలేదని, ఏడవాలో వద్దో కూడా అర్థం కాలేదని అన్నారు. ఆ శ్వేతజాతీయుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలని వాల్‌మార్ట్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు సూపర్వైజర్ చెప్పారు గానీ, అతడు అప్పటికే వెళ్లిపోయాడు. ఇలాంట జాతివివక్షను తాను ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆదెలా వాపోయారు. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... అమెరికాలో భారతీయులపై మళ్లీ దాడి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’