breaking news
vro booked
-
లంచం అడిగిన వీఆర్ఓకు రెండేళ్ల జైలు
మెదక్ మున్సిపాలిటీ : రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్ఓకు రెండేళ్ల జైలు, రూ. 6వేల జరిమానా విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్ మండలం గొల్లగడ్డ గ్రామం జీడిపల్లి పంచాయతీకి చెందిన పయ్యాల శంకర్‌కు అదే గ్రామ శివారులోని సర్వే నం. 128లో 2.15 ఎకరాల భూమి ఉంది. దాని మ్యూటేషన్ చేయించేందుకు తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయంలో శంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. పేరు మార్చాలంటే రూ.5వేలు లంచం ఇవ్వాలని వీఆర్ఓ వెంకట కిషన్‌రావు డిమాండ్ చేశాడు. దీంతో రైతు శంకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని రైతు శంకర్ నుంచి వీఆర్ఓ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటి నుంచి కేసు హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టులో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోర్టులో కేసు విచారణకు రాగా వీఆర్ఓ వెంకట కిషన్‌రావుపై నేరం రుజువు కావడంతో అతడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 6వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు తెలిపారు. జరిమానా చెల్లించకుంటే మరో 3నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చినట్లు తెలిపారు. -
మానసిక వికలాంగురాలిపై వీఆర్ఓ గ్యాంగ్‌రేప్
మానసిక విలాంగురాలిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో వీఆర్‌ఓతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో మార్చిలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముచ్చింతల్ గ్రామానికి చెందిన ఓ యువతి (23) ఇంటి వద్దనే ఉంటుంది. అయితే పొరుగింటికి చెందిన వీఆర్వో చంద్రమోహన్‌తో పాటు అదే గ్రామానికి చెందిన మహేందర్, శేఖర్, ఓ తోటలో పనిచేసే జిత్తు తనపై అత్యాచారం చేశారని యువతి రెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. మార్చి నెలలో చంద్రమోహన్ తన ఇంట్లోకి పిలువగా నలుగురూ కలిసి తనపై లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం స్నానం చేయించి తనను బయటకు పంపేశారని పేర్కొంది. దీంతో పోలీసులు అనుమానితులను అదే రోజు ఠాణాకు పిలిపించి విచారించారు. బాధితురాలి నుంచి ఆదివారం సాయంత్రం వరకు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదూ అందకపోవడంతో పోలీసులు దర్యాప్తును కొనసాగించలేదు. మరోసారి బాధితురాలు ఆదివారం స్టేషన్‌కు రాగా.. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై అట్రాసిటీ, అత్యాచారం కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ ఉమామహేశ్వర్రావు తెలియజేశారు. బాధితురాలికి మతిస్థిమితం సరిగా లేదని, ఆమె మానసిక విలాంగురాలని పోలీసులు అన్నారు.