breaking news
villagers beat
-
మహిళల ఫొటోలు తీస్తున్న వ్యక్తికి దేహశుద్ధి
తడ: మహిళలు స్నానం చేస్తున్న, బహిర్భూమికి వెళుతున్న సమయంలో సెల్ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిని శుక్రవారం గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు.. అమావాస్య సందర్భంగా వేనాడు గ్రామంలోని షేక్ దావూద్ షావలీ అల్లా దర్గాను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గురువారం వేనాడుకు చేరుకున్నారు. బాబా దర్శనానంతరం మొక్కులో భాగంగా రాత్రి అక్కడే నిద్రించారు. శుక్రవారం ఉదయం చెట్లు, దడుల మాటున బట్టలు మార్చుకుంటున్న, స్నానాలు చేస్తున్న, బహిర్భూమికి వెళ్లిన మహిళలను ఓ యువకుడు సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండడంతో మహిళలు గమనించి కుటుంబసభ్యులకు తెలిపారు. వారు స్థానికుల సాయంలో ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం తడ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని అతనిని స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఇతను గతంలోనూ ఇదే పనిచేస్తూ ఉండగా బాధితులు పట్టుకునే క్రమంలో చేతిలో బ్లేడు వంటి ఆయుధం చూపి పారి పోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇతనికి సంబంధించి రాత్రి వరకు ఎవరూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చెయ్యలేదు. -
బాలికపై లైంగికదాడి యత్నం
చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు సింగరాయకొండ : ఐదేళ్ల బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన ఘటన సింగరాయకొండ మండలం కలికివాయలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు. .గ్రామానికి చెందిన అయిదేళ్ల బాలిక తల్లిదండ్రులు పచ్చాకు కూలీ పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. కుమార్తెను పెద్దమ్మ వెంకాయమ్మ దగ్గర ఉంచారు. ఆదివారం ఇంటి వద్ద ఉన్న చర్చికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన దాసరి కోటేశ్వరరావు (50) బాలికను చర్చి సమీపంలో మరుగుగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు కోటేశ్వరరావును చితకబాది పోలీసులకు అప్పగించారు. స్థానిక సీఐ గుంజి తిరుమలరావు, ఎస్సై మల్లికార్జునరావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.