breaking news
vijayawada durga temple eo
-
నా కార్యాలయంలో డొల్లతనం మంచిదే!
సాక్షి, విజయవాడ: దుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిలోని ఆలయ ఈవో కార్యాలయంలో రెండేళ్లకే పైకప్పు పెచ్చులూడడంపై ఈవో కోటేశ్వరమ్మ విచారణకు ఆదేశించారు. నాసిరక నిర్మాణంపై అధికారులతో కమిటీ వేసి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. గత ఈవోల హయాంలో ఈ పనులు జరిగినందున అవినీతి గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈవో కార్యాలయంలోనే డొల్లతనం బయటపడడం ఒక రకంగా మంచిదేనని దేవస్థానంలో మిగిలిన నిర్మాణాలపై దృష్టి సారించి భక్తులకు ఇబ్బంది కలుగకుండా కట్టడాల నాణ్యతను పర్యవేక్షిస్తామని ఆమె వెల్లడించారు. రూ. పది లక్షల ఖర్చుతో రెండేళ్ల క్రితమే పార్టేషన్ పనులను చేయగా ఇప్పుడే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి
మూడు రోజులు పాటు శాకాంబరీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ - 45 వేల మందికిపైగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు - ఘనంగా ముగిసిన శాకాంబరి ఉత్సవాలు విజయవాడ : కనకదుర్గ దేవస్థానంలో శాకాంబరీ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. మూడు రోజులపాటు శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారికి ఈ రోజు ఆలయ పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదమంత్రాలతో, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన పూర్ణాహుతి పూజా కార్యక్రమంలో ఈఓ ఎ. సూర్యకుమారి దంపతులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు నిర్వహించిన శాకాంబరి ఉత్సవాలకు 45 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. శాకాంబరి ఉత్సవాలు చివరి రోజు గురుపౌర్ణమి కూడా కలిసి రావడంతో భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. -
ఝులక్ ఇచ్చిన చంద్రశేఖర్ఆజాద్
దుకాణాల కోసం తెలుగు తమ్ముళ్ల ఆరాటం వేలంపాట రద్దు చేసి తమకే కేటాయించాలని డిమాండ్ కొండదిగువన దుకాణలు ఇస్తానని ఈవో హామీ విజయవాడ : ఇంద్రకీలాద్రిపై రెండు దశాబ్దాలుగా దుకాణాలు నడుపుతున్నవారికి ఈవో చంద్రశేఖర్ఆజాద్ ఝులక్ ఇచ్చారు. అయితే దీన్ని అర్ధం చేసుకున్న దుకాణాదారులు ఈవోపై వత్తిడి తెచ్చి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. చివరకు దేవాదాయ శాఖ ఉన్నతధికారులకు, దుకాణదారుల మధ్య రాయ‘బేరాలు’సాగుతున్నాయనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఐదో అంతస్తులో షాపులు కేటాయింపు...... ఘాట్రోడ్డులో దుకాణాలు తొలగించాలని అనేక సంవత్సరాలుగా ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. చివరకు హైకోర్టు షాపుల్ని ఖాళీ చేయించి కొత్తవారికి ఇవ్వవచ్చని ఆదేశాలు ఇచ్చినా అధికారులు వారిని కదల్చలేకపోయారు. బీజేపీ-టీడీపీ నేతలకు ఇక్కడ షాపులు ఉండడమే ఇందుకు కారణం. అయితే ప్రస్తుతం దుర్గగుడి విస్తరణలో భాగంగా కొద్ది రోజులుగా షాపులను మూయించారు. షాపుల్ని ఐదోఅంతస్తులోకి తరలిస్తున్నామని చెప్పి శుక్రవారం వేలంపాట నిర్వహించారు. అయితే అనేక సంవత్సరాలుగా ఇంద్రకీలాద్రిపై వ్యాపారాలు చేస్తున్నవారికి ఇది రుచించలేదు. దీంతో దేవస్థానం అధికారులు, దేవాదాయశాఖ ఉన్నతాధికారులపై వేలంపాట వాయిదా వేయాలని వత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే తాము దుకాణాలకు వేలంపాట నిర్వహించకుండా జాగ్త్రత్తలు తీసుకున్నామని, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ఎలా నిర్వహిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఒకైవె పు అధికారులపై వత్తిడి పెంచుతూనే మరోకవైపు దేవాదాయశాఖలోని ఉన్నతస్థాయిలో బేరసారాలు సాగించారని ఆరోపణలు వస్తున్నాయి. కింద ఇచ్చేందుకు అంగీకారం.... దీంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన వత్తిడి ప్రకారం ప్రస్తుతం ఇంద్రకీలాద్రి పై ఉన్న 16 దుకాణాలకు కొండదిగువన కొత్తగా దుకాణాలు నిర్మించి ఇస్తామని ఐదో అంతస్తులోని 16 దుకాణాలకు వేలంపాట నిర్వహిస్తామని ఈవో హామీ ఇచ్చారు. దీంతో శుక్రవారం సాయంత్రం అప్పటికప్పుడు టెండర్ షెల్యూల్డ్లో ఆఖరి అంశంగా కొండదిగువన కొన్ని దుకాణాలకు వేలంపాట నిర్వహించి ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారికి కేటాయిస్తామనే అంశం చేర్చారు. దీని వెనుక పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయని అంటున్నారు. ఐదో అంతస్తులో వేలంపాట నిర్వహించగా ఇప్పటికే అనేక సంవత్సరాలుగా కొండపై వ్యాపారాలు చేస్తున్నవారు ఎవరూ లో పాల్గొనక పోవడం గమనార్హం. కొత్తవారు ఎక్కువ అద్దెలు పెట్టి ఐదో అంతస్తులో షాపులు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కింద షాపులకు రూ.78 వేల అద్దె.... కొండ దిగువన నిర్మించి ఇచ్చే షాపులకు రూ.78 వేలు వరకు అద్దె నిర్ణయిస్తామని ఈవో చెప్పడంతో వ్యాపారస్తులు అంగీకరించడం లేదని తెలిసింది. అక్కడ వ్యాపారం ఉండదని అందువల్ల అద్దెలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచిచూడాలి.