breaking news
UKIP
-
మేనిఫెస్టోలో సంచలన అంశం.. వింత వివరణ
లండన్: బ్రిటన్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు బరిలోకి దిగిన యూకే ఇండిపెండెన్స్ పార్టీ (యూకేఐపీ) ఒక కొత్త హామీని తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. తాము అధికారంలోకి వస్తే ముస్లిం మహిళలకు మరింత స్వేచ్ఛను ఇస్తామని, వారు ముసుగు ధరించడాన్ని రద్దు చేస్తామని తెలిపింది. ఇందుకు కారణంగా మాత్రం ఎవరూ ఊహించని విషయాన్ని తెలిపింది. ముసుగు వల్ల ముస్లిం మహిళలకు డీ విటమిన్ అందడం లేదని అందుకే దానిని రద్దు చేస్తామని తెలిపింది. ‘బురఖా ధరించడం వల్ల గుర్తింపును దాచినట్లవుతుంది. కమ్యునికేషన్‌కు ఇబ్బందవుతుంది. ఉద్యోగ అవకాశాలు తక్కువవుతాయి. గృహహింసకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించవు. అంతేకాకుండా శరీరానికి ఎంతో ముఖ్యమైన డీ విటమిన్ అందకుండా పోతుంది’ అంటూ పలు కారణాలు వివరిస్తూ మేనిఫెస్టోలో ముసుగు రద్దు అంశాన్ని యూకేఐపీ చేర్చింది. -
బ్రెగ్జిట్ ఉద్యమ నేత సంచలన నిర్ణయం
లండన్: బ్రెగ్జిట్ ఉద్యమ రథసారధి నిగెల్ ఫరాగ్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. యునైటెడ్ కింగ్ డమ్ ఇండిపెండెండ్ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం సెంట్రల్ లండన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిగెల్ తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. 'బ్రిటన్ స్వతంత్ర్యదేశంగా ఉండాలన్నది నా కల. యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడమే లక్ష్యంగా 20 ఏళ్లు పోరాడాం. బ్రెగ్జిట్ రెఫరెండం నెగ్గడంలో యూకే ఇండిపెండెంట్ పార్టీ పాత్ర అద్వితీయం. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించా. మిగతా పని భవిష్యత్ నేతలదే. బ్రెగ్జిట్ విజయం కంటే నేను సాధించేది ఏదీ ఉండబోదు. 'నా దేశం నాకు తిరిగి కావాలి'(ఐ వాంట్ మై కంట్రీ బ్యాక్) అని నినదించా. ఇప్పుడు మాత్రం నా జీవితం నాకు కావాలని కోరుకుంటున్నా(ఐ వాంట్ మై లైఫ్ బ్యాక్). నిజానికి రాజకీయాలు నా వృత్తికాదు. సరైన సమయంలోనే యూకేఐపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నా. అయితే బ్రెసెల్స్(ఈయూ రాజధాని) నుంచి బ్రిటన్ పూర్తిగా వేరయ్యే వరకు యురోపియన్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతా' అని నిగెల్ అన్నారు. (చదవండి: బ్రెగ్జిట్ వైపే బ్రిటన్ ప్రజల మొగ్గు!) (చదవండి: బ్రిటన్‌లో అల్లకల్లోలం ఖాయం!) తొలి నుంచీ కన్జర్వేటివ్ పార్టీ రాజకీయాల్లో పాల్గొన్న నిగెల్ ఫరేజ్.. మొదటి నుంచి ఈయూలో బ్రిటన్ చేరికను వ్యతిరేకిస్తున్నారు. 1992లో కన్జర్వేటివ్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తర్వాత యూకే ఇండిపెండెన్స్ పార్టీలో చేరారు. 2010లో ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ ఇన్నాళ్లుగా ఆయన చేస్తున్న ప్రచారాన్ని చాలా మంది తేలికగా తీసుకున్నారు. కానీ నిగెల్ మాత్రం పరిహాసాలను పట్టించుకోకుండా ముందుకుసాగారు. బ్రెగ్జిట్‌పై రెఫరెండం నిర్వహించేలా ప్రధాని కామెరాన్‌పై ఒత్తిడి తెచ్చారు. చివరికి జూన్ 23న జరిగిన రిఫరెండంలో ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలని 52శాతం బ్రిటిషర్లు బ్రెగ్జిట్ కు ఓటు వేశారు. కాగా, నిగెల్ రాజీనామా చేసినప్పటికీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమని, గతంలోనూ ఒకటిరెండు సార్లు ఇలా జరిగిందని బ్రిటిష్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. (చదవండి: పేద దేశాల వలసలే కొంప ముంచాయి) (చదవండి: బ్రెగ్జిట్‌కు బ్రేక్!?) -
బ్రిటన్‌లో భారతీయుడి సొంత పార్టీ
లండన్: భారత సంతతికి చెందిన హర్భజన్‌సింగ్ సొంత పార్టీని స్థాపించాడు. ఇప్పటిదాకా తాను పనిచేసిన యూకే ఇండిపెండెన్స్ పార్టీ (యూకేఐపీ) ఇమ్మిగ్రేషన్ విధానం నచ్చకపోవడంతో ఓపెన్ బోర్డర్స్ పార్టీ (ఓబీపీ) అనే పార్టీని ఏర్పాటుచేశాడు. బర్మింగ్ హాంలోని పెర్రీబార్ నియోజకవర్గానికి ఎంపీ అయిన సింగ్...దేశంలోకి అందరికీ ప్రవేశం కల్పించాలని బ్రిటన్ను డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని బర్మింగ్‌హామ్ అనే పత్రిక శనివారం వెల్లడించింది. ‘యూరోపియన్ యూనియన్ (ఈయూ)ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని అనుకున్నా. అయితే స్వేచ్ఛావాదినైనందువల్ల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలనే విశ్వసిస్తా.’అని అన్నారు. అంటువ్యాధులు, నేరచరిత్ర లేనివారికి సేచ్ఛగా ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశాడు. ఇది ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.