breaking news
TRS series
-
మహాదానందం
-
గూడూరుపాడు..గడగడ
♦ సీపీఐ కార్యకర్తలపై చర్య తీసుకున్నాకే సంగం మృతదేహం ♦ తరలించాలంటూ పోలీసులకు ♦ అడ్డుతగిలిన టీఆర్ఎస్ కార్యకర్తలు సీపీఐ, టీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ...కర్రలు, బడితెలతో బాదుకోవడంతో గూడూరుపాడు గడ గడలాడిపోరుుంది. గంటపాటు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. గ్రామ పరిసరాలన్నీ యుద్ధ వాతావరణాన్ని తలపించారుు. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో గురువారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జెడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత హాజరయ్యూరు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చేక్రమంలో సీపీఐ,టీఆర్ఎస్ వర్గాల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సీపీఐ కార్యకర్తల వైపు నుంచి వచ్చిన ఓ రాయి..టీఆర్ఎస్ కార్యకర్త సత్తి సంగం గుండెల్లో బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో మృతుడి సోదరుడు జానకితో పాటు కార్యకర్తలు గోకినపల్లి రామ్మూర్తి, మహేష్, సైదమ్మ, కుర్రి తిరుపతిరావు, లిక్కి కోటేశ్వరరావు, ఎర్రబోయిన సతీష్, కుర్రి మారుతిలకు గాయాలయ్యాయి. - ఖమ్మం రూరల్ గొడవ సమాప్తం..అంతా నిశ్శబ్దం గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత టీఆర్ఎస్ వారు బాణసంచా కాలుస్తుండగా నిప్పు రవ్వలు మీద పడ్డాయంటూ సీపీఐ వారు గొడవకు దిగడంతో..ఇరు వర్గాల వారు గంటపాటు రాళ్లు రువ్వుకొని కొట్టుకున్నారు. టీఆర్ఎస్కు చెందిన సత్తి సంగం (60) ఈ గొడవల్లో మరణించడంతో..ఊరిలో భయానక వాతావరణం నెలకొంది. ఘర్షణ అనంతరం రెండు బెటాలియన్ల పోలీసులు ఊరిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీధివీధినా తిరుగుతూ..గుంపులుగా సంచరించకుండా ఆంక్షలు విధించడంతో అంతా నిశ్శబ్దం నెలకొంది. ఈ గొడవలో మృతుడి సోదరుడు జానకీరామ్‌తో పాటు మరో ఎనిమిది మంది గాయపడగా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దాడి ఘటనలో 30మందిపై కేసు గూడూరుపాడులో ఘర్షణ ఘటన, టీఆర్ఎస్ కార్యకర్త సత్తి సంగం మృతికి సంబంధించి సీపీఐకి చెందిన 30మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎస్.ఆంజనేయులు తెలిపారు. సిద్ధినేని కర్ణకుమార్, చింతకాయల కమలాకర్‌తో పాటు మరో 28మందిపై కేసు పెట్టినట్లు తెలిపారు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం.. సత్తి సంగం కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతడికి భార్య పుల్లమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒకమ్మాయికి పెళ్లి అయింది. ఇంకో కూతురు ఇంట్లోనే ఉంది. కూలి పనులకు పోతూ..అప్పుడప్పుడూ మాంసం కొట్టు నిర్వహిస్తూ కుటుంబాన్ని సాకాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి ఇలా ఘర్షణలో ఎవరో విసిరిన రాయి గుండెలపై తగిలి విలవిల్లాడి ఊపిరొదలడంతో ఆ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. అతి సమస్యాత్మక ‘గూడు’ ఖమ్మం రూరల్ మండలంలో గూడూరుపాడు అతి సమస్యాత్మక గ్రామంగా పేరొందింది. మండలంలో చింతపల్లి, ఆరెకోడు, గుదిమళ్ల, కైకొండాయిగూడెం, ఎం.వెంకటాయపాలెం అతి సమస్యాత్మక ఊర్లుగా ఉన్నా..గూడూరుపాడులో ఎప్పుడూ ఏదోఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. గ్రామంలో రెండు వేల జనాభా ఉండగా..పార్టీలు, వర్గాల వారీగా పరస్పరం కక్షలు ఉన్నాయి. కొందరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొనడంతోనే ఈ ఘర్షణ నెలకొందని స్థానికులంటున్నారు. గతంలో జరిగిన కొన్ని గొడవల వివరాలు.. ♦ 2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికలప్పుడు బందోబస్తు కోసం వెళ్లిన పోలీసు సిబ్బందితో గొడవ జరగ్గా..ఓ పీసీ తల పగిలింది. ♦ ఇటీవల తుమ్మల పాలేరు ఎన్నికల ప్రచారంలో ఇక్కడికొచ్చినప్పుడు సీపీఐ కార్యాలయాన్ని సందర్శిస్తే..టీఆర్ఎస్లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ♦ ఒకరు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ♦ గతంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నేత వర్ధంతి సభ సందర్భంగా సీపీఎం, సీపీఐకు మధ్య ఘర్షణ జరిగింది. -
విద్యార్థులపై టీఆర్ఎస్ శ్రేణుల పిడిగుద్దులు
సిరిసిల్ల: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో మంత్రుల పర్యటనలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై టీఆర్ఎస్ శ్రేణులు పిడిగుద్దులు కురిపించారు. పోలీసుల సాక్షిగా విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సర్దాపూర్ వద్ద మంగళవారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల శంకుస్థాపనకు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు కొందరు మంత్రుల ఎదుటకు వెళ్లి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న టీఆర్ఎస్ నాయకులు వారిపై పిడిగుద్దులు కురి పిస్తూ, కిందపడేసి తొక్కారు. పోలీసులు అడ్డుకుంటున్నా పట్టించుకోకుండా దాడి చేశారు. వెంట పడి మరీ చితకబాదారు. కొందరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిపై సైతం టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో అనిల్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, 30 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్ తెలిపారు. కేసులు వద్దన్న మంత్రి: నిరసన తెలిపిన ఏబీవీపీ కార్యకర్తలపై కేసులు వద్దని మంత్రి కేటీఆర్ సభాముఖంగా సిరిసిల్ల డీఎస్పీని కోరారు. ఫీజు రీయిం బర్స్మెంట్ బకాయిలు రూ.1,575 కోట్లలో ఇప్పటికే సీఎం రూ.500 కోట్లు విడుదల చేశారన్నారు. -
మంథనిలో రాజకీయ దాడులు
మంథని, న్యూస్‌లైన్: మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు ఘర్షణలకు దిగడంతో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంథనిలోని శ్రీపాద కాలనీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డుసభ్యుడు ఆకుల శ్రీనివాస్‌పై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడి విషయం ఆనోట ఈనోట బయటకు పొక్కడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు గుమిగూడారు. కాలనీకి చెందిన వ్యక్తులు కాకుండా వేరే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ టీఆర్ఎస్ వారు ఎదురుతిరిగారు. ఈక్రమంలో రెండు వర్గాలు ఘర్షణపడ్డాయి. దీంతో పరిస్థితి అదుపుతప్పి ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది కారంపొడి, మారణాయుధాలతో ఇక్కడికి వచ్చారని, తమ కార్యకర్తపై దాడి చేశారని టీఆర్ఎస్ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన కొందరిని పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకోవడంతో.. తమపై దాడి చేసేందుకు వచ్చిన వారికి రక్షణ ఎలా కల్పిస్తారని మంథని సర్పంచ్ పుట్ట శైలజ, జెడ్పీటీసీ సరోజనతోపాటు కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు సదరు కార్యకర్తలను వదిలేశారు. వాహనం నుంచి వారు దిగి పరుగెత్తడంతో మరోసారి రెండు వర్గాలు దాడికి దిగాయి. ఇలా సుమారు గంటకు పైగా పరస్పరం దాడులు జరుగడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు పట్టణంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. రాజకీయ కక్షల కారణంగా రెండు రోజులుగా పరస్పర దాడులు జరుగుతుండటంతో మంథనిలో భయానక వాతావరణం నెలకొంది.