breaking news
Traditional courses
-
సీన్ రివర్స్!
- సంప్రదాయ కోర్సులకు విశేష ఆదరణ - ప్రొఫెషనల్ కోర్సుల్లో మిగిలిపోతున్న సీట్లు యూనివర్సిటీక్యాంపస్ : ఒకప్పుడు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు మొగ్గు చూపేవారు. బీటెక్, ఎంసీఏ, ఏంబీఏ, బీఈడీ, ఎంఈడీ, ఫార్మసీ, మెడిసిన్, వెటర్నరీ, డిప్లొమా తదితర ప్రొఫెషనల్ కోర్సులకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. పైకోర్సుల్లో మెడిసిన్, వెటర్నరీ తప్ప మిగిలిన కోర్సులకు ఆదరణ తగ్గిపోయింది. ఈ ఏడాది నిర్వహించిన వివిధ ప్రవేశపరీక్షల ద్వారా కోర్సుల్లో చేరిన విద్యార్థుల వివరాలు పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతున్నాయి. ఈసెట్ ద్వారా జరిపిన అడ్మిషన్లలో బీటెక్, ఫార్మసీ కోర్సుల్లో కేవలం 22,744 మంది చేరగా 63,320 సీట్లు మిగిలిపోయాయి. ఎడ్‌సెట్ ద్వారా నిర్వహించిన బీఈడీ అడ్మిషన్లలో 6,770 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 19 వేల సీట్లు మిగిలిపోయాయి. పాలిసెట్ ద్వారా జరిపిన డిప్లొమో కోర్సుల్లో 85,500 సీట్లు ఉండగా 42,400 సీట్లు భర్తీ అయ్యాయి. 42,800 సీట్లు మిగిలిపోయాయి. ఎంసెట్ ద్వారా నిర్వహించిన బీటెక్ అడ్మిషన్లలో 36,324 సీట్లు మిగిలిపోయాయి. 304 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా 50 కళాశాలల్లో ఒక్కరూ చేరలేదు. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఇంకా జరగాల్సివుంది. ఇది ఏడాది ప్రొఫెషనల్ కోర్సులపై విద్యార్థులు చూపుతున్న నిరాదారణకు ఇది నిదర్శనం. పీజీ కోర్సులు ఫుల్ ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల సీట్లు ఈ ఏడాది పూర్తిగా నిండిపోయాయి. కొన్ని ప్రైవేటు కళాశాలలు మినహా క్యాంపస్ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయి, స్పాన్సర్డ్ కోటాలో ఎక్కువ మంది అడ్మిషన్లు పొందారు. మహిళా వర్సిటీలో గత ఏడాది కంటే ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఎస్వీయూలో కూడా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. క్యాంపస్‌లో 1605 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో 1485 సీట్లు రెగ్యులర్‌గా కాగా మిగిలిన సీట్లల్లో విద్యార్థులు ఎక్కువ మొత్తం ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందారు. సోషియాలజీ, సోషల్‌వర్క్, లైబ్రరీ సైన్స్ కోర్సులు కూడా విద్యార్థులతో నిండిపోయాయి. ఆదరణ లేని హిస్టరీ, సీప్‌స్టడీస్ కోర్సుల్లో కూడా సీట్లు నిండాయి. గత ఏడాది కన్నా 20 శాతం మేరకు అడ్మిషన్లు పెరగడం విశేషం. డిగ్రీస్థాయిలో కూడా బీకాం, బీఎస్సీ కోర్సులకు ఆదరణ పెరిగింది. డిగ్రీ చదివిన విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి కంపెనీలు ప్లేస్మెంట్ ఇస్తున్నాయి. పైగా ప్రొఫెషనల్ కోర్సులతో పోల్చితే వీటికి ఫీజుల భారం తక్కువే. అందువల్ల విద్యార్థులు సాధారణ సంప్రదాయ కోర్సులపైనే మొగ్గు చూపుతున్నారు. -
సంప్రదాయ కోర్సులకూ రుణాలు!
విదేశీ వర్సిటీల్లో చదువులకూ మంజూరు - అవాన్స్, క్రెడీలా పేర్లతో విద్యారుణాలు - కొత్త రూట్లో డీహెచ్ఎఫ్ఎల్, హెచ్డీఎఫ్సీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు రుణాలు అంత తేలికేమీ కాదు. అందులోనూ విద్యా రుణాలైతే మరీను. పేరున్న వర్సిటీల్లో పాపులర్ కోర్సులైన ఇంజనీరింగో, మెడిసిన్‌నో లేక మేనేజ్మెంట్ కోర్సో చదివే విద్యార్థులకు మాత్రమే రుణాలు లభిస్తుంటాయి. ఎందుకంటే బ్యాంకులు కూడా ఆ కోర్సు పూర్తి చేశాక సదరు అభ్యర్థికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనే అంశాన్ని ఆధారం చేసుకునే రుణాలిచ్చేది. అందుకే సంప్రదాయ కోర్సులైన సంగీతం, ఫొటోగ్రఫీ, నృత్యం వంటి కోర్సులు చదివే వారికి రుణాలు కావాలంటే కాస్తంత ఇబ్బంది తప్పదు. అయితే మన దేశంలో ఇలాంటి సంప్రదాయ కోర్సుల ఫీజులు తక్కువే. కాబట్టి మరీ ఇబ్బంది ఉండదు. కానీ విదేశీ వర్సిటీల్లో ఇలాంటి కోర్సులు చదవాలంటే మాత్రం కష్టం. అయితే ఇలాంటివన్నీ అర్థం చేసుకున్న బ్యాంకులు కొన్ని ఈ కోర్సులకూ రుణాలిచ్చేలా కొత్త పథకాలు ఆరంభిస్తున్నాయి. అలాంటి వారికీ రుణాలు లభిస్తున్నాయి. మార్కెట్ అంచనాల ప్రకారం మన దేశంలో ఏటా పిల్లల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు రూ.80 వేల కోట్ల వరకూ వెచ్చిస్తున్నారు. ఈ మార్కెట్ ఏటా 18 శాతం వృద్ధితో అంతకంతకూ దూసుకెళుతోంది. దీన్లో విద్యారుణం తీసుకొని ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారి వాటా దాదాపు 15 శాతంగా ఉంది. నిజానికిపుడు పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు రుణాలు తీసుకోవటమనేది తగ్గింది. ఉన్నత విద్య రుణం కోసం నేరుగా విద్యార్థులే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఈ డిమాండ్‌ను చూసిన ప్రయివేటు ఆర్థిక సంస్థలు విద్యారుణాల మంజూరులో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. అవాన్స్, క్రెడీలా రుణాలు.. అగ్రశ్రేణి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలైన దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్), హెచ్‌డీఎఫ్‌సీలు మేనేజ్మెంట్ కోర్సులతో పాటు సంప్రదాయ కోర్సులైన ఫొటోగ్రఫీ, సంగీతం, నృత్యం, డిజైనింగ్, ఫైన్ ఆర్ట్స్ వంటి కోర్సులకూ విద్యారుణాలను మంజూరు చేస్తున్నాయి. విద్యా రుణాల కోసం డీహెచ్ఎఫ్ఎల్ ‘అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్స్’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. హెచ్డీఎఫ్సీ కూడా ఈ రుణాల కోసం ‘క్రె డీలా’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. అయితే ఆయా రుణాలను కేవలం కోర్సు ఫీజులకే పరిమితం చేయకుండా రుణానికి అర్హుడైన విద్యార్థి చదువు పూర్తయ్యేంత వరకు అవసరమయ్యే ఖర్చు, రవాణా చార్జీలను కూడా రుణంలో భాగంగానే మంజూరు చేస్తున్నాయి. వర్సిటీ, దేశాన్ని బట్టి వడ్డీ రేట్లు.. సంప్రదాయ కోర్సుల విద్యా రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లు... విద్యార్థులు ఎంచుకునే వర్సిటీ, దేశం ఆధారంగా మారుతూ ఉంటాయని హైదరాబాద్‌లోని ‘అవాన్స్’ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధికారి ఒకరు ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ ప్రతినిధితో చెప్పారు. ‘‘దేశీయంగా గుర్తింపు పొందిన వర్సిటీల్లోని విద్యాభ్యాసానికైతే 12.5 శాతం నుంచి 12.75 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాం. అదే విదేశాల్లోని వర్సిటీల్లో అయితే వడ్డీ రేటు 12.75 శాతం నుంచి ప్రారంభమై 14 శాతం వరకు ఉంటుంది. ఐఐఐటీ, ఐఎస్బీ, ఐఐటీ మద్రాస్ వంటి పేరొందిన వర్సిటీలు గుర్తించిన విద్యా సంస్థల్లో విద్యకైతే ఎలాంటి జామీను లేకుండా రుణాలను మంజూరు చేస్తున్నాం. అదే మన దేశంలోని ఇతర విద్యా సంస్థల్లో అయితే రూ.5 లక్షల విద్యారుణానికి తల్లిదండ్రుల వేతనాన్ని హామీగా పెట్టాల్సి ఉంటుంది. అదే విదేశాల్లోని వర్శిటీల్లో అయితే స్థిరాస్తులను జామీనుగా ఇవ్వాల్సి ఉంటుంది’’ అని వివరించారు. అలాగే జీమ్యాట్, టోఫెల్ పరీక్షల్లో స్కోరు ఆధారంగా రుణాలను మంజూరు చేస్తామని తెలియజేశారు. -
సారూ.. సర్టిఫికెట్!
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఫీజు రీరుుంబర్స్‌మెంట్ రాకపోవడంతో వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసిన వేలాదిమంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫీజులు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమంటూ కళాశాలల యాజమాన్యాలు మెలిక పెడుతున్నాయి. ఫీజులు చెల్లించే శక్తిలేక విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. రీరుుంబర్స్‌మెంట్ రెన్యూవల్ దరఖాస్తుకు విధించిన నిబంధనలు సైతం హడలెత్తిస్తున్నాయి. * ఫీజులకు, పట్టాలకు లంకె * విడుదల కాని రీయింబర్స్మెంట్ నిధులు * వృత్తి విద్యా కోర్సులు పూర్తయినా విద్యార్థులకు దక్కని ఫలితం * రూ.కోట్లలో బకాయిలు యూనివర్సిటీ క్యాంపస్: జిల్లాలో వృత్తివిద్యా, సంప్రదాయ కోర్సులు పూర్తిచేసిన వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కోర్సు పూర్తి చేసినా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ఫలితం దక్కడం లేదు. జిల్లాలో 32 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అన్ని కళాశాలలు బీటెక్ కోర్సులు అందిస్తున్నాయి. 20 కళాశాలలు ఎంటెక్ కోర్సులు అందిస్తున్నాయి. 25 ఫార్మసీ, 20 నర్సింగ్, 42 డిగ్రీ, 35 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఉన్నాయి. మూడు మెడికల్ కళాశాలలున్నాయి. వీటిలో లక్ష మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఏటా కోర్సు పూర్తిచేసి బయటకు వెళ్లేవారి సంఖ్య 30వేలకు పైమాటే. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడమే ఇందుకు కారణం. ఫీజు చెల్లించలేని కారణంగా ఏ ఒక్కవిద్యార్థీ ఉన్నత చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోగలిగారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై శీతకన్ను వేశారు. అరకొర నిధులను మాత్రమే విడుదల చేస్తున్నారు. తద్వారా విద్యార్థులు కోర్సులు పూర్తి చేసినా ఫలితం దక్కడం లేదు. కోర్సు పూర్తయినా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో, ఫీజులు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమంటూ కళాశాలల యాజమాన్యాలు కచ్చితం గా వ్యవహరిస్తున్నారుు. ఫీజులు చెల్లించే శక్తిలేక విద్యార్థులు తీవ్ర ఆవేదన, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. మహిళా వర్సిటీకే రూ.2 కోట్ల బకాయిలు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలకు 2013-14 విద్యాసంవత్సరానికి రూ.1.8 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉంది. అలాగే 2010-11లో ఏ ఒక్కరికి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. ఎస్వీయూనివర్సిటీలో సుమారు 50 శాతం మందికిపైగా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. కొందరికి వచ్చినా పూర్తి శాతం రాలేదు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, పద్మావతి మహిళా డిగ్రీకళాశాలల్లో నూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలకే 1.8 కోట్ల నిధులు అందాలి. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సంబంధించి బకాయిలు ఏ మాత్రం ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ని‘బంధన’లు కఠినతరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రెన్యూవల్ చేసుకోడానికి 2014-15 విద్యాసంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు ఈ నెల 10వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్న నిబంధన పెట్టారు. దరఖాస్తు చేయాలంటే పదిరకాల డాక్యుమెంట్లు జతపరచాలని మడ త పేచీ పెట్టారు. దరఖాస్తు నమూనాతోపాటు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, జూన్ 2 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలను జత పరచాలని నిబంధన విధించారు. దీంతో విద్యార్థులు హడలెత్తుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విడుదల చేయాల్సిన బకాయిలను విడుదల చేయాల ని కోరుతున్నారు. -
కొలువులకు కేరాఫ్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్!
ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సుల పరిధి విస్తృతమవుతోంది. ఆర్ట్స్ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తదితర సంప్రదాయ కోర్సులు మాత్రమే అనే హద్దులు చెదిరిపోతున్నాయి. లింగ్విస్టిక్స్, సోషియాలజీ, సైకాలజీ నుంచి ప్రొఫెషనల్ ‘లా’ కోర్సుల వరకు ఈ విభాగంలో ఎన్నో విభిన్న సమకాలీన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనూ హ్యుమానిటీస్ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది! కామర్స్, సైన్స్... అకౌంటెన్సీ లేదా కెమిస్ట్రీ... ఏదో ఒక ప్రధాన సబ్జెక్టుకు మాత్రమే పరిమితమయ్యే కోర్సులు. కానీ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అనేవి విస్తృత పరిధి ఉన్న కోర్సులు. వీటిని అభ్యసించిన విద్యార్థులు సమాజం, చుట్టూ ఉన్న మనుషులు, చరిత్ర, వారసత్వ సంపద, సామాజిక- మానవ సంబంధాలు, నాగరికత, సంస్కృతి, పాలన వ్యవహారాలు, రాజనీతి, విశ్వం, భూగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రాలు వంటి పలు అంశాలను అధ్యయనం చేస్తారు. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఇవి తోడ్పడతాయి. పుస్తకాల్లో ఉన్న అంశాలను బాహ్య ప్రపంచానికి అన్వయించుకుంటూ చదవడం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ ప్రత్యేకత. ఈ కోర్సులనభ్యసించినవారు విస్తృతమైన ఆలోచనా నైపుణ్యాలను సొంతం చేసుకుంటారు. అంకితభావం, విలువలతో కూడిన మేధావులను రూపొందించ డానికి ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కోర్సులు-తీరుతెన్నులు: ఉస్మానియా యూనివర్సిటీతోపాటు దాదాపు అన్ని వర్సిటీల పరిధిలోని వివిధ కళాశాలలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్‌సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(బి.ఎ.)లో భాగంగా హిస్టరీ, తెలుగు లిటరేచర్, పొలిటికల్‌సైన్స్, ఎక నమిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీతో పాటు ఉర్దూ, పర్షియన్, ఫిలాసపీల్లో వివిధ కాంబినేషన్లూ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఎకనమిక్స్, సైకాలజీ, సోషియాలజీ, మార్కెటింగ్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర సబ్జెక్టులున్న కాంబినేషన్లను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత విద్య: ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, సోషల్ై సెన్సెస్‌లో వివిధ కాంబినేషన్లలో బ్యాచిలర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మాస్టర్స్ స్థాయిలో ఆసక్తి ఉన్న ఏదో ఒక సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. హిస్టరీ, ఎకానమిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ వంటి సంప్రదాయ సబ్జెక్ట్లేకాకుండా లింగ్విస్టిక్స్, సోషియాలజీ, సైకాలజీ, డెవలప్మెంట్ స్టడీస్ తదితర సబ్జెక్టుల్లో పీజీ కోర్సులనభ్యసించొచ్చు. మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్: దేశంలో విభిన్న వర్గాల వారి మధ్య అసమానతలు, సామాజిక పరిస్థితులే చాలా మంది సోషల్ వర్క్‌ను తమ కెరీర్‌గా ఎంచుకోవడానికి దోహదపడుతున్నాయి. సామాజిక సమస్యలపై అవగాహనకు, వాటి నిర్మూలన తదితర అంశాలపై విద్యార్థులను చైతన్యవంతులుగా ఈ కోర్సులు తీర్చిదిద్దుతున్నాయి. దేశంలోని కొన్ని యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ) కోర్సును పూర్తి చేస్తే మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు ఎంబీఏ ఇన్ రూరల్ డెవలప్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ వంటి కోర్సులూ ఉన్నాయి. ఈ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల్లో అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్: గ్లోబలైజేషన్ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డెవలప్మెంట్ స్టడీస్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ కోర్సులో ప్రధానంగా ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన కాపిటల్ ఇన్‌ఫ్లో, సోషియో-ఎకనమిక్ అంశాలతోపాటు పర్యావరణ విశేషాలను కూడా విద్యార్థులు అభ్యసిస్తారు. ఇది మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. ఇందులో సామాజిక శాస్త్రం, ఎకనమిక్స్, ఆంత్రోపాలజీ, పాలిటిక్స్ తదితర అంశాలుంటాయి. అభివృద్ధికి సంబంధించిన సామాజిక, ఆర్థిక అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ప్రవేశపెట్టిందే.. డెవలప్మెంట్ స్టడీస్. పీజీ స్థాయిలో ఎంఏ (డెవలప్మెంట్ స్టడీస్)గా కోర్సును పలు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎంఏ ఇన్ పాలిటిక్స్: రాజకీయ విలువలు, సంస్థలు, అవి పని చేసేతీరు, రాజ్యాంగం వంటి అంశాలపై ఈ కోర్సులో అధ్యయనం చేస్తారు. పీజీస్థాయిలో ఎంఏ ఇన్ పొలికల్ సైన్స్ కోర్సులను దాదాపు అన్ని యూనివ ర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి టీచింగ్, రీసెర్చ్, పబ్లిషింగ్, బిజినెస్, జర్నలిజం రంగాల కేంద్రీకృతంగా అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ఈ కోర్సును అభ్యసిస్తే మరిన్ని అవకాశాలను అందుకోవచ్చు. విదేశాల్లోనూ విస్తృత డిమాండ్: విదేశాల్లోనూ హ్యుమానిటీస్ కోర్సులకు విస్తృత ఆదరణ లభిస్తోంది. విదేశాల్లో హ్యుమానిటీస్ కోర్సులనభ్యసించడం ద్వారా సాంఘిక పరిస్థితులు, సంస్థలు వాటి విధానాలను అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేయడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు క్లిష్టమైన, విశ్లేషణాత్మక నైపుణ్యాలను సొంతం చేసుకుంటున్నారు. అమెరికాలోని హార్వర్డ్, యేల్, ప్రిన్స్టన్, జార్జిటౌన్, టఫ్ట్స్ తదితర యూనివర్సిటీ/లిబరల్ ఆర్ట్స్ విద్యాసంస్థల్లో పాలిటిక్స్ అండ్ ఐఆర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బాత్, యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ మొదలైనవి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. అమెరికా, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో బిజినెస్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్, మీడియా అండ్ కమ్యూనికేషన్ సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కెరీర్: ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్సెన్సైస్లో కోర్సునభ్యసించిన వారికి ప్రధానంగా కమ్యూనికేషన్స్ అండ్ మీడియా, జర్నలిజం, లా, జెండర్ స్టడీస్, మానవ హక్కులు తదితర విభాగాల్లో దేశవిదేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ‘సామాజిక సమస్యలు, మావన హక్కులు, వాటితో ముడిపడి ఉన్న అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే సోషల్ వర్క్. సేవా దృక్పథం ఉన్నవారు ఈ కోర్సును అభ్యసిస్తే ప్రయోజనం ఉంటుంది’ అని తెలిపాడు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదువుతున్న మనోహర్. ‘విదేశీ భాషలను నేర్చుకోవడం ద్వారా విస్తృత అవకాశాలను అందుకోవచ్చు. భావ వ్యక్తీకరణకు ప్రధాన సాధనం భాష. అటువంటి భాషలో నైపుణ్యం సాధించాలనే ఈ కోర్సును ఎంచుకున్నాను. అంతేకాకుండా ప్రొఫెషనల్ కోర్సులకు దీటుగా దేశ, విదేశాల్లో భాషా నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తుండడం కూడా కోర్సు ఎంపికకు కారణం’ అని పేర్కొంటున్నాడు ఎంఏ ఇంగ్లిష్ చదువుతున్న నారాయణ్. మంచి భవిష్యత్తు ఖాయం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సులను అభ్యసిస్తే సామాజిక అవగాహన అలవడుతుంది. సమాజాన్ని, మానవ సంబంధాలను, చారిత్రక సంపదను, సాంస్కృతిక ఔన్నత్యాన్ని తెలుసుకుంటారు. ఎక్కువ మంది ఎకనమిక్స్, సైకాలజీ, సోషియాలజీ, మార్కెటింగ్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటున్నారు. అకడమిక్ నైపుణ్యాలతోపాటు రైటింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, నిరంతర అధ్యయనం, సామాజిక అంశాలపై అవగాహన తదితర నైపుణ్యాలను సొంతం చేసుకుంటే మంచి భవిష్యత్తు సాధ్యమ వుతుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ప్రధానంగా లాంగ్వేజ్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల విజేతల్లో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సులను అభ్యసించిన వారు ముందుంటున్నారు. - టి.ఎల్.ఎన్. స్వామి ప్రిన్సిపాల్, నిజాం కళాశాల, హైదరాబాద్ విస్తృత అవకాశాలు లభిస్తాయి ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌లో విద్యార్థులు సమాజానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఈ కోర్సుల ద్వారా వారసత్వంగా లభించే నైపుణ్యాలను శిక్షణ ద్వారా మరింత మెరుగుపర్చుకునే అవకాశం లభిస్తుంది. సోషల్ సెన్సైస్ చదివిన వారిలో సామాజిక అంశాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. వీరికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం సాధించిన వారు తోడైతే ఒక సమగ్రమైన సోషల్ నెట్వర్కింగ్ వ్యవస్థ సాధ్యమవుతుంది. హ్యుమానిటీస్‌లో ప్రధానంగా లాంగ్వేజె స్ కోర్సుల్లోనూ ఎక్కువ మంది చేరుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లుగా మారిన వారిలోనూ తెలుగు, ఇంగ్లిష్ తదితర లిటరేచర్ చదివినవారే ఎక్కువగా ఉంటున్నారు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ దగ్గర్నుంచి సాధారణ ట్రాన్స్లేషన్ వరకు భాషా నిపుణులకు అవకాశాలు పెరిగాయి. - ఎస్.మల్లేశ్, ప్రిన్సిపాల్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సెన్సైస్ జనరల్ నాలెడ్‌జ జాతీయోద్యమ కాలం నాటి పత్రికలు ఇవి.. పత్రిక సంవత్సరం, వ్యవస్థాపకుడు/ {పదేశం ప్రాముఖ్యత ట్రిబ్యూన్ 1881, లాహోర్ దయాల్ సింగ్ మజీతియా కేసరి 1881, బొంబాయి తిలక్ మరాఠ 1881, బొంబాయి తిలక్ పరిదాసక్ 1886 బిపిన్ చంద్రపాల్ యుగంతర్ 1906, బెంగాల్ బరీంద్ర కుమార్ ఘోష్, భూపేంద్రనాథ్ దత్తా సంధ్య 1906, బెంగాల్ {బహ్మబంధోపాధ్యాయ ఇండియన్ సోషియాలజిస్ట్ లండన్ శ్యామ్‌జీ కృష్ణ వర్మన్ వందేమాతరం పారిస్ మేడం కామా తల్వార్ బెర్లిన్ వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ ఫ్రీ హిందూస్థాన్ వాంకోవర్ తారక్నాథ్ దాస్ ప్రముఖ చారిత్రక గ్రంథాలు - రచయితల పేర్లు తెలుసుకోండి రచయిత {Vంథం హ్యూయన్‌త్సాంగ్ సి.యూ-కీ దిన్నాగుడు {పమాణ సముచ్ఛయం నన్నయ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు భాసుడు బుద్ధ చరితం నాగసేనుడు మిళింద పన్హా భద్రబాహుడు జైనకల్ప సూత్రం అశ్వఘోషుడు సౌందర్యనందన కావ్యం (సంస్కృతం) పరిశిష్టపర్వం (జైనుల ప్రసిద్ధ గ్రంథం) కొండకుందాచారి సమయసారం శర్వవర్మన్ కాంతార (సంస్కృత గ్రంథం) బుధస్వామి బహృత్కశ్లోక సంగ్రహం ప్రపంచంలో ప్రసిద్ధ కట్టడాలు ఎక్కడున్నాయో తెలుసా? కట్టడం పేరు నగరం అల్అకుస మసీదు జెరూసలేం బిగ్ బెన్ లండన్ బ్రాడెన్బర్గ గేట్ బెర్లిన్ బ్రౌన్ హౌస్ బెర్లిన్ బ్రాడ్ వే న్యూయార్క కలోసియం రోమ్ ఈఫిల్ టవర్ పారిస్ హెడెపార్క లండన్ ఇండియన్ హౌస్ లండన్ కాబా మక్కా క్రెమ్లిన్ మాస్కో అడ్మిషన్స, జాబ్స్ అలర్ట్స ఓయూ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీఏ విభాగాలు: జనరల్ మేనేజ్మెంట్, పర్సనల్, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్. అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎంసీఏ అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంటర్/డిగ్రీలో మ్యాథమెటిక్స్ను చదివి ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 6 వెబ్సైట్: http://ouadmissions.com/oucde/ ఏఆర్‌సీఐ-హైదరాబాద్ హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ (5) అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. అడ్మినిస్ట్రేషన్/ హెచ్ఆర్/ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/స్టోర్స్ అండ్ పర్చేజ్ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి., వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 30 వెబ్సైట్:http://www.arci.res.in/