breaking news
TN TUC
-
టీడీపీకి గుంటూరు రాజేశ్వరి రాజీనామా
చంద్రగిరి : టీడీపీ అనుబంధ సంఘమైన టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుంటూరు రాజేశ్వరి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తెస్తారని నమ్మి ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు. కేంద్రం ఏపీకి హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినా సీఎం దానిపై ఎటువంటి వ్యాఖ్యాలూ చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మంత్రులు సైతం ఈ విషయంలో నోరుమెదపకపోవడం విచారించదగ్గ విషయమన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు తన సొంత జిల్లాను సైతం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైఖరి నచ్చకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. -
కార్మికుల సంక్షేమమే టీడీపీ ధ్యేయం
మన్నవ సుబ్బారావు కొరిటెపాడు : కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు స్పష్టం చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన టీఎన్టీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంక్షేమ మండలి కార్మికుల పిల్లల వివాహానికి, వికలాంగులైన పిల్లలకు ప్రోత్సాహం కల్పిస్తోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని కోరారు. ఆటో డ్రైవర్లకు గతంలో విద్యార్హత లేకపోయినా లెసైన్సులు మంజూరు చేశారని, కానీ లెసైన్సు రెన్యువల్ సమయంలో విద్యార్హత సర్టిఫికెట్ అడుగుతున్నారని, దీంతో ఎన్నో ఏళ్లుగా ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న వారు భుక్తి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో టీఎన్టీయూసీ నాయకులు నారా జోషి, గుంటుపల్లి శేషగిరిరావు, శ్యామ్ సుందర్, పార్టీ నాయకులు లాల్వజీర్, డి.నరేంద్ర పాల్గొన్నారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు స్పష్టం చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన టీఎన్టీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంక్షేమ మండలి కార్మికుల పిల్లల వివాహానికి, వికలాంగులైన పిల్లలకు ప్రోత్సాహం కల్పిస్తోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని కోరారు. ఆటో డ్రైవర్లకు గతంలో విద్యార్హత లేకపోయినా లెసైన్సులు మంజూరు చేశారని, కానీ లెసైన్సు రెన్యువల్ సమయంలో విద్యార్హత సర్టిఫికెట్ అడుగుతున్నారని, దీంతో ఎన్నో ఏళ్లుగా ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న వారు భుక్తి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో టీఎన్టీయూసీ నాయకులు నారా జోషి, గుంటుపల్లి శేషగిరిరావు, శ్యామ్ సుందర్, పార్టీ నాయకులు లాల్వజీర్, డి.నరేంద్ర పాల్గొన్నారు.