breaking news
three nation tour
-
భారత్ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ స్వాగతం పలికారు. విదేశీయాత్రను విజయవంతంగా ముగించినందుకు సంతోషం ప్రకటించారు. మూడుదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని ఈ నెల 24న పోర్చుగల్ వెళ్లారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి సోమవారం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యి... అనంతరం నెదర్లాండ్స్ వెళ్లారు. నిన్న హెగ్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ... ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగొచ్చారు. -
'మోదీ ఇంటర్వ్యూ మేం ప్రచురించం'
ప్రధాని నరేంద్రమోదీ ఇంటర్వ్యూ ప్రచురించేందుకు ప్రముఖ ఫ్రెంచి పత్రిక లీ మాండె తిరస్కరించింది. ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపుతారు తప్ప.. నేరుగా సమాధానాలు ఇవ్వబోరని మోదీ ప్రతినిధి చెప్పడంతో ఆ పత్రిక ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని లీ మాండె దక్షణాసియా కరస్పాండెంట్ జూలియన్ బోయిసూ ట్వీట్ చేశారు. దానికి బదులు లీ ఫిగారోతో ఈ మెయిల్ ఇంటర్వ్యూ కోసం ప్రధానమంత్రి కార్యాలయం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం రాత్రి ఫ్రాన్సు వెళ్లారు. నాలుగు రోజుల ఈ పర్యటనలో ఆయన అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో సమావేశమవుతారు, వ్యాపారవేత్తలతోనూ భేటీ అవుతారు. ఈ పర్యటనలో ప్రధాని ఫ్రెంచి అధ్యక్షుడితో కలిసి సియెన్ నదిలో బోటులో షికారుచేస్తూ చర్చిస్తారు. దీన్ని 'నావ్ పే చర్చా' అని చెబుతున్నారు. ఫ్రాన్సు పర్యటన పూర్తయిన తర్వాత ఆయన జర్మనీ, కెనడా దేశాల్లో పర్యటిస్తారు.