breaking news
telugu people arrested
-
అమెరికాలో అమ్మాయిల అక్రమ రవాణాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్
ట్రెంటన్: అమెరికా న్యూజెర్సీ స్టేట్‌లో హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించడం గమనార్హం.ప్రిన్స్టన్ పోలీసుల వివరాల ప్రకారం.. గిన్స్బర్గ్ లేన్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. 2024 మార్చి 13న ప్రిన్స్టన్ పోలీసు సీఐడీ విభాగం సంతోష్ కట్కూరి ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక పని చేయిస్తున్నట్లు తేలింది. వీరంతా బలవంతంగా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారినుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రిన్స్టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. సంతోష్, ద్వారకతో పాటు చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలె సైతం వీరికి సహకరించినట్లు తెలిసింది. ఈ నలుగురిపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.గిన్స్బర్గ్ ప్రాంతంలో పనిచేసే ఓ శ్రామికుడు అపార్ట్మెంట్లో చాలామంది పని చేస్తుండడం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా.. డాలస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీలో నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పని చేయించుకుంటున్నారని వెల్లడించారు. -
సౌదీలో నతాఖా.. తడాఖా
వందల సంఖ్యలో తెలుగువారి అరెస్టులు సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియా ప్రభుత్వం ‘నతాఖా’ చట్టం కింద అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై కొరడా ఝళిపిస్తోంది. సౌదీకి వివిధ దేశాల నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న వారు తమ నివాస ప్రతిపత్తి(అఖామా)ని సరిచేసుకోవడం.. లేదా, దేశం విడిచి వెళ్లేందుకు ఇచ్చిన ఏడు మాసాల గడువు ముగియడంతో అక్కడి అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు ముమ్మరం చే శారు. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువారు పెద్దగా అరెస్ట్ కాలేదు. కానీ, మంగళవారం మాత్రం వందల సంఖ్యలో అరెస్టు అయినట్లు తెలుస్తోంది. ముఖ్య నగరాలైన ధమామ్, రియాద్, జిద్దా, తైఫ్, ఆల్ఖుబర్, మదీనా తదితర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించగా, వందల సంఖ్యలో తెలుగువాళ్లు పట్టుబడినట్లు అక్కడి పోలీసు ప్రతినిధి నవాఫ్ ఆల్ బెట్ ధ్రువీకరించారు. అవుట్ పాస్‌లు కలిగి ఉన్నవారిని వదిలేసి నివాస ధ్రువీకరణ పత్రాలు లేనివారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్లే అరెస్ట్ చేసి బలవంతంగా ప్రత్యేక పోలీసు వాహనాల్లో జైళ్లకు తరలించినట్లు సమాచారం. రోడ్లతో పాటు ప్రధాన వీధుల్లో ముమ్మర తనిఖీలు కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు గదుల్లోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పర్మిట్ల కోసం పడరాని పాట్లు సౌదీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఎగ్జిట్ పర్మిట్ల కోసం తెలుగువాళ్లు పడరాని పాట్లు పడుతున్నారు. గడువు కంటే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సైతం సకాలంలో ఎగ్జిట్ పర్మిట్ లభించలేదు. గడువు ముగియడంతో మరికొందరు చాటుమాటుగా వెళ్లి పర్మిట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినా.. ఫలితం లేకుండా పోతోంది. దీంతో ప్రధాన కార్యాలయాల సమీపంలో తమకు తెలిసిన వారి నివాసాల్లో పోలీసుల కంటబడకుండా తలదాచుకుంటున్నారు. కొందరికి అవుట్ పాస్‌లు లభించినా.. చేతిలో చిల్లి గవ్వలేక, అప్పులు లభించక తల్లడిల్లుతున్నారు. మరికొందరు డబ్బులు సమకూర్చుకున్నప్పటికీ హజ్ యాత్రికుల తిరుగు ప్రయాణం నేపథ్యంలో విమానాల టికెట్ల రేట్లు అధికమయ్యాయి. దీంతో వారి పరిస్థితి దిక్కుతోచకుంది. అంతా నిశ్శబ్దం దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రతినిత్యం సందడిగా ఉండే కేంద్రాల్లో నిశ్శబ్దం ఆవరించింది. కార్మికులు లేకపోవడంతో వందలాది వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూతపడ్డాయి. వినియోగదారుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. రియాద్‌లో సిటీ సెంటర్, జిద్దా తదితర నగరాల్లోని వాణిజ్య సముదాయాలు పూర్తిగా బోసిపోయాయి. పండ్లు, కూరగాయల మార్కెట్లు సైతం వెలవెలబోయాయి. సరుకుల ఎగుమతి, దిగుమతులకు కార్మికుల కొరత నెలకొంది. భవన నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. పాఠశాలలు మూతపడ్డాయి. ఎంబసీ ముందు ప్రైవేటు మహిళా టీచర్లు ఆందోళనకు దిగారు. స్పందించని ప్రభుత్వాలు సౌదీలో ప్రభుత్వ నూతన కార్మిక చట్టం నతాఖా కారణంగా వేలాది మంది తెలుగువాళ్లు ఉపాధి కోల్పోయి భయం గుప్పిట్లో ఉన్నప్పటికీ ప్రభుత్వాల నుంచి వారికి కనీస భరోసా లభించడం లేదు. ఒక సారి అరెస్ట్ అయి జైలుకు వెళ్లితే మాత్రం జడ్జిమెంట్ వచ్చేంతవరకు అందులోనే మగ్గాల్సి ఉంటుందని ఇక్కడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇక్కడి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెనక్కొచ్చే వారికి పూర్తి సాయం: వయలార్ రవి న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో కొత్త కార్మిక చట్టం నతాఖా కారణంగా స్వదేశానికి పయనమయ్యే భారతీయులందరికీ పూర్తి సాయం అందిస్తామని ప్రవాస వ్యవహారాల మంత్రి వయలార్ రవి చెప్పారు. సౌదీలో పరిస్థితిని భారత్ సునిశితంగా గమనిస్తోందని, పలు అసోసియేషన్లతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. తెలుగువారిని ఆదుకోవాలి సౌదీలో నివాస ప్రతిపత్తి లేని వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. నతాఖా చట్టం కృరణంగా కంపెనీలు పని నుంచి తీసివేయడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండాపోయింది. తక్షణమే ప్రభుత్వం ఒక బృందాన్ని అక్కడికి పంపించి ప్రత్యేక విమానాల్లో వారికి తీసుకుని వచ్చేందుకు చర్యలు చేపట్టాలి. -కోటపాటి నర్సింహానాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు, గల్ఫ్ బాధితుల హక్కుల పోరాట సమితి