breaking news
Telangana medical education
-
సీట్ల పెంపు.. ఫ్యాకల్టీ సమస్యకు చెక్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని విస్తరించి, బోధనా సిబ్బంది (ఫ్యాకల్టీ) కొరతను అధిగమించే దిశగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ (ఫ్యాకల్టీ అర్హతలు) రెగ్యులేషన్స్–2025 పేరుతో రూపొందించిన కొత్త నిబంధనలను శనివారం ఢిల్లీలో విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 75 వేల కొత్త వైద్య సీట్ల లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఈ నిబంధనలు ఉపపయోగపడనున్నాయి. ముఖ్యంగా బోధనా సిబ్బంది కొరత కారణంగా కొత్త కాలేజీలకు అనుమతులు నిలిచిపోతున్న నేపథ్యంలో ఎన్ఎంసీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా వైద్య విద్యా వ్యవస్థను తిరుగులేని దిశగా నడిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త నిబంధనలలో ముఖ్యమైన మార్పులు ఇలా.. ఆ ప్రభుత్వ దవాఖానాలకూ బోధనా హోదా దేశవ్యాప్తంగా 220 పడకల కంటే ఎక్కువ ఉన్న నాన్–టీచింగ్ ప్రభుత్వ దవాఖానలను కూడా బోధనా ఆసుపత్రులుగా గుర్తించవచ్చు. ఇక్కడ పనిచేస్తున్న 10 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులను అసోసియేట్ ప్రొఫెసర్, 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారిని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించుకోవచ్చు. కానీ వీరు రెండేళ్లలో ‘బేసిక్ కోర్స్ ఇన్ బయోమెడికల్ రీసెర్చ్ (బీసీబీఆర్)’పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన నిపుణుల సేవలు విద్యారంగానికి కూడా అందుబాటులోకి వస్తాయి. తాజా నిబంధనలతో ఇకపై దేశ వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ దవాఖానాలు బోధనాసుపత్రులుగా మారేందుకు అవకాశం ఏర్పడింది. యూజీ, పీజీ కోర్సులు ఒకేసారి ప్రారంభించుకునే చాన్స్ ఇప్పటివరకు మెడికల్ కాలేజీలు తొలుత ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించిన తర్వాతే ఎండీ/ఎంఎస్ వంటి పీజీ కోర్సులను ప్రారంభించేవి. ఇకపై నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలు యూజీతో పాటు పీజీ కోర్సులను కూడా ఒకేసారి ప్రారంభించవచ్చు. ఇది వైద్యుల కొరత తీర్చడంలో సహాయపడుతుందని ఎన్ఎంసీ పేర్కొంది. పీజీకి కొన్ని మినహాయింపులు ఇప్పటివరకు పీజీ కోర్సు ప్రారంభించాలంటే ముగ్గురు ఫ్యాకల్టీ, ఒక సీనియర్ రెసిడెంట్ ఉండాలి. కొత్త నిబంధనల ప్రకారం, కేవలం ఇద్దరు ఫ్యాకల్టీ, 2 సీట్లతో కోర్సును ప్రారంభించవచ్చు. కొన్ని స్పెషాలిటీ విభాగాల్లో బెడ్ అవసరాలు కూడా తగ్గించారు, తద్వారా చిన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పీజీ కోర్సుల నిర్వహణ సాధ్యమవుతుంది. సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అనువైన బ్రాడ్ స్పెషాలిటీ విభాగాల పరిధి పెంచారు. దీని ద్వారా ఇప్పటికే ఉన్న ఫ్యాకల్టీని సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వినియోగించుకోవడం సులభమవుతుంది. ఎంఎస్సీ–పీహెచ్డీ అర్హత గల వారు ఇతర విభాగాలకు.. ఇప్పటివరకు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో మాత్రమే ఎంఎస్సీ – పీహెచ్డీ విద్యార్హత గల వారిని ఫ్యాకల్టీగా నియమించేవారు. ఇప్పుడు మైక్రోబయాలజీ, ఫార్మకోలజీ విభాగాలకూ ఇది వర్తిస్తుందని ఎన్ఎంసీ తెలిపింది. అలాగే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ వంటి ప్రీ క్లినికల్, పారా క్లినికల్ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పదవికి గరిష్ట వయో పరిమితిని 50 ఏళ్లకు పెంచారు. దేశ వ్యాప్తంగా వైద్య విద్య విస్తరణకు దోహదం‘ఈ నూతన నిబంధనలు వైద్యుల నైపుణ్యాన్ని, అనుభవాన్ని, విద్యార్హతను ప్రధానంగా తీసుకొని రూపుదిద్దుకున్నాయి. కఠినమైన సేవా ప్రమాణాలకు బదులుగా ఫ్యాకల్టీ ఎంపికలో ప్రా మాణికత, అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ నిబంధనల మార్పులోని ప్రధాన, బలమైన అంశం. ఇది మెడికల్ విద్యా రంగంలో గొప్ప విప్లవానికి నాంది పలకనుంది. ప్రస్తుతం దేశంలో పట్టణాలకే పరిమితమైన వైద్య విద్య అవకాశాలు, నూతన నిబంధనల వల్ల వెనుకబడిన ప్రాంతాల్లో కూడా విస్తరించనున్నాయి. ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు ఇది పునాది అవుతుంది..’అని ఎన్ఎంసీ పేర్కొంది. -
Telangana: 8.78 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్ సీటు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ చదువు అంటే అందని ద్రాక్ష అనే భావనకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. 8,78,280 నీట్ ర్యాంకు వచ్చిన విద్యార్థికి సైతం స్వరాష్ట్రంలోనే ఎంబీబీఎస్ సీటు దక్కేలా చేసి, రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొనేలా చేసింది. 2021–22 వైద్య విద్యా సంవత్సరంలో మైనార్టీ మెడికల్ కాలేజీలు కలుపుకొని బీ కేటగిరీలో 1,214 సీట్లు ఉండేవి. రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇందులో 495 సీట్లు మాత్రమే లోకల్ విద్యార్థులకు దక్కాయి. గరిష్టంగా 2,71,272 ర్యాంకు వచ్చిన తెలంగాణ లోకల్ విద్యార్థికి అడ్మిషన్ దొరికింది. మిగతా 719 సీట్లలో నాన్ లోకల్ కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇలా రాష్ట్ర విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్‌ను తీసుకువచ్చింది. దీంతో స్థానిక విద్యార్థులకు వైద్య విద్యనభ్యసించే అవకాశాలు మరింత పెరిగాయి. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సైతం ఎంబీబీఎస్ సీటు వచ్చింది. 2022–23 విద్యా సంవత్సరంలో బీ కేటగిరీలో మొత్తం 1,267 సీట్లు ఉన్నాయి. ఇందులో నూతన స్థానిక రిజర్వేషన్ విధానం వల్ల రాష్ట్ర విద్యార్థులకు 1,071 సీట్లు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఈసారి 8,78,280 ర్యాంకు వచ్చిన తెలంగాణ లోకల్ విద్యార్థికి కూడా సీటు వచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కన్వీనర్ కోటాలోనూ పెరిగిన అవకాశాలు రాష్ట్రంలో ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీలు రావడంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆలిండియా కోటా మినహాయించుకొని కేటగిరీ ఏ (కన్వీనర్) కోటాలో 2021–22లో 3,038 సీట్లు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 4,094కు పెరిగింది. దీంతో ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ, బీసీ బీ, బీసీ డీ, బీసీ ఈ కేటగిరీల్లో కటాఫ్ తగ్గి ఎక్కువ మందికి సీట్లు దక్కాయి. ఎస్టీ రిజర్వేషన్ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో ఆ కేటగిరీలో మరింత మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం కలిగింది. గరిష్టంగా 10,55,181 ర్యాంకు వచ్చిన అభ్యర్థికి సైతం సీటు వచ్చింది. విద్యార్థినులదే పైచేయి.. ఎంబీబీఎస్‌లో ఎక్కువగా విద్యార్థినులే సీట్లు పొందుతున్నారు. 2021–22లో మొత్తం 5,095 సీట్లలో 60.79 శాతం సీట్లు విద్యార్థినులే పొందారు. కన్వీనర్ కోటాలో 63.36 శాతం, మేనేజ్మెంట్ కోటాలో 55.76 శాతం సీట్లు విద్యార్థినులకు దక్కా యి. ఈ ఏడాది కూడా కన్వీనర్ కోటాలో 62.68 శాతం, మేనేజ్మెంట్ కోటాలో 63.73 శాతం సీట్లు విద్యార్థినులు సాధించారు. మొత్తం 6,186 సీట్లలో 62.98 శాతం సీట్లు విద్యార్థులు పొందారు. 42 కాలేజీలు..6,690 సీట్లు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 42కు పెరిగింది. ఎంబీబీఎస్ సీట్లు 6,690కు పెరిగాయి. 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో కొత్తగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు రాగా, బి– కేటగిరీలో 85 శాతం లోకల్ రిజర్వేషన్, 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగిన ఎస్టీ రిజర్వేషన్ వల్ల మార్కుల కటాఫ్ భారీగా తగ్గింది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలో ఇన్ని సీట్లు లేకపోవడం గమనార్హమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక పీజీ సీట్ల విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్ 2వ స్థానంలో ఉండటం గమనార్హమని, రాష్ట్రంలో మొత్తం 2,544 పీజీ సీట్లు ఉన్నాయని వివరించారు. -
రెమిడిసివిర్ ఎక్కువగా వాడితే బ్లాక్‌ఫంగస్ వచ్చే ఛాన్స్: డీఎంఈ రమేశ్‌రెడ్డి
-
నిమ్స్‌లో వైద్యుడి మృతిపై కమిటీ విచారణ షురూ
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో ఇటీవల మృతి చెందిన రెసిడెంట్ డాక్టర్ శివతేజారెడ్డి ఘటనపై బుధవారం విచారణ కమిటీ నిమ్స్‌లో పర్యటించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా, కమిటీ చైర్మన్ డాక్టర్ రాజారెడ్డి, తెలంగాణ వైద్య విద్యాశాఖ డెరైక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మంజుల తొలిసారిగా విచారణ కోసం నిమ్స్‌కు వచ్చారు. ఎమర్జెన్సీ వార్డులోని 5వ ఫ్లోర్లో విచారణ ప్రారంభించారు. శివతేజారెడ్డి మార్చి 25న తన గదిలో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ విచారణలో భాగంగా తొలిరోజు నిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివానందరెడ్డి, మాజీ అధ్యక్షుడు డాక్టర్ రఘు కిషోర్, ప్రతినిధులు శ్రీనివాస్‌గౌడ్, రెసిడెంట్ డాక్టర్లు శోభన్, సతీశ్, వంశీకృష్ణ తదితరులు కమిటీ ముందు హాజరయ్యారు. శివతేజారెడ్డి మంచితనం, విధి నిర్వహణలో ఆయన చూపే అంకిత భావం, సామాజిక సేవా కార్యక్రమాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. శివతేజారెడ్డి మృతికి కారకులైన బోధకుల పేర్లు కూడా కమి టీ దృష్టికి తీసుకెళ్లారు. పలు విభాగాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వివరించారు. రెసిడెంట్లు చెప్పిన అంశాలను కమిటీ సభ్యులు విని నోట్ చేసుకున్నారు. శనివారం మరోసారి ఆయా రెసిడెంట్లతో సమావేశమై తుది నివేదికను రూపొందించనున్నారు. -
మూడు మెడికల్ కాలేజీలకు అనుమతి
రాష్ట్రానికి కొత్తగా 450 ఎంబీబీఎస్ సీట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విద్యలో చేరే విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) రాష్ట్రానికి మరో మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతినిచ్చింది. పెరిగిన సీట్లు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా 26 మెడికల్ కాలేజీలకు ఎంసీఐ అనుమతివ్వగా.. వాటిలో మూడు తెలంగాణలోని సంస్థలకు ఇచ్చింది. మెదక్ జిల్లా ములుగూరు మండలంలోని ఆర్వీఎం మెడికల్ కాలేజీ, రంగారెడ్డి జిల్లాలోని మహావీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, పటాన్‌చెరులోని మహేశ్వర మెడికల్ సెన్సైస్‌కు అనుమతులు వచ్చాయి. వీటిలో ఒక్కో కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున రానున్నాయి. మొత్తం 450 సీట్లల్లో 225 సీట్ల (50 శాతం)ను కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఎంసెట్-3లో ర్యాంకులు సాధించిన వారు ఈ సీట్లను పొందుతారు. మిగిలిన 225 మేనేజ్మెంట్ సీట్లను నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు పొందొచ్చు. ఈ కళాశాలలకు సంబంధించిన తనిఖీలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి.