breaking news
Team of the tournament
-
T20 WC 2026: ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ.. భారత ఆటగాళ్ల డామినేషన్
నిన్న (మార్చి 8) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో ఎడిషన్‌లో (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో శివమ్ దూబే (8 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 3, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆదిలోనే చేతులెత్తేసింది. బుమ్రా (4-0-15-4), అక్షర్ పటేల్ (3-0-27-3), హార్దికా పాండ్యా (4-0-26-1), వరుణ్ చక్రవర్తి (3-0-29-1), అభిషేక్ శర్మ (1-0-5-1) ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటై, 96 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. కివీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ సీఫర్ట్ (52), మిచెల్ సాంట్నర్ (43) మాత్రమే నామమాత్రపు ప్రదర్శనలు చేశారు. 4 వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సూపర్-8 నుంచి భారత విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించాయి.ఇదిలా ఉంటే, టోర్నీ పూర్తయ్యాక ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఇందులో భారత ఆటగాళ్ల హవా కొనసాగింది. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు సికందర్ రజా ఎంపికయ్యాడు. భారత్ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా) ఎంపికయ్యారు. 12వ ఆటగాడు కూడా భారత ఆటగాడే (హార్దిక్ పాండ్యా) కావడం విశేషం.ఐసీసీ టీమ్ ఆఫ్ టీ20 వరల్డ్‌కప్ 2026: సంజూ శాంసన్ (wk), టిమ్ సీఫెర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రాన్ హెట్‌మైర్, సికందర్ రజా (c), శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజారబాని, జస్ప్రీత్ బుమ్రా12వ ఆటగాడు: హార్దిక్ పాండ్యా -
CWC 2023:‘టీమ్ ఆఫ్ ద టోర్నీ’ కెప్టెన్ గా రోహిత్
వన్డే ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’ ఎంపిక చేసింది. ఈ జట్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా నియమించింది. తుది 11 మంది జట్టులో ఆరుగురు భారత క్రికెటర్లు (రోహిత్, కోహ్లి, రాహుల్, షమీ, బుమ్రా, జడేజా) ఉన్నారు. మ్యాక్స్‌వెల్, జంపా (ఆ్రస్టేలియా), డికాక్ (దక్షిణాఫ్రికా), డరైల్ మిచెల్ (న్యూజిలాండ్), మదుషంక (శ్రీలంక) ఇతర సభ్యులుగా ఉన్నారు. -
ప్రపంచ టి20 జట్టు కెప్టెన్‌గా ధోని
భారత్ నుంచి నలుగురికి చోటు దుబాయ్: భారత కెప్టెన్ ధోని ప్రపంచ టి20 జట్టు సారథిగా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌లో తాజాగా ముగిసిన ప్రపంచకప్‌లో ప్రదర్శన, అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ’గా ఈ జట్టును ఎంపిక చేసింది. ధోని, కోహ్లిలతో సహా భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లకు ఈ జట్టులో స్థానం లభించగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ల నుంచి ఇద్దరు చొప్పన, ఆస్ట్రేలియా, శ్రీలంకల నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. డేవిడ్ బూన్ చైర్మన్‌గా గల సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. జట్టు వివరాలు: రోహిత్ (భారత్), మైబర్గ్ (నెదర్లాండ్స్), కోహ్లి (భారత్), డుమిని (దక్షిణాఫ్రికా), మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), ధోని (భారత్), స్యామీ (వెస్టిండీస్), అశ్విన్ (భారత్), స్టెయిన్ (దక్షిణాఫ్రికా), బద్రీ (వెస్టిండీస్), మలింగ (శ్రీలంక), 12వ ఆటగాడు సాంటొకీ (వెస్టిండీస్). మహిళల ప్రపంచ జట్టులో పూనమ్ యాదవ్ టి0 మహిళల వరల్డ్ టీమ్ ఆఫ్ ద టోర్నీలో భారత్ నుంచి లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్ మాత్రమే స్థానం దక్కింది. ఇంగ్లండ్ కెప్టెన్ చార్లొట్ ఎడ్వర్డ్స్ సారథిగా ఎంపికైన ఈ జట్టులో ఆ దేశానికి చెందిన మొత్తం నలుగురికి చోటు లభించింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల నుంచి ఇద్దరు చొప్పున ఎంపికయ్యారు.


