breaking news
tax waiver
-
చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ ఎత్తివేత
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు దిగివచి్చన నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేసే చమురుపై, విమాన ఇంధనం, డీజిల్, పెట్రోల్ ఎగుమతులపై దాదాపు రెండున్నరేళ్లుగా విధిస్తున్న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను కేంద్రం తొలగించింది. అలాగే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న రహదారులు, మౌలిక సదుపాయాల సెస్సును కూడా ఉపసంహరించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం రాజ్యసభ ముందుంచారు.దీనితో దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ), ఆయిల్ ఇండియా వంటి సంస్థలకు, అలాగే ఎగుమతులు చేసే రిలయన్స్, నయారాలాంటి కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. ఆయిల్ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. 2022 జూలై 1న దేశీయంగా తొలిసారి దీన్ని విధించారు. ఆయిల్ బ్యారెల్‌ను 75 డాలర్లకు మించి ఎంత రేటుకు విక్రయించినా, వచ్చే ఆ లాభాలపై ప్రభుత్వం ఈ ట్యాక్స్‌ను విధిస్తూ వస్తోంది.2022లో దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పై టన్నుకు రూ. 23,250 చొప్పున, ఎగుమతి చేసే పెట్రోల్ .. ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ. 13 చొప్పున దీన్ని విధించింది. తద్వారా 2022–23లో రూ. 25,000 కోట్లు, 2023–24లో రూ. 13,000 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 6,000 కోట్ల వరకు సమీకరించింది. దీన్ని ఎత్తివేయాలంటూ చాలాకాలంగా పరిశ్రమతో పాటు కేంద్ర పెట్రోలియం..సహజ వాయువు శాఖ లాబీయింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్ బాస్కెట్ రేటు సగటున 73.02 డాలర్ల స్థాయిలో ఉంది. -
వాళ్ల సినిమాలకు క్షణాల్లో పన్ను మాఫీ... మరి మాకు..?
ఉమ్మడి రాష్ట్రంలోనన్నా మంత్రులు తెలంగాణ వాళ్ళ ఆవేదనను వినేవాళ్ళు. ఒక సందర్భంలో మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి డి.కే అరుణను కలసి ‘తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్’ ఆమోదం కోసం దరఖాస్తు పెడితే అప్ప టికప్పుడే పచ్చ సిరాతో సంతకం పెట్టి కమిషనర్‌కి ఫార్వర్డ్ చేసిన తీరు గుర్తుకు వస్తున్నది. రాష్ట్ర విభజన సందర్భంలో ఆగిన ఆ ఫైలు ఇప్పటిదాకా అలాగే ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డ్డాక పరిస్థితి ఊహకందని విధంగా తయారైంది. సీఎంతో సహా ఇతర మంత్రులు కూడా తెలంగాణ వాళ్ళు తీసిన సినిమాలకంటే సీమాంధ్ర నిర్మా తల సినిమాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. మోజు పడి భారీ బడ్జెట్ సినిమాల వేడు కలకు హాజరు అవుతున్నారు. మరో వైపున తెలంగాణ నిర్మాతలకు సీఎం అపాయింట్మెంటే దొరకదు! అదే ‘రుద్రమదేవి’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలకు అప్పటికప్పుడే క్షణాలలో పన్ను మాఫీ చేయమని హుకుం జారీ అయిపోయింది. ఆ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సిని మాలే. వీటికి ప్రోత్సాహకాలు ఇవ్వడం అవసరమా? ఒక చరిత్ర గాంచిన గొప్ప పేరు పెట్టి సినిమా తీస్తే సరిపోతుందా? వక్రీకరణలు, అసభ్య దృశ్యాలు, అస హజ సన్నివేశాలు, ఎబ్బెట్టు డైలాగులు ఉన్నాయా అని చూడకుండానే జీఓలు పాస్ చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నచ్చిన వారికి నచ్చిన విధంగా, నచ్చ నివారిని దగ్గరకు రానీయకుండా చేయ డం సబబేనా! వేరుపడ్డాక కూడా తెలం గాణ బిడ్డలపట్ల వివక్ష చూపితే ఎలా? ఎన్నో తక్కువ బడ్జెట్ సినిమాలు , తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాలు, తెలంగాణ చరి త్రను, పోరాటాలను తెరకెక్కించిన సినిమాలు అతికష్టంతో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు థియేటర్లు దొర కక, ఒకవేళ అరకొర థియేటర్లు దొరి కినా, భారీ అద్దెలు పన్నులు కట్టలేక, నిలబడలేక చితికిపోయిన సినిమాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటికి పన్నుమాఫీ చేసి ఆదుకుంటే, అది నిజమైన ప్రోత్సా హకం అనబడేది. మేము ప్రొసీజర్ ప్రకా రంగా దాఖలుచేసినా మా ఫైల్ అంగుళం కూడా జరగదు, అదే కొందరికి అప్పటి కప్పుడే ఉత్తర్వులు జారీ అయిపోతు న్నాయి. ఎదిగే దశలో ఉన్నవారిపట్ల మెడలు తిప్పుకొని, ఇప్పటికే ఎదిగిపోయిన వారితో మితిమీరిన అలాయ్ బలాయ్ తీసుకుని, వేదికలు పంచుకుంటున్నారు. రెండేళ్లుగా సీఎం కేసీఆర్‌కి తెలంగాణ చిత్రపరిశ్రమ సమస్యలు దఫదఫాలుగా విడమర్చి చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. క్షణాలలో పన్ను మినహా యింపు కొరకు జీవో జారీ చేసినట్లుగా, తెలంగాణ భూమిపుత్రుల కోసం ఒక ప్రత్యేక సినిమా పాలసీని రూపొందించ మని కోరుకుంటున్నాం! - సయ్యద్ రఫీ, సినీదర్శకుడు, తెలంగాణ చిత్ర పరిశ్రమ