breaking news
Tangidi
-
దేవతలు నడయాడిన నేల.. అద్భుత మహిమలు!
నారాయణపేట/కృష్ణా: నారాయణపేట జిల్లా కృష్ణా మండలం తంగిడి గ్రామ సమీపంలోని కృష్ణా, భీమా నదుల సంగమ ప్రాంతం ఓ విశిష్టమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడే భీమా నది తెలంగాణలోకి ప్రవేశించి.. తంగిడి క్షేత్రంలోనే కృష్ణానదిలో విలీనమవుతుంది. దేవతలు నడయాడిన స్థలంగా, రుషులు, మునులు తపస్సు ఆచరించిన దైవభూమిగా, ఎన్నో అద్భుతాలు, మహిమలు జరిగిన క్షేత్రంగా తంగిడికి ఘన చరిత్ర ఉంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు (Pilgrims) ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడే రెండు పుష్కరాలు.. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని కృష్ణా మండలం తంగిడి వద్ద కృష్ణా, భీమా నదులు కలుస్తాయి. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పుష్కరాలకు కృష్ణా, భీమా సంగమ ప్రాంతం ప్రత్యేకత చాటుతోంది. 2016, ఆగస్టు 12 నుంచి 23 వరకు 12 రోజులపాటు పుష్కరాలు జరిగాయి. 2028లో ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరిగే పుష్కరాలకు సిద్ధమవుతోంది. భీమా పుష్కరాలు 2018, ఆక్టోబర్ 11 నుంచి 22వ తేదీ వరకు తంగిడి, కుసుమూర్, శుక్రలింగంపల్లి గ్రామాల్లో జరిగాయి. 2030, అక్టోబర్ 11 నుంచి 22వ తేదీ వరకు పుష్కరాలు (Pushkaralu) జరగనున్నాయి. అయితే సంగమ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. దక్షిణం వైపు ప్రవాహం.. భీమానది దక్షిణం వైపు ప్రవహిస్తుంది. ఇది కాశీలోని గంగానదితో సమానం. గయాలోని హోళీ స్థలమైన ప్రజలు పుష్కర స్నానం ఆచరించడం స్వచ్ఛమైనదని, పవిత్రమైన ప్రదేశమని హిందువులు భావిస్తారు. తంగిడి వద్ద కృష్ణా, భీమా నదుల సంగమాన్ని నివృత్తి సంగమం అని పిలుస్తారు. గత చరిత్ర ప్రకారం దత్తాత్రేయ అవతారమెత్తిన స్వామి శ్రీపాదవల్లభ కురువపురం అనే ప్రదేశం ఈ సంగమానికి చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రదేశం ప్రత్యేకత కలిగి ఉండటం, తెలంగాణ రాష్ట్రంలోకి కృష్ణానది ప్రవేశ స్థలం కావడంతో ఈ సంగమం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇక్కడే విద్యుత్ శక్తి పుట్టింది.. సాక్షాత్ జగద్గురు శ్రీదత్తాత్రేయ మహాస్వామి మొదటి అవతార పురుషుడైన శ్రీపాద వల్లభుడు తంగిడి క్షేత్రంలోని కృష్ణా, భీమా నదుల సంగమక్షేత్రంలో స్నానం ఆచరించి తపస్సు చేసినట్లు వేదాల్లో పేర్కొనబడింది. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని నివృత్తి సంగమంగా పేరు గాంచిందని దత్త పీఠాధిపతులు చెబుతుంటారు. అలాగే ఈ ప్రాంతంలో సంగమేశ్వరుడి ఆలయం ఉంది. ఇది అతి పురాతనమైన దేవాలయం. ఇక్కడ కొడెకల్ స్వామీజీ చెప్పినట్లు ఈ నది నీటి ద్వారానే ఓ శక్తి పుడుతుంది. ఆ తర్వాత సంగమంలోని రాతి కోడి కూస్తుంది. ఆ కోడి కూసిన రోజు ఈ ప్రపంచం మునిగిపోతుందని ఓ శిలాశాసనం ఉంది. ఆ శాసనంలో చెప్పినట్లే ఇక్కడున్న బురుజుపై రాతి కోడి ఉండేది. అది ప్రస్తుతం శిథిలమైంది. అలాగే శాసనం కూడా శిథిలమైపోయింది. కానీ ఈ మాటలను మాత్రం ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ అంటుంటారు. అలాగే ఆ స్వామీజీ చెప్పినట్లు ఈ నీటి ద్వారానే శక్తి పుడుతుందని చెప్పినట్లే కర్ణాటకలోని శక్తినగర్‌లో పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్‌శక్తి ఉత్పత్తి అవుతోంది. సంగమ క్షేత్రం ప్రత్యేకతలివీ.. కృష్ణా మండలం తంగిడి వద్ద కృష్ణా, భీమా నదులు కలిసే ప్రాంతమే సంగమ క్షేత్రం. ఈ క్షేత్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, అక్కడ దేవతలు, రుషు లు, మునులు తపస్సు ఆచరించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు దివ్యక్షేత్రంగా వెలుగొందిందని ప్రసిద్ధి. దత్తాత్రేయ మొదటి మానవ అవతారం ఎత్తిన శ్రీపాద వల్లభుడు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. ఇప్పటికీ ఆయన జన్మించిన ఇల్లు అక్కడ ఉండటం విశేషం. అక్కడ 16 ఏళ్ల వరకు ఉండి దేశ సంచారం నిమిత్తం వెళ్లిపోయారు. అలా వెళ్లిన వ్యక్తి.. కొన్నేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా మాయమయ్యారు. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి నాడు తంగిడిలోని నివృత్తి సంగమంలో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు తపస్సు ఆచరించి.. ఇక్కడి నుంచి కర్ణాటకలోని కుర్మగడ్డకు వెళ్లారని చారిత్రక ఆధారాలున్నాయి.ఇప్పటికీ ఈ సంగమంలో శ్రీపాదుడు తపస్సు చేసిన వినాయక విగ్రహం, ఆయన పాదుకలు, శివలింగం ఉన్నాయి. ఆయన ఇక్కడి నుంచి కుర్మగడ్డకు నడుచుకుంటూ వెళ్లిన మార్గంలో నదిలో నల్లరాయితో రోడ్డు వేసినట్లు ఇప్పటికీ ఇక్కడ ప్రత్యక్షంగా కన్పిస్తాయి. ఇంతటి విశేషమైన ఈ ప్రాంతాన్ని తెలుసుకున్న విఠల్‌బాబా అప్పట్లో దత్త భీమేశ్వర ఆలయం నిర్మించారు. ఈ నివృత్తి సంగమంలో స్నానం ఆచరించిన భక్తులకు పాపాలు నివృత్తి అవుతాయని ప్రసిద్ధి. ఈ స్థానం తెలంగాణకు ఓ వరంలాంటిది. ఇలాంటి క్షేత్రం మరెక్కడా లేదని, ఇది ఓ మానస సరోవరం అని దత్త పీఠాధిపతులు అంటున్నారు. 1557–58లో విజయనగర రాజు రామరాయ బహమన్ సుల్తానులను ఓడించి ఈ సంగమం ఒడ్డున కుతుబ్‌షాహీ, ఆదిల్షాహీ, నిజాంషాహీ, బరీద్ షాహీ సుల్తానులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.బ్రిడ్జి నిర్మించాలి నది అటువైపు కర్ణాటకలో ఉన్న సంగమ క్షేత్రానికి ఇటువైపు ఉన్న భక్తులు వెళ్లేందుకు బ్రిడ్జిని నిర్మించాలి. అప్పుడే అక్కడి భక్తులు ఇక్కడికి, ఇక్కడి భక్తులు అక్కడికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు కృషి చేయాలి. – శ్రీకాంత్‌చారి, పురోహితుడుచదవండి: మత్స్యరూపం.. శుభ సంకల్పంపర్యాటకంగా తీర్చిదిద్దాలి తంగిడి వద్ద ఉన్న సంగమ క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కలి్పంచాలి. కృష్ణా, బీమా నదుల సంగమం వద్ద స్నానాల గదులతో పాటు దుస్తులు మార్చుకునేందుకు గదులు నిర్మించాలి. – అమర్‌కుమార్ దీక్షిత్, కృష్ణా -
సకల పాపాలనూ నివృత్తి చేసే... తంగిడి సంగమం
పుణ్య తీర్థం ఇటు మహబూబ్‌నగర్ జిల్లా.. అటు కర్ణాటక సరిహద్దు.. మధ్యలో కృష్ణానది. మరోవైపు భీమానది పరవళ్లు... సాక్షాత్ జగద్గురు శ్రీదత్తాత్రేయ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు స్నానమాచరించిన కృష్ణ, భీమ నదుల సంగమక్షేత్రమిది. అతి పురాతనమైన సంగమేశ్వరుడి ఆలయం ఈ క్షేత్రంలోనే ఉంది. కర్ణాటక బ్రహ్మంగారిగా పేరు పొందిన కొడెకల్ స్వామి మాటల్లో చెప్పాలంటే... ఈ నది నీటి ద్వారానే ఓ శక్తి పుడుతుంది. ఆ తరువాత సంగమంలోని రాతి కోడి కూస్తుంది. ఆ కోడి కూసిన రోజు ఈ ప్రపంచమంతా జలసమాధి అయిపోతుంది’’ ఇది ఓ శిలాశాసనంలో ఉంది. ఆ శాసనంలో చెప్పినట్లే ఇక్కడున్న బురుజుపై రాతికోడి ఉండేది. అది ప్రస్తుతం శిథిలమైంది. అదే విధంగా ఆ శాసనమూ ప్రస్తుతం శిథిలమైపోయింది. కానీ ఈ ప్రాంత ప్రజలు మాత్రం ఈ మాటలను ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటారు. ప్రత్యేకతలకు సంగమం మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండల పరిధిలోని తంగిడి గ్రామం వద్ద కృష్ణ, భీమనదులు కలిసే చోటును సంగమ క్షేత్రంగా అభివర్ణిస్తారు. ఈ క్షేత్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ దేవతలు, రుషులు, మునులు తపస్సు ఆచరించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణమ్మ అడుగిడుతున్న ప్రాంతమిది. ఒకప్పుడు ఇది దివ్యక్షేత్రంగా వెలుగొందిందని ప్రసిద్ధి. దత్తాత్రేయ స్వామి మొదటి అంశావతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించాడు. ఇప్పటికీ ఆయన జన్మించిన ఇల్లు అక్కడ ఉండడం విశేషం. అక్కడ 16 సంవత్సరాల వరకు ఉండి దేశసంచారం నిమిత్తం వెళ్లిపోయాడు. ఆలా వెళ్లిన వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు ఎవరికీ కన్పించకుండా మాయమయ్యాడు. ఆ తరువాత కార్తీక పౌర్ణమి నాడు తంగిడిలోని నివృత్తి సంగమంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు తపస్సు ఆచరించి ఇక్కడినుంచి కర్ణాటకలోని కుర్మగడ్డకు వెళ్లాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఈ సంగమంలో శ్రీపాద శ్రీవల్లభుడు పూజించిన వినాయక విగ్రహం, ఆయన పాదుకలు, శివలింగం ఉన్నాయి. ఆయన ఇక్కడినుంచి కుర్మగడ్డకు కాలినడకన వెళ్లిన మార్గంలో నదిలోని రాళ్లు నల్లరాయితో రోడ్డు వేసినట్లు ఇప్పటికీ ఇక్కడా ప్రత్యక్షంగా కన్పిస్తాయి. ఇంతటి విశేషమైన ఈ స్థానాన్ని తెలుసుకున్న విఠల్‌బాబా ఇక్కడా ఓ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అందులో భాగంగానే ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ దత్తభీమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ నివృత్తి సంగమంలో స్నానం ఆచరించిన వ్యక్తులకు పాపాలు నివృత్తి అవుతాయని ప్రసిద్ధి. అందుకే ఈ క్షేత్రానికి తంగిడి సంగమమని, నివృత్తి సంగమమనీ పేరొచ్చింది. సంగమ క్షేత్రానికి వెళ్లే మార్గం నివృత్తి సంగమ క్షేత్రానికి వచ్చే భక్తులు హైదరాబాద్ నుంచి లేదా మహబుబ్‌నగర్ నుండి నేరుగా రాయచూర్ వెళ్లే బస్సులో రాష్ట్ర సరిహద్దులోని టైరోడ్డులో దిగి, అక్కడి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాగ్రామం వరకూ ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి. అక్కడి నుండి 5 కి లోమీటర్లు వెళితే ఈ తంగిడి సంగమ క్షేత్రానికి చేరుకోవచ్చు. కృష్ణా నుండి ఇక్కడికి ప్రైవేటు ఆటోలు ఉంటాయి. ఇక వ్యక్తిగత వాహనాల్లో వచ్చే భక్తులు మహబుబ్‌నగర్ నుండి నేరుగా రాయచూర్ మార్గంలో 74 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే నల్లగట్టు మారెమ్మ ఆలయం ఉంటుంది. అక్కడి నుండి 9 కిలోమీటర్లు ప్రయాణిస్తే కృష్ణాగ్రామం. కృష్ణా నుండి 5 కిలోమీటర్లు వెళితే ఈ తంగిడి నివృత్తి సంగమ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేవారు బెంగుళూర్‌కు వెళ్లే ట్రెయిన్లో వచ్చినట్లయితే నేరుగా కృష్ణా రైల్వేస్టేషన్లో దిగితే అక్కడి నుండి ఆటోల ద్వారా సంగమ క్షేత్రానికి చేరుకోవచ్చు. – జంగం గురుప్రసాద్, సాక్షి, మాగునూరు -
కల చెదిరి.. గుండెపగిలి...
మహబూబ్‌నగర్: పొలంలో పంటను చూసి ఆ రైతు తెగ మురిసిపోయాడు. ఇక అప్పుల ఊబి నుంచి బయటపడినట్లేనని తెగ సంబరపడిపోయాడు. ఇంతలోనే అకాల వర్షం ఆ రైతు జీవితాన్ని అతలాకుతలం చేసింది. కల చెదిరి.. గుండె పగిలింది. ఈ హృదయ విదారక సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మాగనూరు మండలం తంగిడి గ్రామపంచాయతీ కుసుమర్తి గ్రామానికి చెందిన పోలీస్ చిన్నమల్లికార్జున్(50)కు సమీపంలోని కృష్ణానది తీరంలో ఆరెకరాల పొలం ఉంది. దీనికితోడు మరో నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరిపంట సాగుచేశాడు. ఇందుకోసం లక్ష రూపాయలు అప్పు చేశాడు. ప్రతిరోజు పంటను చూసి సంబరపడి పోయేవాడు. అయితే, ఇటీవల కురిసిన వడగళ్లవానకు పంటంతా నేలవాలడంతో వడ్లగింజలు రాలిపోయాయి. ఉదయం పొలం వద్దకు వెళ్లి నేలకొరిగిన పంటను చూసి తీవ్రంగా కలత చెందాడు. ఇంటికొచ్చి ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. పరిస్థితులను తలుచుకుని చిన్నమల్లికార్జున్ గుండెపోటుతో మరణించాడు.