breaking news
Tamil Nadu assembly election 2016
-
5మంది కొత్త గవర్నర్లు
-
'తమిళనాడులో పోలింగ్ వాయిదా వేయండి'
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి పీఎంకే నేత అన్బుమణి రాందాస్ విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని, సోమవారం(మే 16) జరగనున్న ఎన్నికల పోలింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. 'తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు పంచారు. వీరి నామినేషన్లు రద్దు చేసి ఎన్నికల పోలింగ్ ను తాత్కాలికం గా వాయిదా వేయాల'ని లేఖలో రాందాస్ కోరారు. డబ్బులు పంచుతున్న డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులను పట్టిచ్చిన తమ అభ్యర్థిపై కేసు పెట్టారని ఆయన ఈసీకి తెలిపారు.