Syrian President
-
ఖతార్‌తో 200 బిలియన్ డాలర్ల డీల్
దోహా/రియాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబి యా పర్యటన ముగించుకొని బుధవారం ఖతార్ చేరుకున్నారు. ఖతార్‌లో ఆయన ఘన స్వాగతం లభించింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 160 విమానాలు కొనుగోలు చేసేందుకు ఖతార్ ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ డీల్ విలువ 200 బిలియన్ డాలర్లు అని తెలిపారు. ఖతార్ పాలకుడు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్–థానీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ పర్యటన కంటే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ఖతార్ నుంచి ఒక విమానాన్ని బహుమతిగా స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఖతార్ ఇచ్చే విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్‌గా వాడుకుంటానని వ్యాఖ్యానించారు. మరోవైపు తుర్కియేలో పర్యటించాలన్న ఆకాంక్షను ట్రంప్ వ్యక్తంచేశారు. ఉక్రెయిన్, రష్యా అధినేతలు జెలెన్స్కీ, పుతిన్ తుర్కియేలో ముఖాముఖి భేటీ కాబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ పట్ల ట్రంప్ ఆసక్తి కనబరుస్తున్నారు. తాను తుర్కియేకు వెళ్తే పుతిన్ ఎంతగానో సంతోషిస్తారని ట్రంప్ చెప్పారు.ఒకప్పుడు ఉగ్రవాదుల జాబితాలో ఉన్న సిరియా అధ్యక్షుడితో ట్రంప్ సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సౌదీ అరేబియాలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్– షారాతో సమావేశమయ్యారు. రెండు దేశాల అధినేతలు కలుసుకోవడం గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి. 50 ఏళ్లుగా అస్సద్ కుటుంబ పాలనలో అంతర్యుద్ధంతో నలిగిపోయి న సిరియాకు ఇటీవలే విముక్తి లభించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌తో అల్–షారా కీలక అంశాలపై చర్చించినట్లు తెలు స్తోంది. ఇజ్రాయెల్ దేశాన్ని అధికారికంగా గుర్తించాలని, సిరియా నుంచి విదేశీ ఉగ్రవాదులను బయటకు వెళ్లగొట్టాలని అల్–షారాను ట్రంప్ కోరినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. అల్– షారాతో భేటీ అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సిరియా అధ్యక్షు డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఆకర్ష ణీయంగా కనిపిస్తున్న అందమైన యువకుడు అంటూ కొనియాడారు. బలమైన వ్యక్తి, ఫైటర్ అంటూ శ్లాఘించారు. సిరియాపై ఆంక్షలు రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సిరియా ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తమ కు మంచి రోజులు వచ్చా యని ఆనందం వ్యక్తంచేశారు. అస్సద్ ప్రభుత్వ హయాంలో తిరుగుబాటు నాయకుడిగా గుర్తింపు పొందిన అల్–షారాను అమెరికా ప్రభుత్వం 2013లో అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఆయనపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. అదే అల్–షారా అధ్యక్షుడు కావడం, డొనల్డ్ ట్రంప్ ఆయనతో భేటీ కావడం విశేషం. -
కంటి వైద్యుడి నుంచి కర్కశ నియంత దాకా..
బీరూట్: రెండు పుష్కరాల క్రితం అన్యమనస్కంగా అధ్యక్ష పీఠంపై కూర్చున్న అసద్ తదనంతరకాలంలో నిరంకుశ నేతగా ఎదిగిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డమాస్కస్ మెడికల్ కాలేజీలో చదివిన అసద్ తర్వాత ఆప్తమాలజీ చదివేందుకు బ్రిటన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అసద్ తొలినాళ్లలో లండన్‌లో నేత్ర వైద్యునిగా సేవలందించేవారు. 1971 సంవత్సరం నుంచి సిరియాను తన ఉక్కుపిడికిలి కింద పాలిస్తున్న తన తండ్రి హఫీజ్ మరణంతో 2000 సంవత్సరంలో అసద్ స్వదేశం తిరిగొచ్చాడు. సానుభూతిపరుల మద్దతుతో అయిష్టంగానే అధ్యక్ష పీఠంపై కూర్చున్నారు. అప్పటికి ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు. అధ్యక్ష పదవికి కనీస అర్హత వయసు అయిన 40 ఏళ్లుకూడా నిండకపోవడంతో ఈయన కోసం పార్లమెంట్లో చట్టసవరణ చేశారు. నిజానికి హఫీజ్ తన పెద్ద కుమారుడు బస్సెల్ను తన వారసునిగా చూడాలనుకున్నారు. అయితే 1994లో కారు ప్రమాదంలో బస్సెల్ మరణించడంతో అసద్ అసలైన వారసుడయ్యారు. 2011దాకా అసద్ పాలనపై పెద్దగా విమర్శలు రాలేదు. కానీ అరబ్ విప్లవం మొదలయ్యాక 2011 మార్చిలో అసద్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు డమాస్కస్, డేరా నగరాల్లో వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేశారు. వీటిని అసద్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసింది. ఆనాటి నుంచి అసద్ నిరంకుశ పాలనకు తెరలేపారు. మానవహక్కుల ఉల్లంఘన, అక్రమ అరెస్ట్‌లు, జనంపైకి రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగతొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిడ్నాప్‌లు, హత్యలు వంటి అరాచకాలు ఆనాటి నుంచి నిత్యకృత్యమయ్యాయి. ఆ తర్వాతి ఏడాది అలెప్పో సిటీలో ఘర్షణలు పెరిగాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమించుకోగా నాలుగేళ్లు కష్టపడి సైన్యం తిరిగి స్వాధీనంచేసుకుంది. ఆ తర్వాత తూర్పు ఘాతాలో ప్రభుత్వం జరిపిన రసాయన ఆయుధ దాడిలో ఏకంగా వందలాది మంది అమాయక పౌరులు చనిపోయారు. దీంతో ఐసిస్ ఉగ్రసంస్థ విజృంభించి రఖాను స్వాధీనం చేసుకుంది. 2019దాకా ఐసిస్ పట్టుకొనసాగింది. అయితే 2015 సెప్టెంబర్‌లో రష్యా రాకతో అసద్ బలం పుంజుకున్నారు. అయితే 2017 ఏప్రిల్‌లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా రంగ ప్రవేశం చేశాయి. 14 ఏళ్ల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ గత నెల 27న ఇడ్లిబ్ సిటీ ఆక్రమణతో మొదలైన తిరుగుబాటుదారుల జైత్రయాత్ర రాజధాని డమాస్కస్దాకా కొనసాగడంతో 59 ఏళ్ల అసద్ పలాయనం చిత్తగించక తప్పలేదు. అసద్ పాలనలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా 11 లక్షల మంది సిరియాను వదిలి విదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లారు. అసద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
అసద్కే మా మద్దతు
టెహ్రాన్: పారిస్ ఉగ్రదాడి అనంతరం అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద రాజ్యాలనే తేడా లేకుండా ప్రపంచమంతా ఒక్కటై ఐఎస్ఐఎస్తో పోరాడాలని నిర్ణయించుకున్నాయి. అవసరమైతే ఉగ్ర సంబంధాలు గల దేశాలతో అనుబంధాలు తెంచుకుంటామని ప్రతినబూనాయి. అయితే సోమవారం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమీనెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య జరిగిన సమావేశం గత తీర్మానాలను ప్రశ్నార్థకంగా మార్చింది. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో శాంతి స్థాపన జరిగేలా ఎన్నికలు నిర్వహించాలన్న అంతర్జాతీయ సంస్థల నిర్ణయాన్ని ఆయతుల్లా కొట్టిపారేశారు. సదరు వ్యవహారమంతటినీ ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. శాంతి ముసుగులో అమెరికా తన సైన్యాన్ని సిరియాలోకి దించాలని ప్రయత్నిస్తున్నదని, తద్వారా ఇక్కడి భూభాగానికి పరోక్ష పాలకుడు కావాలనుకుంటున్నదని ఆరోపించారు. అమెరికా కుట్రలపై అన్నిదేశాలు అప్రమత్తంగా ఉండాలన్న ఇరాన్ సుప్రీం.. ప్రధానంగా ఇరాన్, రష్యాలకు ఆ అవసరం మరింత ఉందని పేర్కొన్నారు. పుతిన్ తో జరిగిన సమావేశంలో ఆయతుల్లా ఇలా మాట్లాడారని, రష్యా అధ్యక్షుడు కూడా ఇరాన్ సుప్రీం అభిప్రాయంతో ఏకీభవించారని స్థానిక మీడియా వార్తా కథనాలను ప్రసారం చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇరాన్ లో పర్యటిస్తున్న పుతిన్.. ఆయతుల్లా రెండు గంటలు ఏకాంత చర్చలు జరిపారు. ప్రస్తుత సిరియా అధ్యక్షుడు బషీర్ అల్ అసద్‌కు తమ మద్దతు కొనసాగించాలని నిర్ణయించిన ఇరాన్, రష్యాలు.. మధ్యప్రాశ్చంలో పాశ్చాత్యుల పెత్తనాన్ని అంగీకరించేదిలేదని తేల్చిచెప్పాయి. దీంతో సిరియాలో ఎన్నికల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. గత జులైలో రష్యా- ఇరాన్ ల మధ్య కుదిరిన అణుఒప్పందాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అంతేకాక మిస్సైళ్లను ధ్వంసం చేయగల అత్యాధునిక ఎస్- 300 రాకెట్లను ఇరాన్ కు సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు రాకెట్ల ఎగుమతి ప్రక్రియను ప్రారంభించినట్లు మాస్కోలోని అధికారవర్గాలు పేర్కొన్నాయి. సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక దళాలకు మద్దతు తెలుపుతున్న అమెరికా.. ఆ మేరకు భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అలా అమెరికా నుంచి దిగుమతైన ఆయుధ సంపత్తిలో చాలావరకు ఐఎస్ఐఎస్ చేతిలోకీ వెళుతుండటం గమనార్హం. సున్నీ తెగకు చెందిన అసద్‌ను ఎలాగైనా సరే గద్దె దించాలని షియా వర్గీయులు తిరుగుబావుటా ఎగరేయటం, ఐఎస్ఐఎస్ కూడా షియాల నాయకత్వంలో నడుస్తుండటంతో ఈ రెండు పక్షాల మధ్య లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా, ఏకైక అధికారిక సున్నీ దేశంగా కొనసాగుతున్న ఇరాన్.. తన వర్గానికే చెందిన అసద్‌కు మద్దతుగా సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇటీవలే రష్యా కూడా అసద్‌కు మద్దతుపలికి తిరుగుబాటు దళాలపై వైమానిక దాడులు జరుపుతోంది.