breaking news
surrounded
-
మరోసారి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు యత్నం
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయొద్దని కోర్టులు ఆదేశించినా.. ప్రభుత్వం మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ బుధవారం తనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిని పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారని ఏ క్షణంలోనైన అరెస్టు చేసే అవకాశం ఉందని ట్వీట్టర్లో పేర్కొన్నారు. బహుశా ఇదే నా చివరి ట్వీట్ కాబోలు ఆ తదనంతరం తాను అరెస్టు అవుతానేమో అని సందేహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధానిని గతవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టుతో పాక్ ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయింది. ఆ తదనంతరం నాటకీయ పరిణామాల మధ్యలో సుప్రీం కోర్టు జోక్యంతో బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా అదే కోర్టు బయట అల్‌ఖాదీర్ ట్రస్ట్ కేసు విషయమై ఇమ్రాన్ ఖాన్‌ను మిలటరీ బలగాలు అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి మరో ఉత్కంఠకు తెరలేపింది. మళ్లీ తదనంతరం జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు ఆ కేసులో రెండు వారాల బెయిల్ మంజూరు చేస్తూ ఊరటనిచ్చింది. ఈ వరుస అరెస్టు మరువక మునుపై మరోసారి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం కావడం గమనార్హం. (చదవండి: పాక్‌లో అరెస్టు భయం..పరుగులు తీస్తున్న మాజీ మంత్రి) -
ఈ 'రష్యన్ రాంబో' మంచి ప్రేమికుడు కూడా
మాస్కో సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనేది ఆ యువకుడు చిన్నప్పటినుంచీ కలలు గన్నాడు. కానీ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉగ్రవాదులతో పోరాడి దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంటానని అనుకోలేదు. తన వివాహం సమయంలో ప్రేమను అందంగా, హృద్యంగా ప్రకటించిన ఆ ప్రేమికుడు అంతే దైర్య, సాహసాలను ప్రదర్శించి అసలు సిసలు సైనిక అధికారిగా నిలిచిపోయాడు. హీరో ఆఫ్ ది రష్యన్ గా కీర్తిని సాధించాడు. ఐస్ ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో దృఢమైన నిర్ణయం తీసుకుని ప్రాణాలు కోల్పోయిన అతనే రష్యా కు చెందిన సైనిక అధికారి అలెగ్జాండర్ ప్రొకోరెన్కోవ్(25) . దేశంలోని పత్రికలు అలెగ్జాండెర్ ను రష్యా రాంబోగా కీర్తిస్తున్నాయి. అలెగ్జాండర్ రష్యన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్‌లో ప్రత్యేక అధికారిగా పనిచేసేవాడు. ఇతనికి రెండు నెలల క్రితమే సిరియాలోని ప్రాచీన నగరం పాల్మెయర్ వద్ద దాడి చేయాల్సిన లక్ష్యాలను గుర్తించి రష్యా యుద్ధ విమానాలకు మార్గదర్శకత్వం వహించే బాధ్యతలు అప్పగించారు. అలెగ్జాండర్ విధి నిర్వహణలో ఉండగా ఐఎస్ ఉగ్రవాదులు అతన్ని చుట్టుముట్టారు. తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, ఉగ్రవాదులను తుద ముట్టించాలనే లక్ష్యంతో అతను పనిచేశాడు. ఉగ్రవాదులపై పోరులో భాగంగా వారితో పోరుకు సై అన్నాడు. వారికి లొంగిపోయేందుకు నిరాకరించి ఎదురొడ్డి నిలబడ్డాడు. తాను ఉన్న ప్రదేశంపై బాంబుల వర్షం కురిపించాలని రష్యా వాయుసేనకు , అధికారులకు సమాచారం అందించాడు. ఈ నేపథ్యంలోనే పోరులో ప్రాణాలొదిలాడు. యుద్ధ విమానాలు ఐస్ ఉగ్రవాదులను అనతరం తుదముట్టించాయి. ఈ విషయాన్ని రష్యా సైనిక వర్గాలు కూడా ధ్రువీకరించాయి. రష్యా స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్‌కు చెందిన ఓ అధికారి వైమానిక దాడులను సమన్వయ పరుస్తుండగా ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంది. మరోవైపు ఐసిస్ ఐదుగురు రష్యన్ ప్రత్యేక దళ అధికారులను పాల్మీర సమీపంలో హత్య చేసినట్లు డెడ్ బాడీ చిత్రాలను వీడియోలను, గత వారం రిలీజ్ చేసింది. అతని మృతదేహం ఇంకా రష్యా చేరనప్పటికీ అన్ని అధికార సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ స్వయంగా అతని కటుంబీకులను కలిసి సంతాపం తెలియజేయనున్నట్టు సమాచారం. కాగా18 నెలల క్రితం అలెగ్జాండర్‌కు ఎకతేరీనతో వివాహమైంది. అతని భార్య ప్రస్తుతం గర్భవతి. ఎకతెరీనతో పెళ్లి సందర్భంగా ప్రపంచంలో తాను అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా భావిస్తూ అలెగ్జాండర్ ఓ వీడియో తీసాడు. తనకు ప్రపంచంలో అత్యుత్తమమైన భార్య దొరికిందంటూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. సైనికుడిగా దేశానికి సేవ చేయాలనే తన కల కూడా సాకారమైందని సంబరపడ్డాడు. ఇంతలోనే ఉగ్రదాడిలో అసువులు బాశాడు. దీంతో అతని గ్రామం విషాదంతో మూగబోయింది. అతను చాలా ప్రతిభావంతుడని అలెగ్జాండెర్ కు చదువు చెప్పిన ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే తన భర్త సైనిక అధికారి అని తెలుసుకానీ, సిరియాలో యుద్ధభూమిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలియదని భార్య ఎకతెరీనా చెప్పింది.