breaking news
superentendent on duty
-
మూడు లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రూ.3 లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాధితుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీకి చిక్కారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. దీంతో, సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన నివాసంలో వెంకన్న నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. రెడ్‌హ్యాండెడ్‌గా అధికారిని పట్టుకున్నారు. అయితే, ప్రభుత్వ ఆసుపత్రికి రెండేళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు వెంకన్న తెలిపారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్ 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని, ఇటీవల అధికశాతం కావాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నెలరోజుల క్రితం రూ.లక్ష లంచంగా ఇవ్వగా.. నాలుగు రోజుల క్రితం మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు. -
బాధ్యతలు చేపట్టిన ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్
బుక్కరాయసముద్రం : ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్‌గా ఈశ్వరయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న గోవిందరాజులు విజయవాడ హెడ్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. నెల్లూరులో ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రిఫర్మేషన్ సర్వీసెస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఈశ్వరయ్య ఇక్కడికి బదిలీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ ఎయిర్ జైలు అభివృద్ధికి, ఖైదీల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. గతంలో ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా, జైలు ఇన్చార్జ్ అధికారిగా పని చేసినట్లు ఆయన తెలిపారు.