breaking news
subway train
-
దారుణం: మహిళను బలవంతంగా రైల్వే ట్రాక్‌పైకి తోసేశాడు..!
న్యూయర్క్‌లో ఒక రైల్వేస్టేషన్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన తాలుకా వీడియోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్(ఎన్‌వైపీడీ) సోషల్ మీడియాలో విడుదల చేస్తూ... అతని ఆచూకి తెలిపిన వారికి సుమారు రూ. 2 లక్షల పైనే పారితోషకం ఇస్తామని ఒక బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది అసలేం జరిగిందటే న్యూయార్క్‌లోని ఒక సబ్వే స్టేషన్లో ఒక వ్యక్తి 52 ఏళ్ల మహిళను అనుసరిస్తూ... ఒక్కసారిగా తన రెండుచేతులతో సబ్వే ట్రాక్‌ల పైకి విసిరేశాడు. దీంతో ఆమె స్టేషన్ పేవ్‌మెంట్‌కి గుద్దుకుని సబ్వే ట్రాక్‌లపై పడిపోయింది. అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు వెంటనే స్పందించి బాధిత మహిళకు సాయం అందించారు. ఐతే ఆ సమయంలో రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాపం ఆ మహిల మాత్రం తీవ్ర గాయలపాలైంది. దీంతో నిందుతుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆ నిందుతుడు మాత్రం పరారీలోనే ఉన్నాడు. దీంతో న్యూయర్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి బేస్‌బాల్ క్యాప్ తోపాటు తెల్ల చొక్కా ధరించిన ఉన్నాడని అతని ఆచూకి తెలియజేయమంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఆఘటన తాలుకా వీడియోని పోస్ట్ చేయడమే కాకుండా సమాచారం అందిచాలనుకుంటే ఈ నెంబర్‌కి డయల్ చేయండి అంటూ ఒక ట్రోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది. 🚨WANTED-ASSAULT: 6/5/22 approx. 4:40 PM, Westchester & Jackson Ave train station @NYPD40PCT Bronx. The suspect pushed a 52-year-old female victim on the tracks. Any info call us at 800-577-TIPS or anonymously post a tip on our website https://t.co/TRPPY5zHV2 Reward up to $3,500 pic.twitter.com/M8kflD010M — NYPD Crime Stoppers (@NYPDTips) June 7, 2022 (చదవండి: రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!) -
రహస్య భూగర్భ రైలు మార్గం: ఎక్కడ ఉందో, దాని చరిత్ర ఏంటో తెలుసా?
పూర్వం రాజులు శత్రు రాజులు తమ పై దండయాత్ర చేసినప్పుడు తప్పించుకోవడానికి లేదా ఒక వేళ యుద్ధంలో తాను ఓడిపోతే తన పరివారాన్ని రక్షించుకోవటం కోసం కోటలో ప్రత్యేకంగా భూగర్భ మార్గం(సోరంగం) కచ్చితంగా ఏర్పాటై ఉండేవి. వాటి సాయంతో తప్పించుకోవటం వంటివి చేసేవారు. లేదా రాజు రహస్యంగా దేశ సంచారం చేయాలనుకున్న ఆ రహస్య మార్గం గుండా వచ్చేవారు. ఎవ్వరికి తెలియనచ్చేవారు కాదు. అచ్చం అదేవిధంగా వాషింగ్టన్లో రహస్య భూగర్భ మార్గం ఉంది. కాకపోతే అది సొరంగాలా కాకుండా భూగర్భ రైలు మార్గం(సబ్వే). అసలు అది ఎక్కడ ఉంది దాని చరిత్ర ఏంటో తెలుకుందాం రండి వాషింగ్టన్: వాషింగ్టన్లో ఉన్న ఈ రహస్య భూగర్భ రైలు(సబ్వే) మార్గం గుండా ప్రముఖులు, సుప్రీం కోర్టు జడ్జీలు, ప్రముఖ బాలీవుడ్ ప్రయాణించేవారట. పైగా విశేషమేమిటంటే చాలామంది అమెరికన్లకు కూడా ఈ సబ్వే ఒకటి ఉందని తెలుసుంటున్నారు చరిత్రకారులు. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూగర్భ రైలు యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ప్రతినిధుల సమావేశమయ్యే వాషింగ్టన్ శ్వేత సౌధంలా ఉంటుందంటున్నారు. మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన లైట్ల వెలుగులో అత్యంత క్లిష్టతరమైన గందరగోళ మార్గం, పైగా ఈ మార్గంలోకి వెళ్లంగానే బయట ఏం జరుగుతోందో కూడా మనకు తెలయదని సెనేట్ హిస్టారికల్ ఆఫీస్‌లోని సహాయక చరిత్రకారుడు హిస్టారియన్ డాన్ హోల్ట్ చెబుతున్నారు. ఒక శతాబ్దానికి పైగా రాజకీయ నాయకులు ఈ సబ్వేని ఉపయోగించారని చెబుతున్నారు. సెనెటర్లు, ప్రముఖులు ఎక్కువగా తమ కుటుంబాలతో వచ్చి గడిపేవారని, పైగా ప్రముఖుల పిల్లలు ఈ రైలులో ప్రయాణించడానికీ ఎకువగా ఇష్టపడేవారని అన్నారు. చరిత్రకారుడు హోల్ట్ ఈ రైలు ఏదో ప్రత్యేకత ఉందంటున్నారు. ఈ భూగర్భ మార్గం మూడే వేల అడుగుల లోతులో ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు సెనెటర్లు విలేకర్లు సమావేశం, రాజకీయ చర్చలు, పుకార్లతో విసిగిన అధికారులకు ఈ మార్గం గుండా ప్రయాణమనేది వారికీ అత్యంత నిశబ్దంతో కూడిన ప్రశాంతమైన జర్నీలా ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: చిప్సెట్ల కొరత.. చైనాకు చెక్ పెట్టేలా ఇండియా ప్లాన్ !) అలుముకున్న కొన్ని వివాదాలు .. ఇక్కడ ఒక మాజీ పోలీస్ అధికారి విలియమ్ కైసర్ అప్పటి అధ్యక్షుడి జాన్ బ్రిక్కర్ పై కాల్పులు జరిపాడని చెప్పారు. అంతే కాక అమెరికా 27వ అధ్యక్షుడు హోవార్డ్ టాఫ్ట్ ఇక్కడే అదృశ్యమైనట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిందన్నారు. దీంతో ప్రస్తుతం సెనెటర్లకు ఈ మార్గం అంటేనే భయంగలిగించే విధంగా అయ్యిందని ప్రస్తుతం ఈ మార్గాన్ని వినయోగించటం లేదని పేర్కొన్నారు. ఎప్పుడు ప్రారంభించారంటే...... ఈ భూగర్భ రైలు మార్గం మార్చి 7, 1990లో ప్రారంభమైంది. వాషింగ్టన్‌లోని తమ కార్యాలయాలకు వెళ్లడానికీ ఈ మార్గాన్ని వినియోగించేవారు. ఈ తర్వాత కాలంలో 1960లో 75 వేల డాలర్లలతో ఎలక్ట్రిక్ మోనో రైలులో రూపోందించారు. ప్రతినిధుల సమావేశాలు కూడా జరుపుకునే ఆఫీస్ కార్యాలయంలా అత్యధునిక టెక్నాలజీతో ఆ రైలుని రూపొందించారు. తదనంతరం 1993లో 18 వేల డాలర్లతో డిస్నీ ల్యాండ్ తరహా డ్రైవర్ లెస్ రైలును సరికొత్త హంగులతో ఆవిష్కిరించారు. కానీ కాలక్రమంలో అత్యధునిక టెక్నాలజీతో రూపాంతరం చెందుతున్న ఈ భూగర్భ రైలు(సబ్వే)ను చాలా మంది సెనెటర్లు అంతగా ఇష్టపడలేదనేది చారిత్రకారుల అభిప్రాయం. ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటు ఫిర్యాదులు వచ్చాయని చరిత్రకారులు అంటున్నారు. హమిల్లన్ అనే మ్యూజికల్ అల్బమ్ సృష్టి కర్త లిన్-మాన్యువల్ మిరాండా 2017లో అవార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఈ మార్గం గుండా రైడ్ చేయాలనుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు. దీంతో ఈ భూగర్భ రైలు మార్గం వార్తల్లో నిలివడమే కాక ప్రజల్లో చర్చలకు తెరలేపింది. ఏది ఏమైనప్పటికీ ఈ భూగర్భ రైలు మార్గం(సబ్వే) ప్రముఖులను ఉద్దేశించి ఆవిష్కరించినదే అయినా కొన్ని వివాదాల కారణంగా శతాబ్దాలకు పైగా రాజకీయ నాయకులు ఉపయోగించిన అత్యాధునిక టెక్నాలజీతో కూడిన చారిత్రక రహస్య భూగర్భ రైలుగా మిగిలిపోయిందని సహాయక చరిత్రకారుడు హోల్ట్ అభివర్ణించారు. (చదవండి: భయంకరమైన బావి.. నరక కూప మర్మం చేధించిన సాహసికులు) -
సునందో హత్య కేసులో మహిళకు 25 ఏళ్ల జైలు శిక్ష!
న్యూయార్క్: యూఎస్‌లో భారతీయుడి సునందో సేన్ హత్య కేసులో ఆ దేశ మహిళ ఎరికా మెనెండెజ్కు క్వీన్స్ కోర్టు శిక్షను ఖరారు చేయనుందని సమాచారం. ఈ కేసులో నిందితురాలికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. ఈ కేసులో తుది తీర్పుని ఏప్రిల్ 29న వెలువరించనుంది. 2012, డిసెంబర్ 27న న్యూయార్క్ సబ్ వేలో సునందో సేన్ రైలు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎరికా మెనెండెజ్ వెనక నుంచి వచ్చి సబ్ వేలో ప్రవేశిస్తున్న రైలు కిందకు తొసివేసింది. ఈ ఘటనలో సునందో సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో ఎరికా మెనెండెజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమనీ అందుకే అతన్ని చంపేశాననీ ఎరికా మెనెండెజ్ పోలీసులకు వెల్లడించింది. సెప్టెంబర్ 11, 2001 టెర్రరిస్టు దాడులు అనంతరం తాను హిందూ, ముస్లింలపైనా ద్వేషం పెంచుకున్నానని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. నిందితురాలు ఎరికా మెనెండెజ్ క్వీన్స్ లో నివశిస్తుండగా 46 సంవత్సరాల సునందో సేన్ కూడా క్వీన్స్ లోనే ఒక చిన్న అపార్ట్ మెంట్లో నివసిస్తున్నాడు. కొద్ది కాలం కిందట అమెరికాకు వలస వచ్చిన సునందో కొలంబియా యూనివర్సిటీ వద్ద సొంతగా ఒక ప్రింటింగ్ అండ్ కాపియింగ్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతడు అవివాహితుడు. సునందో హత్య జరిగే నాటికే భారత్‌లో నివసిస్తున్న అతడి తల్లిదండ్రులు చనిపోయారు.