breaking news
Student Welfare
-
ఫస్ట్ టైమ్: ఇక పాలన పాఠాలు
ప్రొఫెసర్ నీలోఫర్‌ఖాన్ ‘యూనివర్శిటీ ఆఫ్ కశ్మీర్’కు వైస్–చాన్స్‌లర్‌గా నియామకం అయ్యారు. ఫలితంగా ఆ యూనివర్శిటీ తొలి మహిళ వైస్–చాన్స్‌లర్‌గా చారిత్రక గుర్తింపు పొందారు. పాఠాలు చెప్పడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఖాన్‌కు విద్యార్థులలో మంచి గుర్తింపు ఉంది. ఆమె పాఠాలు వినడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహం చూపుతారు. ‘ఎంత సంక్లిష్టమైన విషయాన్ని అయినా, సులభంగా అర్థమయ్యేలా చెబుతారు’ అంటారు విద్యార్థులు. పాఠాలలోనే కాదు పాలన సంబంధిత విషయాలలోనూ ఆమెకు అపారమైన అనుభవం ఉంది. యూనివర్శిటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే యూనివర్శిటీ కౌన్సిల్, యూనివర్శిటీ సిండికేట్, అకాడమిక్ కౌన్సిల్... మొదలైన విభాగాలలో పనిచేశారు. ఆస్ట్రేలియా, మలేషియాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లి అక్కడి యూనివర్శిటీల పనితీరును అధ్యయనం చేశారు. ఆమె రచనలు దేశ, విదేశ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 20 పీహెచ్డీ స్కాలర్స్‌కు పర్యవేక్షకురాలిగా వ్యవహరించారు. ‘ఇంటర్నల్ కంప్లైంట్స్’ కమిటీకి చైర్‌పర్సన్‌గా పనిచేసిన ఖాన్‌కు యూనివర్శిటీ సమస్యల గురించి లోతైన అవగాహన ఉంది. విద్యార్థుల సంక్షేమం, యూనివర్శిటీని మరో స్థాయికి తీసుకువెళ్లడం తన ప్రాధాన్యత అంశాలుగా చెబుతున్నారు నీలోఫర్‌ఖాన్. -
18 గ్రహాలు
* ‘సంక్షేమాన్ని’ పట్టి పీడిస్తున్న వార్డెన్లు * వారు చెప్పిందే వేదం...లేదంటే టార్గెట్ * ఎంతటి వారైనా సరే వదిలిపెట్టరు * అధికారులు సైతం వారి చెప్పుచేతలలోనే * మెనూ తయారీలోనూ వీరిదే ‘కీ’ రోల్ * ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ వార్డెన్ ఇందూరు: వసతి గృహాల నిర్వాహకులు కొందరు విద్యార్థుల సంక్షేమాన్ని అటకెక్కించి, తమ జేబులు నింపుకుంటున్నారు. తమ శాఖకు వచ్చిన ఉన్నతాధికారి ఎవరైనా, ఎంతటి వారైనా సరే వెంటనే ముగ్గులోకి దింపడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వారి అండదండలతో అధికారాన్ని చేతుల లోకి తీసుకుని ఏకంగా ఆ శాఖనే శాసిస్తున్నారు 18 మంది వార్డెన్లు. వారు చెప్పినట్లు వినకపోతే, అధికారులని కూడా చూడకుండా టార్గెట్ చేస్తారని, పలుకుబడిని ఉపయోగించి బదిలీ చేయిస్తారనే విమర్శలున్నాయి విద్యా ర్థు లకందించే మెనూలోనూ వారు చేతివాటం చూపుతున్నారు. వార్డెన్ల సంఘం కూడా వారి కనుసన్నలలోనే నడుస్తుంది. వారు అంగీకరించినవారే నాయకులుగా ఎన్ని కవుతారు. గెలిపించిన నాయకుడు మాట వినకపోతే పదవి నుంచి దింపేస్తారు. ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులలో అదనపు బాధ్యతలు ఎవరికి ఇవ్వలనేది కూడా వీరే నిర్ణ యి స్తారు. కాదని వేరేవారికి ఇస్తే ఆ అధికారితోపాటు అదనపు బాధ్యతలు తీసుకున్నవారిని వేధింపులకు గురి చేస్తారు. బెదిరింపులకు పాల్పడుతారు. ఇందుకు ఉదాహరణలెన్నో ఉన్నాయి. భయపెడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 141 సంక్షేమ వసతి గృహాలు కొనసాగుతున్నాయి. ఇందులో కొన్నింటికి వార్డెన్లు లేకపోవడంతో ఇతర వార్డెన్లకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. మోర్తాడ్ మండలం బీసీ బాలుర వసతిగృహం బాధ్యతలను చౌట్పల్లి వార్డెన్ కు ఇచ్చారు. ఇది నచ్చని వార్డెన్ల సంఘం నాయకుడొకరు సదరు వార్డెన్‌ను భయపెట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఆ బాధ్యతలను తను తీసుకున్నారు. 18 మందిలో ఈయన కూడా ఒకరు. మెనూ తయారీ వీరి చేతిలోనే సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు పెట్టే భోజన మెనూను ప్రభుత్వం తయారు చేస్తుంది. కానీ, జిల్లాలో అమలు చేసే మెనూను మాత్రం ఈ 18 మంది వార్డెన్లే నచ్చిన విధంగా, అనుకూలంగా తయారు చేస్తున్నారు. మెనూలో కోతలు విధించి జేబులు నింపుకోవడానికే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయిజ ధరలు పెరిగాయనే సాకుతో మూడు నెలల క్రితం మెనూలోంచి ఒక గుడ్డు, ఒక అరటి పండును తగ్గించారు. ప్రస్తుతం ధరలు తగ్గినా అదే మెనూను కొనసాగిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందకుండా చేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రశ్నిం చడానికి వీలు లేకుండా వారికి నెలనెలా మూమూళ్లు అందజేస్తున్నట్లు సమాచారం. ఏ అధికారికి ఎంతివ్వాలి, సెక్షన్ ఉద్యోగికి ఎంతెంత ఇవ్వాలనేది కూడా 18 మంది వార్డెన్లే నిర్ణయించినట్లుగా తెలిసింది. సంఘ ఎన్నికలు వీరి కనుసన్నలలోనే వార్డెన్ల సంఘం ఎన్నికలు జరగాలన్నా, అందులో పోటీ చేసి గెలువాలన్నా వీరి అండదండలు ఉండాల్సిందే. సదరు వార్డెన్లు చెప్పిన వారికే ఓటు వేయాలి. తమకు అనుకూలంగా ఉన్న వారిని నాయకుడిగా ఎన్నుకుని, అతని వెనుకుండి కథంతా నడిపిస్తారు. వినకపోతే పదవీ బాధ్యతల నుంచి తొలగించడానికి కుట్రలు పన్నుతారు. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ 18 మందిలో కొందరు సంఘ నాయకులుగా మారి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పలువురు అంటున్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వద్దు
విస్సన్నపేట, న్యూస్‌లైన్ : విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఎవరి విధులు వారు బాధ్యతగా నిర్వర్తించాలని నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధర్‌బాబు అధికారులకు సూచించారు. మండలంలోని నరసాపురం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన తీరుపై గురువారం ఆయన విచారణ చేపట్టారు. మార్చి 29 వతేదీ నుంచి 2వ తేదీ వరకు జరిగిన సంఘటనలకు సంబంధించి ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిని ఆయన విచారించారు. మీ పిల్లలైతే ఇలగే చూస్తారా అని సిబ్బందిని ప్రశ్నించారు. అనారోగ్యానికి గల కారణాలను వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని వంట గదిని, మరుగుదొడ్లను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలికలు చదువు మానుకోవద్దని హితవు పలికారు. ఏమైనా సమస్యలుంటే తనకు ఫోన్‌ద్వారా సమాచారం అందించాలన్నారు. విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని పాఠశాలలో విధుల్లో ఉన్న సిబ్బంది ముందుగా తిన్న అనంతరమే వడ్డించాలని ఆదేశించారు. కాగా పాఠశాలలో తమ పిల్లలు ఎదుర్కొం టున్న సమస్యల గురించి తల్లిదండ్రులు సబ్‌కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఇకపై అటువంటివి జరుగకుండా ఉండేందుకు ప్రతి నెలా క్రమంతప్పకుండా పేరేంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల అస్వస్థతకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జోనల్ అధికారి ఎం.పుల్లయ్య, తాహశీల్దార్ సాయిగోపాల్, వైద్యాధికారులు సీతారామ్, విజయలక్ష్మి పాల్గొన్నారు.