అద్వైత్కు టైటిల్
► స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్
హైదరాబాద్: సెయింట్ పాల్స్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో సబ్ జూనియర్ బాలుర విభాగంలో అద్వైత్ చాంపియన్‌గా నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్వైత్ 4-1తో వరుణ్ శంకర్‌పై గెలుపొందాడు.
యూత్ బాలుర విభాగంలో స్నేహిత్ 4-1తో సరోజ్ సిరిల్‌పై, బాలికల విభాగంలో వరుణి జైశ్వాల్ 4-3తో సస్యపై, జూనియర్ బాలుర విభాగంలో స్నేహిత్ 4-0తో అరవింద్‌పై, బాలికల విభాగంలో నైనా 4-3తో వరుణిపై, సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఆయుషి 4-1తో భవితపై, క్యాడెట్ బాలుర విభాగంలో జషన్ సాయి 3-1తో రిత్విక్‌పై, బాలికల విభాగంలో పలక్ 3-1తో ప్రీతిపై నెగ్గారు. ఇంటర్ స్కూల్ బాలుర విభాగంలో బీవీబీ 3-0తో సెయింట్ పాల్ స్కూల్‌పై, బాలికల విభాగంలో గీతాంజలి స్కూల్ 3-0తో గీతాంజలి దేవేశ్రయ్పై గెలుపొందాయి.