breaking news
State High Court judge
-
శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని గురువారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్ దర్శించుకున్నారు. న్యాయమూర్తికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అధికారులు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటంతో సత్కరించారు. -
శ్రీవారి సేవలో జస్టిస్ నరసింహారెడ్డి
తిరుమల: రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ జస్టిస్‌కు లడ్డూ ప్రసాదాలు, నూతన సంవత్సరం డైరీ, కేలండర్ బహూకరించారు.


