breaking news
Sripada Ramachandra Rao director
-
ఓ సవాల్‌గా తీసుకున్నా – తల్లాడ వెంకన్న
తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే నెం.1’. సునీత, శృతిక, మధువని హీరోయిన్లుగా నటించారు. శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో క్లాసిక్ సినీ క్రియేషన్ ్సపై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో తల్లాడ వెంకన్న మాట్లాడుతూ–‘‘వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన నేను, సినిమా రంగాన్ని కూడా ఓ సవాల్‌గా తీసుకున్నాను. మంచి కథ, కథనంతో ‘ఒక్కడే నెం.1’ తీశాం. సురేశ్ బాబు, ఏషియన్ ఫిలింస్ వారు తెలుగు రాష్ట్రాల్లో మా సినిమాను రిలీజ్ చేసేందుకు ఒప్పుకోవడంతో సినిమా విజయంపై మా నమ్మకం మరింత పెరిగింది. కర్ణాటకలో కూడా డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేను గతంలో భక్తిరస చిత్రాలు తీశాను. వెంకన్నగారి ప్రోత్సాహం వల్లే ‘ఒక్కడే నెం.1’ లాంటి మంచి కమర్షియల్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది’’ అన్నారు దర్శకుడు శ్రీపాద రామచంద్రరావు. నిర్మాతలు సి.కల్యాణ్, దామోదర ప్రసాద్, అంబికా కృష్ణ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, డైరెక్టర్ రేలంగి నరసింహారావు అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
నాగినీ ఎవరు?
నాగినీ అనే యువతి చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘నాగినీ’. కేఎస్. నివాస్, సందీప్తి, పద్మ ముఖ్యపాత్రల్లో కె.సంధ్యారాణి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీపాద రామచంద్రరావు దర్శకుడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘రచయిత్రి సంధ్యారాణి చక్కటి కథ అందించారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది’’ అని దర్శకుడు తెలిపారు.