breaking news
Sri Sharada peetam
-
విశాఖ శ్రీ శారదా పీఠం విశిష్టత గురించి స్వరూపానందేంద్ర సరస్వతిగారు
-
హైందవ ధర్మ సంరక్షణే ధ్యేయం
పెందుర్తి: వేద పరిరక్షణ, హైందవ ధర్మ రక్షణే ధ్యేయంగా శ్రీ శారదాపీఠం ముందుకు సాగుతోందని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. పీఠం ఇంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందంటే పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ధర్మ మార్గమే కారణమని తెలిపారు. ఆదిశంకరుడి అడుగుజాడలే తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీగా నాగుల చవితి పర్వదినం రోజున జరిగే ఈ వేడుకల్లో భాగంగా స్వామీజీ చేతుల మీదుగా పీఠ ఆస్థాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, సుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా స్వామీజీకి కూపి స్నపనం, వేద మంత్రోచ్ఛారణల నడుమ పాదపూజ చేశారు. శాస్త్రోక్తంగా పూర్ణాహుతి జరిపారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ భారతదేశపు మూలాల నుంచి అద్వైత సిద్ధాంతాన్ని వెలికి తీసింది ఆదిశంకరాచార్యులేనని.. ఆయన ఆలోచనలు తలచుకుంటూ పురుడుపోసుకున్నదే విశాఖ శ్రీ శారదా పీఠమన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామీజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, దేవదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, చెట్టి పాల్గుణ, కారుమూరి నాగేశ్వరరావు, వెంకట చిన్నఅప్పలనాయుడు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. -
శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
-
శ్రీవారి లడ్డూ అమ్మకాలపై అసత్య కథనాలు మానుకోవాలి
రాజమహేంద్రవరం కల్చరల్: వివిధ జిల్లాల్లో టీటీడీ కల్యాణ మండపాల ద్వారా జరుగుతున్న శ్రీవారి లడ్డూల అమ్మకాలపై సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య కథనాలను మానుకోవాలని విశాఖ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా, లోకకల్యాణార్థం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్ తన కార్యాలయ ప్రాంగణంలో ధన్వంతరీ సహిత మహాసుదర్శన యాగం, రాజశ్యామల సహిత రుద్రయాగం శుక్రవారం ప్రారంభించారు. ఈ యాగ పూర్ణాహుతిలో పాల్గొనడానికి ఆదివారం నగరానికి వచ్చిన స్వాత్మానందేంద్ర విలేకర్లతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► శ్రీవారి అనుగ్రహం, ఆశీస్సులు ఈ లడ్డూల రూపేణా లభిస్తున్నట్టు భావించాలి. ► టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయం. ► శార్వరి నామ సంవత్సరం కాలసర్ప దోషంతో ప్రారంభమైంది.. గ్రహకూటమి అనుకూలంగా లేదు. ► కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆధ్యాత్మిక శక్తితో ప్రతి ఒక్కరిలోనూ మానసిక స్థైర్యం తప్పకుండా చేకూరుతుంది. -
నాట్యం.. ప్రణామ నృత్యం..