breaking news
Spend pseudonymous
-
సర్వేకు.. పథకాలకు సంబంధం లేదు
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధం లేదని, ఎలాంటి సందేహాలు లేకుండా కుటుంబం పూర్తి వివరాలు ఎన్యూమరేటర్‌కు చెప్పాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న జిల్లా ప్రజలను కోరారు. పూర్తి వివరాలు తెలిస్తేనే ఎంత మంది ప్రజలు సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నారనే విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లో జిల్లా పరిషత్ కార్యలయ సమావేశ మందిరంలో ‘సమగ్ర కుటుంబ సర్వే’పై ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లబ్ధి పొందిన వివరాలు చెబితే తమకు వచ్చే సంక్షేమ పథకాలు రాకుండా పోతాయని, సంక్షేమ పథకాల కోసం మేం పెట్టుకున్నవన్నీ రద్దు అవుతాయని ప్రజలు అనుకోవద్దని తెలిపారు. మేం వివరాలు చెబితే మాకు రుణ మాఫీ కాదేమోనని, సంక్షేమ పథకాలు వర్తించవోనని అనుకోకూడదని అన్నారు. కుటుంబ సర్వేకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కుటుంబ వివరాలతో పాటు స్థిరాస్తులు, చరాస్తులు అన్ని వివరాలు సమగ్రంగా తెలిపితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. జనాభా ఎంత ఉంది, పథకాల లబ్ధి చేకూరుతుందా లేదా తదితర వివరాలు తెలుసుకునేందుకే సర్వే చేనపడుతున్నట్లు తెలిపారు. 19న అందరు ఇంట్లోనే ఉండి వివరాలు తెలుపాలని కోరారు. సర్వేపై ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు కరపత్రాలు ముద్రించుకొని వారి నియోజకవర్గాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, ఈ సదస్సుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభారాణి హాజరుకాకపోగా, ఇతర ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం గైర్హాజరయ్యారు. కలెక్టర్ జగన్మోహన్, సీపీవో షేక్మీరా, డీపీవో పోచయ్య, ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, దివాకర్‌రావు, జెడ్పీటీసీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల మొక్కలు పెంచుతాం
అటవీ సంపదలో గిరిజనులకు హక్కులు కల్పిస్తాం రాష్ర్ట అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆటోనగర్:పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపునకు తెలంగాణ వ్యాప్తంగా 1.20 కోట్ల మొక్కలను ఈ వర్షాకాలంలో నాటనున్నామని, దీనికి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అవసరమని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆటోనగర్‌లోని మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి జనులకు అవగాహన కల్పించి, వారికి అటవీ సంపదలో భాగస్వామ్య హక్కులను కల్పిస్తామన్నారు. sమూడేళ్ల ప్రణాళికలో భాగంగా అడవుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామని తెలి పారు. కార్యక్రమంలో భోద్ ఎమ్మెల్యే బాబూరావు రాథో డ్, పీసీసీఎఫ్ పీకే శర్మ, అడిషనల్ పీసీసీఎఫ్ శ్యాంప్రసాద్, డీఎఫ్ఓ అశోక్‌కుమార్, హరిణ వనస్థలి రేంజ్ ఆఫీసర్ మారెడ్డి, అటవీఅభివృద్ధి సంస్థ ఎండీ రాజేష్ విరాట్, సీజీఎం పృథ్వీరాజ్, ఎకోటూరిజమ్ డెరైక్టర్ శేర్వానంద్, జీఎం ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.