breaking news
special religion
-
కొత్త మతం!
తమను ఎస్సీ, ఎస్టీ లేదా బీసీలుగా గుర్తించాలని దేశవ్యాప్తంగా వివిధ కులాల నుంచి బలంగా డిమాండ్లు వినబడుతున్న తరుణంలో కర్ణాటక మంత్రివర్గం లింగాయత్ సామాజిక వర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ సోమవారం చేసిన తీర్మానం సహజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. దానిపై అనుకూల, వ్యతిరేక వాదనలు మొదలయ్యాయి. బసవణ్ణ సిద్ధాంతాలను అనుసరించే వీరశైవుల్ని కూడా మైనారిటీ మతంగా గుర్తించాలని కేబినెట్ తీర్మానించింది. కర్ణాటక కేబినెట్‌ది తుది నిర్ణయమేమీ కాదు. ఆ ప్రతిపాదన కేంద్ర హోంశాఖకు చేరుతుంది. ఆ ప్రతిపాదన జనాభా గణన వ్యవహారాలను చూసే రిజిస్ట్రార్ జనరల్‌కు వెళ్తుంది. తాజా నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది గనుక సహజంగానే ఆ తర్వాత అది మూలనబడుతుంది. ఇదంతా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తెలియక కాదు. కానీ బంతిని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి నెట్టి తాను చేయగలిగిందంతా చేసినట్టు చూపించాలి. బీజేపీకి పెట్టని కోటగా ఉంటున్న లింగాయత్‌లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందాలి. ఇదీ ఆయన వ్యూహం. అయిదేళ్ల క్రితం బీజేపీపై అలిగి సొంతంగా పార్టీ పెట్టుకున్న సమ యంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా వీరశైవ లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే అది అసాధ్యమని యూపీఏ ప్రభుత్వం ప్రత్యుత్తరమిచ్చింది. యడ్యూరప్ప తిరిగి బీజేపీలోకి ప్రవేశించాక దాని ఊసెత్తలేదు. తాజా నిర్ణయం ఆయన్ను రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టింది. ప్రస్తుతం ఆ వర్గానికి ఆయన తిరుగులేని నేత. నిజానికి లింగాయత్‌లను ప్రత్యేక మతవర్గంగా గుర్తించడంపై కాంగ్రెస్‌లోనే విభేదాలు న్నాయి. ఈ నెల 8న జరిగిన కేబినెట్ తొలిసారి దీన్ని చర్చించినప్పుడు లింగా యత్లకు ప్రాతినిధ్యంవహించే మంత్రులు, వీరశైవ వర్గానికి చెందిన మంత్రులు కత్తులు దూసుకున్నారు. ఈ రాజకీయపుటెత్తుల సంగతలా ఉంచితే తమను ప్రత్యేక మతవర్గంగా గుర్తించాలన్న లింగాయత్‌ల డిమాండు ఈనాటిది కాదు. స్వాతంత్య్రం రావడానికి ముందే 1942లో ఈ డిమాండు మొదలైంది. 1871 మైసూర్ జనాభా లెక్కల్లో లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించినట్టు దాఖలాలున్నాయి. అయితే ఆ తర్వాత 1881లో జరిగిన జనగణనలో వారిని హిందూ మతంలో ఒక కులంగా వర్గీకరించారు. ఈ మార్పునకు కారణమేమిటో అందులో నమోదు చేయలేదు. వాస్తవానికి చాన్నాళ్లనుంచి ఆ డిమాండును భుజాన వేసుకుని, దానికోసం కృషి చేసిన వ్యక్తులు ఇద్దరున్నారు. వారిలో ప్రముఖ సాహితీవేత్త, హంపీ విశ్వవిద్యా లయ మాజీ వైస్ చాన్సలర్ కల్బుర్గీ ఒకరు కాగా, మరొకరు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఎం జాందార్. కల్బుర్గీని గుర్తు తెలియని దుండగులు మూడేళ్లక్రితం కాల్చిచంపారు. లింగాయత్‌లది ప్రత్యేక మతమని, వారిని అలా గుర్తించడమే సరైందని కల్బుర్గీ గట్టిగా వాదించేవారు. అదే సమయంలో లింగాయత్ సిద్ధాం తాన్ని ప్రతిపాదించిన సంఘ సంస్కర్త బసవేశ్వరుడి బోధనలను లింగాయత్ మఠాలు సరిగా పట్టించుకోవడం లేదని విమర్శించేవారు. మాజీ ఐఏఎస్ అధికారి జాందార్ చేసిన కృషి కూడా తక్కువేమీ కాదు. లింగాయత్‌లు ప్రత్యేక మతవర్గమని రుజువు చేసేందుకు తగిన ఆధారాలను ఆయన ఎంతో శ్రమకోర్చి సేకరించారు. 2011లో జనగణన జరిగిన సందర్భంలో లింగాయత్లెవరూ హిందువులుగా నమోదు చేసుకోవద్దంటూ లింగాయత్ మఠాలనుంచి ప్రకటనలొచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుడు ఈ డిమాండు ఊపందుకుంది. బీదర్, బెళగావి, లాతూర్, కలబురగి తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. వీటన్నిటికీ హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది లింగాయత్‌లు హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్లో బెంగళూరులో జాతీయ సదస్సు జరిపారు. ఆ సదస్సు తర్వాతే లింగాయత్‌ల డిమాండు పరిశీలించడం కోసం రిటైర్డ్ జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీని ఏర్పాటు చేశారు. లింగాయత్ సిద్ధాంతానికి మూల కారకుడైన బసవేశ్వరుడు సంఘ సంస్కర్త. 12వ శతాబ్దిలో తన బోధనలతో ప్రస్తుతం కర్ణాటకగా ఉన్న ప్రాంతాన్ని మాత్రమే కాదు... దక్షిణాదినంతటినీ తీవ్రంగా ప్రభావితం చేశాడు. పల్నాడు, గురజాల రాజ్యాల్లో కీలకపాత్ర పోషించిన బ్రహ్మనాయుడు ‘చాపకూడు’ సిద్ధాంతం వెనక బసవేశ్వరుడి ప్రభావమే ఉంది. సమాజంపై కులమతాల పట్టు బలంగా ఉన్నప్పుడూ, ఆచారాలు సంప్రదాయాల పేరిట అసమానతలు రాజ్యమేలుతున్న ప్పుడు బసవేశ్వరుడు వాటికి వ్యతిరేకంగా పోరాడాడు. సమూహాలను కూడ గట్టాడు. కుల వ్యవస్థను, వైదిక ఆచారాలను వ్యతిరేకించాడు. విగ్రహారాధాన సరైందికాదన్నాడు. ఆయన సిద్ధాంతాల ప్రచారం కోసం ఎన్నో మఠాలు వెలిశాయి. అయితే వైదిక ఆచారాలను పాటించే వీరశైవులు, లింగాయత్‌లు ఒకటేనన్నది యడ్యూరప్ప వంటివారి వాదన. వీరశైవుల్ని, లింగాయత్‌లనూ ఒకటిగా పరిగణించి ఆ వర్గాన్ని మైనారిటీ మతంగా గుర్తించాలని వీరశైవ మహాసభ కోరుతోంది. కర్ణాటకలో లింగాయత్‌లు, వీరశైవుల ప్రభావం చాలా బలమైనది. 224మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రతి నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు లింగాయత్ లేదా వీరశైవ వర్గానికి చెందినవారు. రాష్ట్ర జనాభాలో 17 శాతంగా ఉండే లింగాయత్‌లు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో అధికం. ఆ వర్గం దాదాపు వంద నియోజకవర్గాల్లో పార్టీల గెలుపోటముల్ని నిర్ణయించే స్థితిలో ఉంది. బసవణ్ణ మఠాల ఆధ్వర్యంలో కర్ణాటకలో పలుచోట విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీరశైవ మహాసభ ఏం నిర్ణయిస్తే దానికి తాను కట్టుబడి ఉంటానని బీజేపీ నేత యడ్యూరప్ప చెబు తున్నారు. మొత్తానికి సిద్దరామయ్య కదిపిన తేనెతుట్టె కర్ణాటక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది బీజేపీని ఎంతవరకూ ఇరకాటంలోకి నెడుతుందో, కాంగ్రెస్‌కు ఏమేరకు లాభిస్తుందో చూడాల్సి ఉంది. -
లింగాయత్లంటే పార్టీల్లో గుబులు
బెంగళూరు: కర్ణాటకలోని బీదర్‌లో గతవారం లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు భారీ బహిరంగ సభను నిర్వహించడం ఇటు పాలకపక్ష కాంగ్రెస్‌లోనూ అటు ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీలోనూ గుండెల్లో గుబులు రేపింది. దాదాపు ఆరున్నర కోట్ల మంది జనాభా కలిగిన రాష్ట్రంలో లింగాయతీలు 12 నుంచి 19 శాతం వరకు ఉండడం, వచ్చే ఏడాది అంటే, 2018 మొదట్లోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరాగాల్సి ఉండడం అందుకు కారణం. రాజకీయ ప్రాబల్యశక్తిగా బలపడిన లింగాయత్‌లు రాష్ట్రంలోని 224 అసెంబ్లీ సీట్లలో 110 సీట్ల ఫలితాలను ప్రభావితం చేయగలరు. ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన లింగాయత్‌లు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి సంప్రదాయంగా ఓటువేస్తూ వస్తున్నారు. అందుకనే రాష్ట్రంలో వారి సామాజిక వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్ప సీఎం అయ్యారు. లింగాయత్‌లు తమకు వ్యతిరేకంగా ఐక్య వేదికపైకి వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పుట్టగతులు ఉండవని పాలకపక్ష కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. బీజేపీ ఎందుకు భయపడుతుందో తెలసుకోవాలంటే ముందు లింగాయత్‌లు అంత పెద్ద బíß రంగ సభను ఎందుకు పెట్టారో తెలుసుకుంటే సరిపోతుంది. తమను హిందువుల్లో భాగంగా చూడవద్దని, తమకో ప్రత్యేకమైన సంస్కతి, సంప్రదాయాలు ఉన్నందున తమను ఓ ప్రత్యేక మతంగా పరిగణించాలని లింగాయత్‌లు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసమే వారు భారీ బహిరంగ సభను నిర్వహించారు. వారిని ప్రత్యేక మతంగా పరిగణిస్తే మైనారిటీ మతం కింద ఇతర మైనారిటీలు, వెనకబడిన వర్గాలకు వర్తించే రిజర్వేషన్లన్నీ వారికి వర్తిస్తాయన్నది వారి విశ్వాసం కావచ్చు. కానీ వారు మాత్రం తమది ప్రత్యేక సంస్కతి, సంప్రదాయమనే ఎప్పుడు వాదిస్తారు. కొంత మంది చరిత్రకారులు చెబుతున్నట్లుగా వీరశైవులు, తాము ఒక్కటి కాదన్నది వారి వాదన. హిందూ దేవుళ్ల సమూహానికి మూల పురుషుడు శివుడు ఒక్కడేనన్నది వారి మూల సిద్ధాంతం. అందుకని వారు శివుడిని ఒక్కడినే పూజిస్తారు. మెడలో శివ లింగాన్ని ధరిస్తారు. ఉత్తర కర్ణాటకలోని కల్యాణలో 12వ శతాబ్దంలో నివసించిన బసవన్నను తమ కమ్యూనిటి వ్యవస్థాపకుడిగా లింగాయతులు భావిస్తారు. పౌరానిక పాత్రయిన రేణుకాచార్యతో తమ కమ్యూనిటీ అంకురించిందని వారు విశ్వసిస్తారు. ఎనిమదవ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు కొనసాగిన ఓ భక్తి ఉద్యమంలో నుంచి లింగాయత్‌లు పుట్టుకొచ్చారు. బసవన్న హయాంలో ఈ ఉద్యమం ఉధతంగా సాగింది. ఆధ్యాత్మికతకు కులం ఎప్పుడూ అడ్డుకాకూడదని బసవన్న బోధించిన కారణంగా తాము అన్ని కులాలను సమానంగానే చూస్తామని, తమకు తమ సంస్కతి, తమ మతమే ముఖ్యమని లింగాయత్ నేతులు చెబుతుంటారు. శివుడు సష్టించిన ఈ జగతిని తమకు అనుకూలంగా మల్చుకోవడానికే వేదాలు వచ్చాయని బసవన్న వాదించారు కనక తాము వేదాలను వ్యతిరేకిస్తామని వారు చెబుతారు. వీర శైవులు వేద సంప్రదాయాలనే కాకుండా కొన్ని స్థానిక సంప్రదాయాలను కూడా వ్యతిరేకించారని చరిత్రకారుడు ఏకే రామానుజం ‘స్పీకింగ్ ఆఫ్ శివ’ అనే తన పుస్తకంలో చెప్పారు. స్థానిక సంస్కతిలో భాగమైన జంతు బలులను వారు వ్యతిరేకిస్తారు. వారు పూర్తి శాకాహారులు. అయితే లింగాయతులు, వీరశైవులు సమానార్థాలని, ఇరువురు ఒక్కటేనని రామానుజం అభిప్రాయపడ్డారు. హిందూ మతంలో ముఖ్య దేవుడైన శివుడిని లింగాయత్‌లు పూజించడమే కాకుండా కర్మ, పునర్జన్మలుంటాయని విశ్వాసిస్తారు కనుక వారు హిందూ మతంలో భాగమేనని లింగాయత్‌లపై పలు పరిశోధనలు చేసిన ప్రముఖ చరిత్రకారుడు విలియం మాక్ కార్మ్యాక్ లాంటి వారు చెప్పారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా లింగాయత్‌లు హిందువుల్లో భాగమేనని పార్టీ ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని మొన్నటి నుంచి చెబుతున్నారు. హిందువుల నుంచి లింగాయత్‌లు విడిపోతే తమకు నష్టం వాటిల్లుతుందని బీజేపీ కర్ణాటక నాయకులు చెబుతున్నారు. లింగాయత్లంతా మూకుమ్మడిగా తీర్మానంచేసి పట్టుకొస్తే వారిని ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లింగాయత్ నాయకులకు మాటిచ్చారు. ఇటీవలి వారి బహిరంగ సభకు 50 వేలకుపైగా జనం రావడమే ఆయన మాటకు కారణమైని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందువులకు దగ్గరగా ఉండే బౌద్ధులను మైనారిటీ మతంగా గుర్తిస్తున్పప్పుడు తమను గుర్తించడానికి అడ్డం ఏమిటని లింగాయత్ నేతలు వాదిస్తున్నారు.