breaking news
Social reformers
-
స్ఫూర్తిదాయక మహిళామణులు
సమాజం ఎప్పుడు మగవారు చేసే పనికే విలువ ఇస్తుంది. మగవారు అంటేనే శక్తిమంతులు, ఏమైనా చేయగలరు అనే భావనలో ఉంటుంది. స్త్రీ అంటే బలహీనురాలు, ఇంటిని చక్కపెట్టుకోవడం వరకే ఆమెకు చేతనవుతుంది అనే అనుకుంటుంది. కానీ ఇక్కడ మనందరం ఒక విషయాన్ని మరవకూడదు భారత స్వాతంత్ర పోరాటానికి పునాది వేసిందే ఒక మహిళా....నేటి మారుతున్న సమాజంతో పాటు స్త్రీ పాత్ర కూడా మారింది. ప్రస్తుతం భారతీయ మహిళా అంటే కేవలం ఇంటికే పరిమితమయ్యే ఒక అబల కాదు. నేడు ప్రతిరంగంలో వారు దూసుకుపోతున్నారు. తమను బంధించే సనాతన ఆచార సంప్రదాయాలను తెంచుకుని ప్రతిరంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. కేవలం ఇంటిని చక్కబెట్టడం మాత్రమే కాకుండా సామాజిక మార్పు కోసం కృషి చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో ప్రముఖమైన మహిళా సామాజిక సంఘసంస్కర్తల గురించి తెలుసుకుందాం..... ఝాన్సీ లక్ష్మీబాయి భారత స్వాతంత్ర పోరాటంలో తొలి ఘట్టం 1857లో జరిగిన ‘‘సిపాయిల తిరుగుబాటు’’. చరిత్రకేక్కిన ఈ సంఘటనలో పాల్గొన్నది ఒకే ఒక్క మహిళ. కానీ చాలామందికి తెలియని ఆ వీరనారే ఝాన్సీ లక్ష్మీభాయి. భారతీయ స్త్రీ అంటే కేవలం అందానికి మాత్రమే కాదు ధైర్యానికి ప్రతీక అని నిరూపించింది. బ్రిటిష్ వారి కబంధ హస్తాలనుంచి దేశాన్ని విడిపించడం కోసం విరోచితంగా పోరాడి మిగితా వారికి స్ఫూర్తిగా నిలిచింది. సరోజిని నాయుడు భారత స్వాతంత్ర పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయే మరో వనిత సరోజిని నాయుడు. ఆమెకున్న బిరుదు భారత కోకిల. శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించింది. గొప్ప కవయిత్రి కూడా. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్ పదవి నిర్వహించిన తొలి మహిళ. దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఆమే చేసిన సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ఆమేను కైసెర్-ఐ-హింద్ పతకంతో సత్కరించింది. అరుణ రాయ్ మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అవినీతి వల్ల బాధపడినవారే. కానీ ఎవ్వరూ ముందుకు వచ్చి దీనిగురించి పోరాడినవారు లేరు అలాంటి సందర్భంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని, ప్రభుత్వంలో పారదర్శకతను తీసుకురావాలని నిర్ణయించుకుంది ఒక మహిళ. ఆమే అరుణ రాయ్. ఒక టీచర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించి తర్వాత గొప్ప సామాజిక కార్యకర్తగా మారింది. ఆమె 1967 సంవత్సరంలోఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. కార్మికులు మరియు రైతులు మేలు కోసం స్థాపించినన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (ఎమ్కేఎస్ఎస్)లో చేరి ప్రముఖ నాయకురాలిగా ఎదిగింది. సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ) రావాడానికి కారణం ఆమే చేసిన కృషే. అవినీతి రహిత సమాజం కోసం ఆమే చేస్తున్న కృషికి గాను ఎన్నో అవార్డులు అందుకుంది. మేధాపాట్కర్ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో ప్రాజేక్టులను తలపెడుతుంది. కానీ దాని వల్ల నిర్వాసితులైన వారి గురించి మాత్రం పట్టించుకోదు. అలాంటివారి తరుపున నిలబడి పోరాడుతున్న మహిళ మేధా పాట్కర్. ఒక ప్రముఖ కార్మిక నాయకుడి ఇంట్లో జన్మించిన పాట్కర్‌కు సమాజసేవ అంటే మక్కువ. కార్మికులు,రైతుల జీవితాలను మెరుగుపర్చడం ఆమే లక్ష్యం. ఆమే చిన్నతనం నుంచే సమాజసేవను ప్రారంభించింది. కానీ నర్మాదా బచావో ఆందోళన ద్వారా అందరికి ఆమే పరిచితురాలయ్యింది. కిరణ్ బేడి పరిచయం అవసరంలేని మహిళ. మనదేశంలో పోలీసులంటే అందరికి భయమే, స్త్రీలకయితే మరీనూ. అలాంటి రంగంలో మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. ఆమే ప్రముఖ సామాజిక కార్యకర్త. కిరణ్ బేడి సంకల్పం, అంకితభావం ఉంటే ప్రతి ఒక్కరూ తన లక్ష్యాన్ని సాధించవచ్చనడానికి ఆమె ఒక ఉదాహరణ. పశ్చిమ ఢిల్లీలో ఐపిఎస్ అధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలపై జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాయి. తీహార్ జైల్లో ఆమె తీసుకువచ్చిన సంస్కరణలకు గాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. 1993లో రామన్ మెగసెసే అవార్డును కూడా అందుకుంది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్‌కి మొదటి పోలీస్ సలహాదారుగా కిరణ్ బేడి నియమితురాలయ్యింది. షాహీన్ మిస్త్రీ సమాజంలోని అసమానతలకు ప్రధాన కారణం విద్య. మనదేశంలో విద్యాహక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించినప్పటికీ నేటికి ఎంతో మందికి అది అందని ద్రాక్షేగానే మిగిలింది.ఇలాంటి పరిస్ధితుల్లో మురికివాడల పిల్లల పరిస్థితి మరీ దారుణం. అలాంటి ముంబై మురికివాడల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం కృషి చేస్తున్న వ్యక్తి షాహీన్ మిస్త్రీ. ముంబైలో సామాన్య కుటుంబంలో పుట్టినన షాహీన్ మిస్త్రీ సమాజంలో విద్యా సమానత్వం కోసం ముంబయి మురికివాడల పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పించడం కోసం చేసిన పోరాటాలు నేడు ఆమేకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చాయి. ముంబాయి మురికివాడల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందిచడం కోసం ఆమే ‘‘ఆకాంక్ష ఫౌండేషన్’’ను స్థాపించింది. ఆమే చేసిన సేవలకు గాను ఎన్నో గ్లోబల్ పురస్కారాలను అందుకుంది. ఇరోమ్ షర్మిల ఈశాన్య రాష్ట్రాలు ప్రకృతి అందాలకే కాదు, ఎల్లప్పుడు సైనిక పహారాలో ఉండే ప్రాంతాలుగా ప్రాచుర్యం పొందాయి. అక్కడి సాయుధ దళాలకు కేంద్రం ఎన్నో ప్రత్యేక అధికారాలను కల్పించింది. దాంతో వారి విచ్చలవిడితనానికి హద్దులు లేకుండా పోయింది. ఇందుకు నిదర్శనం ‘‘మాల్కం-ఊచకోత’’. ఈ ఘటనలో పదిమంది అమాయకులను కారణం లేకుండా హతమార్చాయి సైనిక దళాలు. ఈ దాడితో చలితురాలై, ఏకధాటిగా 500వారాల పాటు నిరహారదీక్ష చేస్తూ ఉక్కుమహిళాగా గుర్తింపు పొందింది మణిపూర్‌కు చెందిన ఇరోమ్ షర్మిల. కేంద్రం ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేస్తున్నసాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణకోసం షర్మిల చేపట్టిన ఈ దీక్ష ప్రపంచంలోనే సుదీర్ఘ నిరాహార దీక్ష. ప్రమీలా నెసర్గి ప్రమీలా నెసర్గి వృత్తిరిత్యా న్యాయవాది ప్రవృత్తిరిత్యా మహిళల హక్కుల కోసం పోరాడే ఒక ప్రసిద్ధ సామాజిక కార్యకర్త. స్వతంత్ర న్యాయవాది అయినా ఆమే బాల కార్మికులు,లైంగిక హింస, మహిళల భద్రత, ఖైదీల దుస్థితి వంటి కొన్ని తీవ్రమైన సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తన వృత్తిలో భాగంగా పలు వివాదాస్పద సమస్యలను చేపట్టి అనేక విమర్శలు ఎదుర్కొంది. లక్ష్మి అగర్వాల్ తమ మొహం మీద చిన్న మొటిమ, మచ్చ వస్తేనే ఆడపిల్లలు భరించలేరు, అలాంటిది మొహం మీద యాసిడ్దాడి జరిగితే వారి పరిస్థితి వర్ణానాతీతం. నలుగురిలో కలవడం కాదు కదా అసలు సమాజమే వారిని దూరం పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని మహిళల పట్ల జరిగే శారీరక, మానసిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంది లక్ష్మి అగర్వల్ ఓ యాసిడ్ దాడి బాధితురాలు. ఈ ఘటన తర్వాత సుప్రీం కోర్టు యాసిడ్ అమ్మకాలకు కొన్ని నియంత్రణలను రూపొందించింది, యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా కొన్ని కఠిన చట్టాలను చేసింది. ప్రస్తుతం లక్ష్మీ అగర్వాల్ భారతదేశంలో యాసిడ్ దాడుల నిరోధానికి నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రచారకురాలిగా, టీ.వీ. వ్యాఖ్యతగా వ్యవహరిస్తుంది. -
సౌదీలో సినిమాలపై నిషేధం ఎత్తివేత
రియాద్: సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. దేశంలో నాలుగు దశాబ్దాల కిందట సినిమా ప్రదర్శనలపై విధించిన నిషేధాన్ని సోమవారం ఎత్తివేశారు. దీంతో చలన చిత్రాలకు అనుమతుల మంజూరు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘గత 35 ఏళ్లుగా ఉన్న నిషేధం తొలగడంతో తొలిసారిగా 2018లో వాణిజ్య సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది. దేశ సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇది మేలిమలుపు కానుంది’ అని సౌదీ సాంస్కృతిక, సమాచార శాఖ మంత్రి అవ్వాద్ అలవ్వాద్ చెప్పారు. దీనిపై సౌదీ చలన చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న సినీ పరిశ్రమకు సర్కారు నిర్ణయం మరింత ఊపునిస్తుందని అభిప్రాయపడింది. సినిమాలు నైతిక విలువలను మంటగలుపుతాయని, సాంస్కృతిక, మత విశ్వాసాలకు విఘాతం కలిగిస్తాయన్న ఛాందసవాదుల ఆందోళనల నేపథ్యంలో 1980ల్లో వీటిపై నిషేధం విధించారు. -
విడ్డూరం: ఈ గడుగ్గాయి గ్లామర్ క్వీన్!
క్రిస్టీనా పిమెనోవా... ఈ పేరు మన దేశస్తులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ రష్యాలో ఈ పేరు విన్నవాళ్ల ముఖాల్లో ఓ వింత మెరుపు కనిపిస్తుంది. క్రిస్టీనా గురించి మాటల ప్రవాహం మొదలవుతుంది. ఎందుకంటే... ఏడేళ్ల ఆ చిన్నారి అంత ఫేమస్ మరి! 2005లో మాస్కోలో జన్మించింది క్రిస్టీనా. తండ్రి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తల్లి కూడా ఒకప్పుడు ఉద్యోగం చేసేది కానీ, ఇప్పుడు మానేసింది. దానికి కారణం క్రిస్టీనాయే. క్యూట్‌గా ఉండే క్రిస్టీనాని చూసినవాళ్లంతా... భలే ఉంది మీ అమ్మాయి, పెద్దయ్యాక సూపర్ మోడల్ అయిపోతుంది, తనని మోడల్‌నే చేయండి అనేవారట. ఆ మాటల్లో నిజం లేకపోలేదనిపించింది క్రిస్టీనా తల్లికి. అందుకే మూడేళ్ల వయసులోనే కూతురిని మోడల్ని చేసేసింది. యాడ్స్‌లో నటింపజేసింది. ముద్దులొలికే క్రిస్టీనా అందరి మనసులనూ దోచేసుకుంది. కళ్లు మూసి తెరిచేలోగా పెద్ద మోడల్ అయిపో యింది. ఆమె కాల్షీట్లు చూడటానికి ఉద్యోగం మానేయాల్సి వచ్చింది ఆమె తల్లికి! డబ్బుకి డబ్బు, పేరుకి పేరు, దేశాలు తిరిగే చాన్స్... క్రిస్టీనా విషయంలో తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ ఏడేళ్ల చిన్నారిని ఇలా గ్లామర్ ప్రపంచంలో తిప్పడం ఆ చిన్నారి అందమైన బాల్యాన్ని హరించడమేనని అంటున్నారు కొందరు సామాజిక సంస్కర్తలు, మానవతావాదులు. మా చిన్నారిని చదివిస్తూనే ఇవన్నీ చేయిస్తున్నాం, ఎవరికో గానీ ఈ చాన్స్ రాదు, వచ్చినప్పుడు ఉపయోగించుకోవడంలో తప్పేముంది అంటారు క్రిస్టీనా తల్లిదండ్రులు. ఈ రెండు వాదనలూ క్రిస్టీనాకు అర్థం కావు. ఆమెకి ఊళ్లు తిరగడం సరదాగా ఉంది. రకరకాల డ్రెస్సులు వేసుకోవడం, తనని అందరూ గుర్తు పట్టడం ఆనందంగా ఉంది. భలే భార్యను పట్టాడు! బ్రెజిల్‌కు చెందిన 74 యేళ్ల క్యాస్టాల్డో భార్యను కోల్పోయి చాలాకాలం అయ్యింది. ఏడుగురు పిల్లల్ని ఒంటరిగా కష్టపడి పెంచాడు. అయితే ఆ ఒంటరితనం విసుగనిపించి, మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. వధువుని కూడా ఎంపిక చేసుకున్నాడు. ఆమె ఎవరో తెలుసా? అతడి పెంపుడు మేక కార్మెల్లా.కార్మెల్లాను రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడట క్యాస్టాల్డో. అది చాలా సౌమ్యురాలట. తను ఎలా చెబితే అలా వింటుందట. దానితో ఉంటే సమయమే తెలీదట. అంతకంటే మంచి భార్య ఎక్కడ దొరకుతుంది అనుకుని దాన్నే పెళ్లాడేయడానికి రెడీ అయిపోయాడు. కానీ ఆ పెళ్లితంతు జరపడానికి అక్కడి చర్చి యజమానులెవరూ ఒప్పుకోలేదు. నానా తంటాలు పడి చివరికి ఎక్కడో ఓ మూలనున్న చర్చివాళ్లను ఒప్పించాడు. అక్టోబర్ 13న నా పెళ్లికి రండి అంటూ ఆహ్వానాలు పంపుతున్నాడు. ఈ వయసులో ఇదేం పని, పైగా మేకను పెళ్లాడటమేంటి అంటే... నా ఏడుగురు పిల్లలూ కార్మెల్లాను తల్లిగా అంగీకరించారు, వాళ్లకు లేని బాధ మీకేంటి అంటూ మండిపడుతున్నాడు. ముసలాయనకి మతి భ్రమించలేదు కదా అంటూ గుసగుసలాడుతున్నారంతా!